Guppedantha Manasu October 5th Update: పంటపొలాల్లో ప్రేమపక్షుల విహారం, మరోసారి విషం చిమ్మిన దేవయాని
Guppedantha Manasu October 5th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు బుధవారం ఎపిసోడ్ ( Guppedantha Manasu October 5th Today Episode 573)
రిషి క్యాబిన్ కి వెళ్లిన వసుధార అక్కడున్న కుర్చీలతో, టేబుళ్లతో మాట్లాడుతూ ఉంటుంది. ఈ కుర్చీలో కూర్చుందామా అనుకుని మన రిషిసారే కదా అని కూర్చుంటుంది. ఇదంతా రిషి బయటినుంచి వీడియో తీస్తాడు.
రిషి: చాక్లెట్ తిందామా...మీకు సగం నాకు సగం..మీ వాటా కూడా నేనే తినేస్తాను. రిషి, వసు...వసు, రిషి... రిషిధార భలే ఉంది కదా అంటూ హిషి ఆ పక్కనే పెట్టుకున్న హార్ట్ సింబల్ చేతిలోకి తీసుకుంటుంది. ఇంతలో రిషి ఫోన్ రింగవడంతో కంగారుగా వసుధార హార్ట్ సింబల్ పడేయబోతుంటే కాల్ కట్ చేసి రిషి క్యాబిన్లోకి ఎంట్రీ ఇస్తాడు.
రిషి: ఏంటిక్కడ
వసు: అది..అది..అని నసిగి..నను మళ్లీ కలుస్తాను సార్ అనేసి అక్కడి నుంచి పారిపోతుంది...
వసుధార వదిలేసిన చాక్లెట్ ని, హార్ట్ సింబల్ ని చేతిలోకి తీసుకుంటాడు....
Also Read: వసుకి చాటుగా వీడియో తీసిన రిషి, కొడుకు మనసు తెలుసుకున్న జగతి
బయట మహేంద్ర-జగతి నిల్చుని మాట్లాడుకుంటారు...నువ్వు ఎప్పటిలా హుషారుగా లేవు..ఏం జరిగింది మహేంద్ర.. రిషితో గొడవపడ్డావా..రిషి ఏమైనా అన్నాడా అని జగతి అంటే..ఏమీలేదు..తను ఏమైనా అంటే నేనెందుకు ఫీలవుతాను అని రిప్లై ఇచ్చిన మహేంద్ర..మనసులో మాత్రం రిషి గురించి జగతికి చెప్పడం ఎందుకు అనుకుంటాడు. అంతలో రిషి బయటకు వచ్చి జగతిని అక్కడే చూసి..మీరు వెళ్లలేదా అని అడిగితే..జగతికి ఒంట్లో బాలేదు అందుకే వసుధార మాత్రమే వెళ్లిందని చెబుతాడు మహేంద్ర. అంతదూరం బైక్ పై ఒక్కతే ఎలా వెళుతుందని ఫైర్ అయిన రిషి కారు తీసుకుని వెళ్లిపోతాడు... వసుని ఫాలో అవుతాడు. టూ వీలర్ మీద అంత దూరం వెళ్లడం అవసరమా ఈ పొగరుకి అస్సలు తనపై శ్రద్ధ లేదనుకుంటూ కాల్ చేస్తాడు. కాల్ లిఫ్ట్ చేయకుండానే వసు డ్రైవింగ్ లో బిజీ అంటుంది. ఇలా బైక్ నడుపుతూ గట్టిగా అరుస్తూ పాటలు పాడుకుంటూ వెళితే ఎంత బావుంటుందో అనుకుంటుంది వసుధార. విజిట్ చేయాల్సిన ఏరియాకు వెళ్లి బైక్ దిగిన తర్వాత రిషి కాల్ చేసిన విషయం చూసుకుని కాల్ చేస్తుంది..ఇంతలో రిషి వసు వెనుకే నిల్చుని ఉంటాడు. మీరేంటి సార్ అని వసు అంటే వెళ్లిపోమంటావా అంటాడు. మేడం రాలేదని నేను వచ్చాను..అసలు నేను ఎందుకొచ్చానో తెలుసా నిన్ను తిట్టాలని వచ్చానంటాడు...
రిషి: నువ్వు టూ వీలర్ పై తిరిగితే ఎలా..వర్షాలు పడుతున్నాయి వర్షంలో చిక్కుకుపోతే ఎలా ఇలాంటి సాహసాలు చేయొద్దు
ఇంతలో స్లమ్ వాళ్లు అక్కడకు వస్తారు...పొలం గట్లపై నడుస్తూ తూలి పడబోతున్న వసుని రిషి పట్టుకుంటాడు. మేడంకి కొత్త కదా సార్ అని అక్కడున్నవాళ్లు అనడంతో..నేను పల్లెటూరి అమ్మాయిని అంటూ పెద్ద క్లాస్ వేస్తుంది. వసుధార జాగ్రత్తగా నడువు అని చెప్పి తాను తూలిపడబోతుంటాడు..అప్పుడు వసుధార పట్టుకుంటుంది.
Also Read: కార్తీక్ ముందు మోనితని అడ్డంగా బుక్ చేసేసిన దుర్గ, డాక్టర్ బాబు బర్త్ డే సెలబ్రేట్ చేసిన వంటలక్క
సోఫాలో కూర్చుని మహేంద్ర..రిషి మాటలు తల్చుకుంటూ ఉంటాడు. కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది దేవయాని
దేవయాని: కాఫీ ఇచ్చానని ఆశ్చర్యపోతున్నావా నా దగ్గర ఇలాంటి సర్ ప్రైజ్ లు చాలా ఉన్నాయి అంటుంది. సారీ చెప్పించిందని, సారీ చెప్పావని ఫీలవుతున్నావా..అది రిషికి నాపై ఉన్న ప్రేమ..సారీ చెప్పినంత మాత్రాన కిరీటాలు పడిపోతాయా ఏంటి..లోపల అహం అనేది ఉంటుంది కదా అది తృప్తి పడుతుంది. వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న మహేంద్రని ఆపిన దేవయాని...మీరు వసుధారని మర్చిపోండి నేను సాక్షిని మర్చిపోతాను..మన స్థాయికి తగ్గ సంబంధం చూసి గ్రాండ్ గా రిషి పెళ్లిచేద్దాం...రిషి ఒప్పుకోడంటావా ఒప్పించు మహేంద్ర...
మహేంద్ర: ఆ పనేదో మీరే చేయొచ్చు కదా..
దేవయాని: నేను ఏ పని అయినా చేయగలను..కానీ ఎవరు ఏది చేయాలో వాళ్లే చేయాలి.. రిషికి ఎప్పుడు ఏది చెప్పాలో, ఎలా చేయాలో నాకు తెలుసు.. తండ్రిగా బాధ్యత తీసుకుని రిషిని వేరే సంబంధానికి ఒప్పించు.. చెప్పింది మర్చిపోకు మహేంద్ర అనేసి వెళ్లిపోతుంది..
లోపలకు వెళ్లిన దేవయానికి జగతి ఎదురుపడుతుంది... వెళ్లు వెళ్లు మహేంద్ర ఎందుకో డల్ గా కనిపిస్తున్నాడు... మహేంద్రతో సారీ చెప్పించగలిగిన దాన్ని నేను ఏదైనా చేయగలనని తెలుసుకోవడం మంచిది అంటుంది. మహేంద్ర దగ్గరకు వెళ్లిన జగతి..అక్కయ్య ఏమందని అడిగితే..విషపు నాగు ఎప్పుడూ ఎవర్ని కాటేయాలా అని ఆలోచిస్తుందని రిప్లై ఇస్తుంది..
అటు మిషన్ ఎడ్యుకేషన్ పనులు అయ్యాక తిరిగి వెళుతుండగా ఓ గట్టు కనిపిస్తుంది అక్కడ కూర్చుందాం అంటుంది వసుధార. పొలం చూసొద్దాం రండి సార్ అని లోకల్లో ఉన్నవాళ్లు అనడంతో..నాకు ఓపిక లేదయ్యా బాబు అంటాడు రిషి. వాళ్లు జామకాయలు తీసుకొచ్చి ఇస్తారు..నాకు చాలా ఇష్టం అని వసుధార అనడంతో నీకు ఇష్టం లేనివి ఏమున్నాయని సెటైర్ వేస్తాడు రిషి. ఈ వాతావరణంలో మీరు నేను ఇలా జామకాయలు తింటుంటే చాలా బావుంటుంది కదా అంటుంది వసుధార. ఎపిసోడ్ ముగిసింది...