Guppedantha Manasu December 3rd Update: అపార్థాల మాస్టర్ లా తయారైన ఈగో మాస్టర్, గౌతమ్ కి మిత్రద్రోహి ట్యాగ్!
Guppedantha Manasu December 3rd Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంత మనసు శనివారం ఎపిసోడ్ ( Guppedantha Manasu December 3rd Update Today Episode 624)
తండ్రి గౌతమ్ తో పాటే ఉన్నారని తెలిసి రిషి ఫైర్ అవుతాడు. రేయ్ గౌతమ్ నీకు వంద కారణాలు ఉండొచ్చు కానీ నీ ఫ్రెండుని కదరా ఇంత మోసం ఎలా చేశావురా...నన్ను కత్తితో పొడిచి చంపేసి ఉంటే ఇంకా బాగుండేది అంటాడు. నా మాట వినరా అని గౌతమ్ నిజం చెప్పేందుకు ఎంత ప్రయత్నించినా రిషి అస్సలు వినడు. నన్ను నమ్మురా ప్లీజ్ అన్నప్పటికీ.. నువ్వు మిత్రద్రోహివి జీవితంలో మళ్లీ నీ ముఖం నాకు చూపించు అనేసి కోపంగా వెళ్లిపోతాడు.
వసుధార రిషి కార్లో వెళుతుండగా..తప్పు గౌతమ్ సార్ ఒక్కరిదేనా అని అడుగుతుంది.
రిషి: కారణం ఏదైనా కానీ గౌతమ్ నన్ను మోసం చేయకూడదు..నా బాధ, కన్నీళ్లు చూసి కూడా గౌతమ్ నిజం ఎలా దాచాడు
వసు: మహేంద్ర సార్ చెప్పొద్దంటే తనేం చేస్తారు..ఈ విషయంలో ముగ్గురిదీ తప్పుంది..గౌతమ్ సార్ ఒక్కరినే తప్పుపట్టడం సరికాదు
రిషి: వందసార్లు ఆలోచించినా గౌతమ్ నా దగ్గర నిజం దాచడం తప్పు... తప్పు కాదు ద్రోహం...
Also Read: మోనిత అరెస్ట్, వంటలక్క సేవలో డాక్టర్ బాబు,మరి శౌర్య పరిస్థితేంటి!
దేవయాని: వెళ్లిపోయిందనుకున్న జగతి మళ్లీ వచ్చింది.. వసుధార రిషిని తనవైపు తిప్పుకుంది..అర్థరాత్రిలు షికార్లు చేస్తున్నారు ఇంకా వచ్చినట్టు లేరు..ఏదో ఒకటి చేయాలి ఇలా వదిలేయకూడదు అనుకుంటుంది దేవయాని..ఇంతలో రిషి-వసు ఇంట్లోకి వస్తారు. రిషి కోపంగా వెళ్లిపోవడంతో ఆగిపోయిన దేవయాని వసుధారని అడ్డుకుంటుంది.
దేవయాని: అప్పుడే వచ్చేశారేంటి తెల్లారిన తర్వాత వస్తారనుకున్నా..లాంగ్ డ్రైవ్ కి వెళ్లారా..లాంగ్ డ్రైవ్ కి వెళితే ఇంత త్వరగా వస్తారా..లాంగ్ డ్రైవ్ అంటే దూర ప్రయాణం కదా.. చూస్తా..ఎంతదూరం ప్రయాణిస్తావో...
వసు: ఇప్పుడు రిషిసార్ ఉన్న పరిస్థితుల్లో ఈవిడతో మాట్లాడకపోవడమే మంచిది అనుకుని మేడం నన్ను వెళ్లనివ్వండి
దేవయాని: నువ్వు ఇంట్లోకి వచ్చినా ఆపలేదు..బయటకు వెళ్లినా ఆపడం లేదు..అంతా నీ యిష్టమే నడుస్తోంది కదా ఈ జగతి మళ్లీ వచ్చిందని నీకు బలమొచ్చింది కదా..జగతి ఇంట్లో ఉంటుంది నువ్వు బయట ఉంటావ్..నువ్వు ఇంట్లో ఉంటావ్ ... జగతి బయట ఉంటుంది..సరే వసుధారా అలసిపోయి ఉంటావ్ గుడ్ నైట్... అవును మర్చిపోయాను ఈ సారి లాంగ్ డ్రైవ్ కి వెళ్లినప్పుడు నాకు ముందుగా చెబితే తినడానికి ఏమైనా తయారు చేసి పంపిస్తాను... అనేసి వెళ్లిపోతుంది
దేవయాని మేడం ఆవిడ పద్ధతికి విరుద్ధంగా మాట్లాడుతోంది..మళ్లీ ఏమైనా ప్లాన్ చేసి ఉంటారా అనుకుంటుంది వసుధార
Also Read: అర్థరాత్రి వసుతో రిషి రొమాంటిక్ జర్నీ, సమాధానం చెప్పలేక తలొంచుకున్న గౌతమ్
తర్వాత రిషి రూమ్ కి వెళ్లి..తండ్రి నిద్రపోతున్నాడని తెలిసి వెనక్కి వెళ్లిపోదాం అనుకునేలోగా మహేంద్ర పిలుస్తాడు. ఏంటి ఈ అవతారం అని అడుగుతాడు..
రిషి: డ్రెస్ పాడైంది మార్చుకునేందుకు గౌతమ్ రూమ్ కి వెళితే అక్కడ మనసు పాడైంది
మహేంద్ర: ఏమైంది రిషి
రిషి: మీరు అక్కడ ఉన్నట్టు నాకు తెలిసిపోయింది డాడ్. ఓ విషయం చెప్పడానికి తెలియడానికి చాలా తేడా ఉంటుంది. మీరు ఎక్కడికి వెళ్లారు ఎందుకు వెళ్లారు అని అడగలేదు మీరు కూడా చెప్పలేదు కానీ గౌతమ్ నా చిన్నప్పటి ఫ్రెండ్ నా బెస్ట్ ఫ్రెండ్ వాడు కూడా నా దగ్గర నిజం దాచాడు
మహేంద్ర చెప్పేందుకు ప్రయత్నించినా.. అప్పుడు రిషి ఒక ఫ్రెండ్ ని మోసం చేయడం క్షమించరాని నేరం అంటాడు. గౌతమ్ గురించి తప్పుగా మాట్లాడతాడు. ఎప్పటికీ గౌతమ్ ని క్షమించలేను అంటాడు.
మహేంద్ర: కారణాలు ఏవైనా నేను ఇల్లు విడిచి వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు జగతి ఎంత చెప్పినా వినిపించుకోకుండా నేనే వినకుండా వెళ్ళిపోయాను. గౌతమ్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నాడు పాపం రిషి గౌతం
రిషి: గౌతమ్ నిజం దాచడం చాలా పెద్ద తప్పు డాడ్
ఎపిసోడ్ ముగిసింది