News
News
X

Guppedantha Manasu October 4Update: వసుకి చాటుగా వీడియో తీసిన రిషి, కొడుకు మనసు తెలుసుకున్న జగతి

Guppedantha Manasu October 4th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు(మంగళవారం) ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
 

గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్  ( Guppedantha Manasu  October 4st Today Episode 572)

వసుధార ఆలోచనల్లో ఉన్న రిషికి  మెసేజ్ వస్తుంది. మిషన్ ఎడ్యుకేషన్ లొకేషన్లు పెట్టింది అనుకుంటాడు. ఎప్పుడు వెళ్లాలని రిప్లై పెట్టడంతో..మీ వీలు చూసుకుని వెళ్లండి అంటుంది. రావొచ్చుగా అని రిషి అనుకుంటే రమ్మని పిలవొచ్చుగా పిలుస్తారులే అనుకుంటుంది. ఇంతలో నువ్వు సెలెక్ట్ చేసిన ఫస్ట్ ప్లేస్ కి మీ మేడంతో కలసి వెళ్లు అని రిప్లై పెడతాడు. ఏంటి రిషి సార్ నా అంచనాలను తారుమారు చేస్తున్నారు అని అనుకుంటుంది వసు. చందమామని చూస్తూ ఇక్కడ రిషి అక్కడ వసు మాట్లాడుకుంటారు. నన్ను అర్థం చేసుకోవడం లేదని రిషి..మీరు జగమొండి జెంటిల్మెన్ అని వసు అనుకుంటారు. ఇంతలో గౌతమ్ వచ్చి ఏరా అక్కడున్నావేంటి అనేసి త్వరగా రా అనేసి వెళ్లిపోతాడు..

జగతి-మహేంద్రా కాలేజీకి బయలుదేరుతారు. కాఫీ తాగి వెళదాం అన్న మహేంద్రతో పద బయలుదేరుదాం అని జగతి అంటుంది. ఇంతలో కిందకు వచ్చిన రిషి మాట్లాడేందుకు ప్రయత్నిస్తాడు కానీ మహేంద్ర ముభావంగా ఉంటాడు. ఏంటి జగతి కాఫీ కోసం ఆగుదాం అంటే వద్దన్నావ్..ఇప్పుడెందుకు ఆగావు పద వెళదాం అని వెళ్లిపోతుంటాడు. రిషి మాట్లాడాలి అనుకున్న విషయం అర్థం చేసుకున్న జగతి..నాకు పని ఉంది వెళతాను అని చెప్పేసి వెళ్లిపోతుంది. అప్పుడు రిషి...మేడం కి నా మనసులో మాట అర్థమైందా లేక నిజంగానే పనుందా  అనుకుంటాడు. ఆ తర్వాత మహేంద్ర, రిషి ఇద్దరూ బయటకొచ్చి ఆగుతారు. పెద్దమ్మకి సారీ చెప్పినందుకు ఇలా ఉన్నారేమో అని రిషి..నేను నిన్న సారి అడిగినందుకు ఏం బాధపడడం లేదు..నీకోసం, కేవలం నీ ఆనందం కోసమే  అలా చేశానని మహేంద్ర అనుకుంటారు. 

Also Read: కార్తీక్ ముందు మోనితని అడ్డంగా బుక్ చేసేసిన దుర్గ, డాక్టర్ బాబు బర్త్ డే సెలబ్రేట్ చేసిన వంటలక్క

News Reels

రిషి-మహేంద్ర: డాడ్ నాకు చిన్నప్పటినుంచి మీరు ఏమి అడిగినా ఇచ్చారు.ఎప్పుడూ నా సంతోషాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని పనులు చేశారు. ఆ ఒక్క పని తప్ప మిగిలింది ఏం అడిగినా మీరు క్షణాల్లో తెచ్చేవారు ..( మహేంద్ర మనసులో నువ్వు అమ్మ కావాలి అని అడిగేవాడిని అది తప్ప అన్ని ఇచ్చాను) నాకు వసుధారా అంటే ఇష్టం డాడ్.నాకు తను కావాలి కానీ నాకు తాను తానుగానే కావాలి  ఈ ఒప్పందాలు ఏవి వద్దు (మహేంద్ర మనసులో నన్ను ఒప్పందం తిరిగి తీసుకోమని చెప్పలేక చెబుతున్నట్టున్నాడు అని అనుకుంటాడు)నాకు వసుధార  వసుధారలాగే కావాలి. నేను తనని ఏ విషయం కోసం వదులుకోవాలనుకోవడం లేదని చెప్పేసి మహేంద్రని హగ్ చేసుకుని వెళ్లిపోతాడు రిషి. మహేంద్ర...ఇప్పుడు రిషి కోసం ఆలోచిస్తే అక్కడ జగతికి అన్యాయం జరుగుతుంది. జగతి కోసం ఆలోచిస్తే, వీళ్ళ ప్రేమ పోతుంది. నాకు వీళ్ళ ప్రేమ ముఖ్యం, రిషి ఆనందానికి అడ్డు రాకూడదు అని అనుకుంటాడు. 

Also Read: ఇద్దరూ ఇద్దరే అసలు తగ్గడం లేదు- రిషి కోసం దేవయాని ముందు తలవంచిన మహేంద్ర

జగతిని కలసిన వసుధార..మేడం బయలుదేరుదామా అంటుంది. ఎక్కడికి అని జగతి అడగడంతో క్యాంప్ కి మేడం అని రిప్లై ఇస్తుంది. నాకు ఒంట్లో బాలేదు వసు నేను రాలేను అని జగతి అనడంత సరే మేడం నేను వెళతాను అంటంది. ఎలా వెళ్తావు అని జగతి అడిగితే నాకు టూవీలర్ ఇచ్చారు నేను వెళ్ళగలను అంటుంది.
జగతి: అంత దూరం ఒక్కదానివే వెళ్తావా అది కూడా టూవీలర్లో 
వసు: నాకు అలవాటే మేడం 
జగతి: నీకు ఈ మధ్య మొండితనం పెరిగిపోతోంది ( వసుతో రిషిని పంపిస్తే బావుంటుందేమో అనుకుంటుంది జగతి) 
అప్పుడే కారు దిగుతారు రిషి, మహేంద్ర. ఆ పక్కనే టూ వీలర్ దానివెనుక వీఆర్ అని రాసి ఉంటుంది. మీరిద్దరూ క్యాంపుకు వెళ్తున్నారా అని మహేంద్ర అడగంతో లేదుసార్ మేడంకి ఒంట్లో బాలేదట నేను వెళ్తున్నాను అంటుంది వసు. నేను కూడా  వస్తాను అని మహేంద్ర అనడంతో...ఆపిన జగతి మనకు ఇక్కడ పనులున్నాయి రిషిని వెళ్లమని అడుగు అని చెబుతుంది. 

రిషి క్యాబిన్ కి వెళుతుంది వసు..అక్కడ రిషి ఉండడు. ఆ కుర్చీ తో, అక్కడున్న వస్తువులతో వసు మాట్లాడుతూ, ఏంటి విశేషాలు? జెంటిల్మెన్ లా ఉంటారు కానీ వస్తువులేవి సరిగ్గా ఉంచుకోరు అని అక్కడ ఉన్నవి సర్దుతూ ఉంటుంది. ఇంతలో రిషి వచ్చి ఓ మూల నుంచి వసుకి వీడియో తీస్తుంటాడు. రిషి సార్ ఎంతో మంచోళ్ళు, ఎంతో ప్రేమ ఉన్నది కానీ అంత ముక్కు మీద కోపం ఏంటి ఆ మనిషికి అని అంటుంది. ఈ కుర్చీలో కూర్చుందామా మన రిషి సారే కదా అని రిషి కుర్చీలో కూర్చుంటుంది వసుధార. అప్పుడు రిషి ఇదంతా వీడియో తీస్తూ ఉంటాడు. 
ఎపిసోడ్ ముగిసింది.... 

 

Published at : 04 Oct 2022 10:09 AM (IST) Tags: Guppedantha Manasu Guppedantha Manasu Daily Serial Episode Sai Kiran Raksha Gowda Mukesh Gowda Rasagnya Reddy jyothi roy GuppedanthaOctober 4th Manasu Episode 572

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: ఇంట్లో 'బాంబ్' పెట్టేసిన బిగ్ బాస్ - కన్ఫెషన్ రూంలోకి వెళ్లనన్న శ్రీసత్య, రేవంత్ సీరియస్

Bigg Boss 6 Telugu: ఇంట్లో 'బాంబ్' పెట్టేసిన బిగ్ బాస్ - కన్ఫెషన్ రూంలోకి వెళ్లనన్న శ్రీసత్య, రేవంత్ సీరియస్

Janaki Kalaganaledu December 8th: కడుపు పోయినట్టు నాటకం ఆడిన మల్లిక- రామాకి నిజం చెప్పిన జానకి, మాధురి కేసులో కన్నబాబు పాత్ర

Janaki Kalaganaledu December 8th: కడుపు పోయినట్టు నాటకం ఆడిన మల్లిక- రామాకి నిజం చెప్పిన జానకి, మాధురి కేసులో కన్నబాబు పాత్ర

Guppedantha Manasu December 8th Update: వసు ఇబ్బంది గమనించి హెల్ప్ చేసిన రిషి, దేవయాని ప్లాన్ ని ఫ్లాప్ చేసిన గౌతమ్

Guppedantha Manasu December  8th Update: వసు ఇబ్బంది గమనించి హెల్ప్ చేసిన రిషి, దేవయాని ప్లాన్ ని ఫ్లాప్ చేసిన గౌతమ్

Karthika Deepam December 8th Update: మతి స్థిమితం కోల్పోయిన మోనిత, సౌందర్య ఆగ్రహం, ఇంటికి చేరిన దీప-కార్తీక్

Karthika Deepam December 8th Update: మతి స్థిమితం కోల్పోయిన మోనిత, సౌందర్య ఆగ్రహం, ఇంటికి చేరిన దీప-కార్తీక్

Gruhalakshmi December 8th: తల గోడకేసి బాదుకున్న లాస్య, పట్టించుకోని నందు- హితబోధ చేసిన తులసి

Gruhalakshmi December 8th: తల గోడకేసి బాదుకున్న లాస్య, పట్టించుకోని నందు- హితబోధ చేసిన తులసి

టాప్ స్టోరీస్

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!