News
News
X

Guppedanta Manasu January 31st Update: ప్రేమే సమస్య అన్న రిషి, ప్రేమను ప్రేమ గెలిపించుకుంటుందన్న వసు - దేవయానికి షాకుల మీద షాకులు

Guppedantha Manasu January 31st Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 
Share:

గుప్పెడంతమనసు జనవరి 31 ఎపిసోడ్ (Guppedanta Manasu January 31th Update)

వసుధార ఇంటికి వెళ్లిన దేవయాని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది
దేవయాని: నీకు మీ నాన్నకు టికెట్స్ బుక్ చేస్తాను ఎక్కడికైనా వెళ్లిపోండి. లేదా ఇద్దరికి కలిపి ఏసీ కార్ బుక్ చేస్తానో కనిపించకుండా వెళ్లిపోండి అంటూ వసుధారకు చెక్ బుక్ ఇస్తుంది.
వసు: మేడం ఆ చెక్ ని చించి విసిరి కొడితే కానీ మీరు బయటికి వెళ్లరా. నేను మీకంటే మొండి దాన్ని మీకంటే గట్టిగా అరవగలను. పెద్దవాళ్లు అని గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాను వెళ్లిపోండి 
దేవయాని: వెళ్లిపో వెళ్ళిపో అంటున్నావు ఇది గౌతమ్ ఫ్లాట్ రిషి కి సంబంధించిందే కదా 
ఇంతలో చక్రపాణి అక్కడికి వచ్చి మేడం ఇది రిషి సార్ ఇచ్చింది కదా అని అంటాడు.
దేవయాని: నీకు భయం లేదనుకున్నాను సిగ్గు లేకుండా ఈ ఫ్లాట్లో ఉంటున్నారా 
వసుధార: మేడం అని గట్టిగా అరుస్తుంది. మేడం ఇది అఫీషియల్ గా వచ్చినప్పుడు ఎవరిదైతే నాకేంటి మీరు మీ భాషను మార్చుకోండి దేవయాని: బెదిరిస్తున్నావా 
వసుధార: నేను బెదిరిస్తే ఆ కథ వేరేగా ఉంటుంది 
దేవయాని: మీ బంధాన్ని మొదట్లోనే తుంచేయాల్సింది 
వసుధార: బంధాలను దూరం చేసే వారికి బంధాలను తుంచే వారికి బంధం విలువ గురించి ఏం తెలుస్తుంది. ఇక్కడే ఉంటే ఇంకా చాలా మాట్లాడుతాను వెళ్ళిపోండి 
దేవయాని: నిన్ను వెళ్లగొడతాను 
ఇంతలో రిషి వస్తాడు... దేవయాని టెన్షన్ పడుతుంది

Also Read: వసుధార వద్దకు బయల్దేరిన రిషి- టెన్షన్ లో మహేంద్ర

దేవయాని: తను ఇక్కడ ఉండడమేంటి..గౌతమ్ ఫ్లాట్ కదా
రిషి: అవన్నీ మీకెందుకు..మిషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి తనకో ఫ్లాట్ ఇవ్వాలికదా ఇది ఇచ్చాం...
దేవయాని: ఏదో చెప్పేందుకు ప్రయత్నిస్తుంది
రిషి:  మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలియదు కానీ ఇదంతా ప్రేమ వల్ల వచ్చిన సమస్య..అదే పెద్దమ్మకు నాపై ఉన్న ప్రేమవల్ల వచ్చిన సమస్య... 
వసుధారకి క్షమాపణలు చెప్పి దేవయానిని తీసుకుని అక్కడినుంచి వెళ్లిపోతాడు
రిషి సార్ కు నా మీద ప్రేమ ఉంటే వెనక్కి తిరిగి చూడాలి అని అనుకుంటుంది వసుధార..అప్పుడు రిషి వెనక్కి తిరిగి చూడడంతో వసుధార సంతోష పడుతంది

మరోవైపు మహేంద్ర-జగతి ఎదురుచూస్తూ ఉండగా ఇంతలో దేవయాని,రిషి అక్కడికి వస్తారు. రిషిని చూసి జగతి మహేంద్ర సంతోష పడతారు. అప్పుడు దేవయాని..చాలా రోజుల తర్వాత రిషి ఇంటికొచ్చాడు... పేగు బంధం-ప్రేమ బంధం అంటూ  కావాలనే తెగ హడావిడి చేస్తూ ఉంటుంది. 
మహంద్ర: ఎందుకు వదినా ఇలా మాట్లాడుతున్నారు 
దేవయాని: అయ్యో నేనేమన్నాను మహేంద్ర
రిషి: కాసేపు మౌనంగా ఉండిపోయిన రిషి..మీరు ఇంకోసారి వసుధర ఫ్లాట్ కి వెళ్ళకండి పెద్దమ్మ వసుధారని కలవద్దు 
దేవయాని: ఇంత జరిగిన తర్వాత నువ్వు ఎందుకు వసుధార కి ఫ్లాట్ ఇచ్చావు 
జగతి: ఎందుకు పదేపదే వసుధార టాపిక్ తీసి రిషిని బాధ పెడుతున్నారు 
అప్పుడు దేవయాని ఏదేదో మాట్లాడుతూ ఉండగా పెద్దమ్మ అవన్నీ మాట్లాడే ఓపిక నాకు లేదు మీకు మళ్ళీ చెప్తున్నాను వసుధార ఏమీ అనకండి తను ఉండడం వల్ల నాకు ఎటువంటి సమస్య లేదు అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోతాడు రిషి.
జగతీ మహేంద్ర ఇద్దరూ దేవయానికి థాంక్స్ చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు.

Also Read: ఈ రాశివారు సవాళ్లను కూడా అనుకూలంగా మలుచుకుంటారు, జనవరి 31 రాశిఫలాలు
 
మరోవైపు వసుధార,రిషి తో గడిపిన క్షణాలు నెమలి ఈకలు గోలీలు, రిషి వాచ్ ని చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటుంది.  మనమంతా కలిసి మాట్లాడుకునే రోజు ఆనందంగా ఉండే రోజు ఎప్పుడొస్తుంది ఈ పొగరుని మళ్ళీ ఎప్పుడు పొగరు అని పిలుస్తారు సార్ అనుకుంటూ తాళిబొట్టు చూసుకుంటూ ఉంటుంది వసుధార. ఇంతలోనే అక్కడికి చక్రపాణి వస్తాడు. బాధపడుతున్నావా అమ్మ అనడంతో ఎదురుచూస్తున్నాను నాన్న అంటుంది. రిషి సార్ మాటలు విన్నావు కదమ్మా ఆ మాటలు కొండంత ప్రేమ కనిపించింది. ఆరోజు నువ్వు మన ఇంట్లో రిషి సార్ గురించి చెప్పినప్పుడు నేను విని ఉంటే ఈరోజు ఇంత జరిగేది కాదమ్మా అని అంటాడు. మీరు అలా మాట్లాడకండి నాన్న ప్రేమను ఎవరు గెలిపించాల్సిన అవసరం లేదు ప్రేమ తనని తాను గెలిపించుకుంటుంది అని అంటుంది. 

రిషి ఇంట్లో పేపర్లపై రిషిధార అని రాసి ధార మీద రాంగ్ మార్క్ వేస్తాడు. వసుధారతో గడిపిన క్షణాలు గుర్తు తెచ్చుకుని ఆలోచిస్తూ ఉంటాడు. నా జీవితంలోకి వచ్చి నా మనసుని నా ఆనందాన్ని అన్నింటిని రంగులమయం చేశావు అని అనుకుంటాడు..అంతలోనే వసు మెడలో తాళి గుర్తు తెచ్చుకుని ఇప్పుడు వేరొకరి భార్య నేను అలా ఆలోచించకూడదు అనుకుంటాడు.

Published at : 31 Jan 2023 09:03 AM (IST) Tags: Guppedanta Manasu Serial Guppedanta Manasu Serial Today Episode Guppedanta Manasu Serial Written Update Guppedanta Manasu Serial January 31st Episode

సంబంధిత కథనాలు

Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?

Tollywood: మాస్ మంత్రం జపిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలు - వర్కవుట్ అవుతుందా?

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Aishwarya's Gold Missing Case: దొంగలు దొరికారట - రజినీకాంత్ కుమార్తె ఇంట్లో చోరీపై కీలకమైన క్లూ!

Newsense Teaser 2.0: న్యూస్ రాసే వాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది - నవదీప్ ‘న్యూసెన్స్’ టీజర్ అదిరిందిగా!

Newsense Teaser 2.0: న్యూస్ రాసే వాడి చేతిలోనే చరిత్ర ఉంటుంది - నవదీప్ ‘న్యూసెన్స్’ టీజర్ అదిరిందిగా!

Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!

Tesla Cars - Naatu Naatu: టెస్లా కార్ల ‘నాటు నాటు‘ లైటింగ్ షోపై స్పందించిన మస్క్ మామ - RRR టీమ్ ఫుల్ ఖుష్!

Ameer Sultan on Rajinikanth: రజినీకాంత్‌కు అసలు ఆ అర్హత ఉందా? తమిళ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

Ameer Sultan on Rajinikanth: రజినీకాంత్‌కు అసలు ఆ అర్హత ఉందా? తమిళ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Roja Fires on TDP Party: శవాల నోట్లో తులసి తీర్థం పోసినట్లు - టీడీపీ సంబరాలపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

AP BJP Vs Janasena : అడిగినా పవన్ సపోర్ట్ ఇవ్వలేదు - సొంతంగా ఎదుగుతామని ఏపీ బీజేపీ ప్రకటన !

TSPSC : పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?

TSPSC :  పేపర్ లీకేజీ కేసు సీబీఐ కి వెళ్తుందా ? ఎవరేం వాదించారంటే ?