అన్వేషించండి

Guppedantha Manasu Serial Today Episode: శిరీశ్ వెళ్లాడు గౌతమ్ వచ్చాడు, వసుధారపై కోప్పడిన రిషి .. మళ్లీ ఇద్దరి మధ్యా దూరం పెరుగుతుందా..

గుప్పెడంతమనసు సీరియల్ ఈ రోజు (సోమవారం) డిసెంబర్ 13న ప్రసారం కానున్న ఎపిసోడ్ లో దేవయాని ప్లాన్ లో చిక్కుకున్నాడు రిషి. వసుధారపై ఫైరవడమే కాదు తల్లిదండ్రులను దూరం చేసుకునేందుకు సిద్ధం చేసింది దేవయాని.

రెస్టారెంట్‌కు వెళ్లిన దేవయాని..రిషి వస్తున్నాడో లేదో క్లారిటీ తీసుకున్నాక జగతి, వసుధార ని రెచ్చగొట్టే పనిలో పడుతుంది అవకావం వచ్చినా కూడా నువ్ విదేశాలకు ఎందుకు వెళ్లలేదు? అని వసుని దేవయాని అడుగుతుంది. మరి మీరు కాలేజ్‌కి వెళ్లి పని చేయోచ్చు కదా అని నేను అనడం లేదు కదా ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకండని వసు కౌంటర్ వేస్తుంది. పని పాట లేకుండా ఇలా కబుర్లు చెబుతున్నారేంటి? అని దేవయానిని జగతి అడుగుతుంది. తప్పు గురించి చెబుతున్నాను అని దేవయాని అంటే.. నువ్ తప్పొప్పుల గురించి మాట్లాడటం కంటే పెద్ద తప్పేమీ లేదని జగతి సెటైర్ వేస్తుంది. రిషి వచ్చే లోపు గేర్ పెంచాలి రెచ్చగొట్టాలి అనుకుంటుంది. ఇంతలో కాఫీ వస్తుంది. తాగండి.. ఇక్కడ కాఫీ బాగుంటుందని వసు చెబుతుంది. కాఫీ బాగుంది వసుధార నిజం చెప్పింది. నీక్కూడా కొన్ని నిజాలు చెప్పాలి.. నువ్, నీ శిష్యురాలు పద్దతులు మార్చుకోవాలి అని దేవయాని అంటుంది. మీరు మాకు జ్ఞాన బోధ చేయాలని వస్తే మాత్రం ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చు అని వసు మొహం మీదే చెబుతుంది. మాటకి మాట చెబుతున్నావే  నీ కన్నా జగతే నయం. తను ఇంకా నాకు భయపడుతుందని అంటంది దేవయాని. 

అక్కయ్య మీరు ఏదో మనసులో పెట్టుకుని వచ్చారని జగతి అంటే  చాలా దాచుకుని వచ్చాను నువ్, నీ శిష్యురాలు రిషిని మీ వైపుకు తిప్పుకోవాలని చాలా చేస్తున్నారంటుంది  దేవయాని. రిషి సర్ కాలేజ్‌కి ఎండీ.. చిన్న పిల్లాడేం కాదు ఆయన్ను ఎవ్వరూ తిప్పుకోవాలని చూడటం లేదని వసు అంటుంది. అవును అదే నిజం అనుకోండి రిషి మేడం కొడుకే కదా? తిప్పుకుంటే తిప్పుకుంటారు.. దాంట్లో తప్పేముంది.. అని వసు ఫైర్ అవుతుంది. జగతి ఇది రెస్టారెంట్ కాబట్టి నోర్మూసుకున్నాను చిన్న మాట అన్నందుకు నీకు, నీ శిష్యురాలికి ఇంత కోపం వస్తుంటే వీటిని చూస్తే నాకు ఎంత కోపం రావాలి అంటూ అర్దరాత్రి రిషి-వసు దిగిన సెల్ఫీ ఫోటోలను చూపించి హడావుడి చేస్తుంది దేవయాని.  ఫోటోలు మీ దగ్గరకు ఎలా వచ్చాయని వసు అంటే ఎలా వచ్చాయ్ అని కాదు ఎందుకు దిగారని అడుగుతున్నాను అని దేవయాని ప్రశ్నిస్తుంది. వయసు వచ్చిన కొడుకు మీదకు వసుని ఉసి గొల్పుతున్నావా?. చీ చీ.. అని దేవయాని అసహ్యించుకుంటుంది. ఈ ఫోటోలు నాకే వచ్చాయని అనుకుంటున్నావా? ఎంత మందికి వెళ్లి ఉంటాయో ఏమనుకుంటారో చెప్పు ఏం జగతి మాట్లాడవేంటి ఈ ఫోటోలేనా? ఇంకేమైనా ఉన్నాయా? అని రెచ్చగొడుతుంది. 

ఈ ఫోటోల్లో ఏమున్నాయని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని వసు ప్రశ్నిస్తుంది. ఏం చేస్తావేంటి మా కుటుంబ పరువు బజారు కీడ్చుతున్నావా? ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేద్దామని అనుకుంటున్నావా ఒక్కడే కొడుకు కదా అని ఆస్తి కోసం వల విసురుతున్నారా అని దేవయాని రెచ్చిపోతుంది. మేడం మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు మర్యాదగా మాట్లాడండి అసలేం అనుకుంటున్నారు మీరు ఏం మాట్లాడుతున్నారు నా సంగతి మీకు తెలియదు మేడం నేను జగతి మేడంలా కాదని నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదంటుంది వసు. రిషి ఎంట్రీతో దేవయాని మరింత రెచ్చిపోతుంది. ఏంటి నన్ను బెదిరిస్తున్నావా అంటూ దేవయాని హడావుడి చేయడంతో జగతి మధ్యలో చెప్పినా వినకుండా వసు బ్లాక్ మెయిల్ ఏంటని గట్టినా నిలదీస్తుంది. . ఇంతలో వసు తనను తోసేసినట్టుగా నటించి దేవయాని కింద పడుతుంది. వసుధారా అని అరుస్తూ వెళ్లిన రిషి పెద్దమ్మా అంటూ పైకి లేపుతాడు. రిషి వీళ్లు అని అంటూ దేవయాని నటించేస్తుంది. వసుధార బుద్ది ఉందా నీకు, పెద్దమ్మ మీదకు వేలు చూపిస్తావా? కుర్చీ విసురుతావా? ఛీ ఛీ.. అని అసహ్యించుకుంటాడు. నన్ను చంపేస్తున్నారు రిషి కాలు విరిగిందేమో రిషి కుర్చీ మీదకు విసిరింది రిషి అంటుంది దేవయాని.

నేను కుర్చీని విసరడం ఏంటి.. అని వసుధార అంటే షటప్ వసుధార మాట్లాడొద్దు అన్నాగా నా కళ్లతో నేను చూశాను, నా చెవులతో నేను విన్నాను పెద్దమ్మ వయసుకన్నా గౌరవం ఇవ్వాలని తెలియదా? మీకు  ఛీ ఛీ ఏం మనుషులో మీరు నీతులు చెబుతారు,  కొటేషన్స్ చెబుతారు, ఇలాంటిదేదో జరుగుతుందనే ఇక్కడకు వచ్చానంటూ దేవయానిని లేపేందుకు రిషి ప్రయత్నిస్తాడు. జగతి హెల్ప్ చేసేందుకు వస్తుంటే పెద్దమ్మని టచ్ చేయోద్దు. దగ్గరుండి చేయించారు కదా? ఇదంతా అని రిషి ఫైర్ అవుతాడు. జరిగిందేంటో తెలుసుకోకుండా అని వసు అనేలోపు షటప్ వసుధార అని మరింత రెచ్చిపోతాడు రిషి. ఇంకొంక మాట మాట్లాడినా అమ్మాయివని కూడా చూడను మా పెద్దమ్మని అలా చేస్తావా?.. పెద్దమ్మ మీద దాడి చేస్తున్నారు.. అని రిషి అంటాడు. దాడి ఏంటి సర్.. ఆవిడే వచ్చి మమ్మల్ని తిడుతుంటే అని జగతి అంటే మేడం మీ ఇద్దరిలో ఏ ఒక్కరు మాట్లాడినా మర్యాదగా ఉండదని రెచ్చిపోతాడు.

ఇంతలో మహేంద్ర వస్తాడు. ఏం జరిగిందో తెలుసుకున్నావా? వాళ్లు ఎందుకు దాడి చేస్తారు? అని మహేంద్ర అనడంతో రిషి ఇంకా రెచ్చిపోతాడు. ఇంకొక్క మాట వాళ్లకు సపోర్ట్‌గా మాట్లాడినా కూడా జీవితంలో మీతో ఇక నేను కూడా మాట్లాడనని రిషి అనడంతో మహేంద్ర షాక్ అవుతాడు. తమరు వాళ్ల పార్టీనే కదా? జరిగిందేంటో నా కళ్లారా చూశాను థ్యాంక్స్ వసుధార చాలా చాలా థ్యాంక్స్ మా పెద్దమ్మ మీదకే వేలు చూపించావ్, గాయపరిచావ్, నాకు మంచి గిఫ్ట్ ఇచ్చావ్, నువ్ కాకుల గుంపులో ఉన్న కోయిలమ్మ అనుకున్నాను. నా అంచనా తప్పని నిరూపించావ్. నువ్ ఒక ప్రత్యేకమైన దానివని అనుకున్నాను. నువ్ కూడా మామూలు మనిషిలా బిహేవ్ చేశావ్. అందరితో ఉంటూ అందరిలా మారిపోయావ్. నీ అస్థిత్వాన్ని కోల్పోయావ్, ఐ హేట్ యూ పదండి పెద్దమ్మ అని రిషి చెప్పి వెళ్లిపోతాడు. ఏంటి జగతి ఏంటిది.. ఏం జరిగింది.. అని మహేంద్ర అడుగుతాడు. ఇంతలో దేవయాని కన్ను కొట్టేసి వెళ్లిపోతుంది. రిషి దెబ్బ బాగా తగిలినట్టుంది నొప్పి ఎక్కువగా ఉందని  నటిస్తుంది. పెద్దమ్మ కాసేపు ఓర్చుకోండి వాళ్ల దగ్గరికి ఎందుకు వెళ్లారు, ఏదైనా ఉంటే నాకు చెప్పొచ్చు కదా అంటాడు. ఇప్పుడేం చెప్పలేనంటూ మాట దాటవేస్తుంది దేవయాని. కాసేపు ఓపిక పట్టండి పెద్దమ్మ అని రిషి చెబుతాడు. ఈ మాత్రం డోస్ ఇస్తేనే కానీ నుమ్ మారవు.. ఈ మధ్య నువ్ వాళ్ల వైపు మొగ్గుతున్నావ్.. అని దేవయాణి తన మనసులో తాను రిషి గురించి అనుకుంటుంది. ఏ తప్పు చేసినా క్షమిస్తానేమో గానీ.. పెద్దమ్మను బాధపెడితే క్షమించేది లేదని వసు గురించి లోలోపల అనుకుంటాడు రిషి. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. 

మంగళవారం ఎపిసోడ్
ఇక రేపటి ఎపిసోడ్‌లో కొత్త కారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. గౌతమ్ అనే వ్యక్తి వసుకు పరిచయమవుతాడు. రోడ్డు మీద ఎవరికో యాక్సిడెంట్ అయితే వసు కాపాడే ప్రయత్నం చేస్తుంది. దానికి గౌతమ్ సాయపడతాడు. వసు మీద ఇష్టం పెంచుకుంటాడు. అలా మొత్తానికి ఇప్పుడు శిరీష్ స్థానంలో గౌతమ్ వచ్చి  చేరాడు. మరి రిషికి పోటీగా గౌతమ్ వసుకి దగ్గరవుతాడేమో చూడాలి.

Also Read: కార్తీక్ ఆచూకీ కోసం ఫస్ట్ స్టెప్ వేసిన మోనిత.. డాక్టర్ బాబుకి క్లాస్ పీకిన దీప.. ‘కార్తీకదీపం’ డిసెంబర్ 13 ఎపిసోడ్
Also Read: అర్థరాత్రి వరకూ చాటింగ్, పొద్దున్నే గులాబీలతో స్వాగతం.. పట్టాలెక్కిన రిషి-వసుధార లవ్ ట్రాక్..
Also Read: డాక్టర్ బాబుని అవమానించిన పిల్లలు… రుద్రాణి వలలో దీప చిక్కుకుంటుందా, కార్తీక దీపం ఈ రోజు ఎపిసోడ్
Also Read: తనలో డాక్టర్ బాబుని కంట్రోల్ చేసుకున్న కార్తీక్.. ఇదేంటని ప్రశ్నించిన దీప.. మరింత ఎమోషనల్ గా మారిన కార్తీక దీపం సీరియల్
Also Read: బిగ్‌ బాస్‌లో మెరిసిన టీఆర్ఎస్ ఎంపీ.. వెయ్యి ఎకరాల అడవి దత్తత తీసుకుంటానని నాగార్జున హామీ
Also Read: బన్నీతో సమంత 'నాటు' స్టెప్.. ఊరమాస్ ఉందే..
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Liquor Scam: దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
Revanth in delhi: ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
Nara Lokesh: ఉత్తరాంధ్రలో జార్జియా నేషనల్ యూనివర్సిటీ - నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాలు
ఉత్తరాంధ్రలో జార్జియా నేషనల్ యూనివర్సిటీ - నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాలు
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రిటీలు ఇక సేఫ్..!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రిటీలు ఇక సేఫ్..!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Fun Moments with Deepak Chahar | CSK vs MI మ్యాచ్ లో ధోని క్యూట్ మూమెంట్స్ | ABP DesamMS Dhoni Lightning Stumping | కనురెప్ప మూసి తెరిచే లోపు సూర్య వికెట్ తీసేసిన ధోనీ | ABP DesamSRH vs RR Match Highlights IPL 2025 | అరాచకానికి, ఊచకోతకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోతున్న సన్ రైజర్స్ | ABP DesamIshan Kishan Century Celebrations | SRH vs RR మ్యాచ్ లో ఇషాన్ కిషన్ అలా ఎందుకు చేశాడంటే.? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Liquor Scam: దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
దుబాయ్‌కు రూ.2వేల కోట్లు తరలించిన జగన్ బంధువు సునీల్ రెడ్డి - లోక్‌సభలో టీడీపీ ఎంపీ సంచలన ఆరోపణలు
Revanth in delhi: ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
ఎట్టకేలకు పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ - రేవంత్‌ను హైకమాండ్ పిలిపించింది అందుకేనా ?
Nara Lokesh: ఉత్తరాంధ్రలో జార్జియా నేషనల్ యూనివర్సిటీ - నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాలు
ఉత్తరాంధ్రలో జార్జియా నేషనల్ యూనివర్సిటీ - నారా లోకేష్ సమక్షంలో ఒప్పందాలు
Betting Apps Promotion: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రిటీలు ఇక సేఫ్..!
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఊహించని ట్విస్ట్.. సెలబ్రిటీలు ఇక సేఫ్..!
Gajwel Politics: కేసీఆర్‌పై అనర్హతా వేటు వేయాలని గజ్వేల్ కాంగ్రెస్ కార్యకర్తల పాదయాత్ర - చిల్లర రాజకీయం అని హరీష్ ఆగ్రహం
కేసీఆర్‌పై అనర్హతా వేటు వేయాలని గజ్వేల్ కాంగ్రెస్ కార్యకర్తల పాదయాత్ర - చిల్లర రాజకీయం అని హరీష్ ఆగ్రహం
Sunny Deol: 'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
'బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ వారిని చూసి నేర్చుకోవాలి' - సౌత్ సినిమాల్లో కథే హీరో అన్న బాలీవుడ్ స్టార్ సన్నీ దేవోల్
Vijay: దళపతి విజయ్ ఆఖరి మూవీ 'జన నాయగన్' - థియేటర్లలోకి వచ్చేది అప్పుడే..
దళపతి విజయ్ ఆఖరి మూవీ 'జన నాయగన్' - థియేటర్లలోకి వచ్చేది అప్పుడే..
Tasty Watermelon : పుచ్చకాయ కోయకుండానే టేస్టీగా ఉంటుందో లేదో ఇలా చెక్ చేసేయండి.. సింపుల్ ట్రిక్
పుచ్చకాయ కోయకుండానే టేస్టీగా ఉంటుందో లేదో ఇలా చెక్ చేసేయండి.. సింపుల్ ట్రిక్
Embed widget