జనవరి 30 నుంచి ఫిబ్రవరి 5 వారఫలాలు- మీ రాశిఫలితం తెలుసుకోండి



మేష రాశి
ఈ వారం మేషరాశివారికి కెరీర్ పరంగా ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు, కానీ సామాజికంగా మీ ప్రజాదరణ పెరుగుతుంది. మీ వైవాహిక జీవితం మిశ్రమంగా ఉంటుంది. వారం ప్రారంభంలో డబ్బు వచ్చే అవకాశం ఉంది. అవివాహితులు కొంతకాలం ఓపికపట్టాలి.



వృషభ రాశి
ఈ వారం ప్రారంభంలో కోపాన్ని అదుపులో ఉంచుకోగలుగుతారు. మీరు ఎక్కడి నుంచైనా హఠాత్తుగా డబ్బు పొందవచ్చు. ఉద్యోగులు కార్యాలయంలో పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. శత్రువులపై పైచేయి సాధిస్తారు. ప్రేమ భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది.



మిథున రాశి
వారం ప్రారంభంలో ఆర్థిక సమస్యలుంటాయి. అప్పులు తీసుకోవాల్సి రావొచ్చు. ఒంటరిగా ఉండేవారి జీవితంలోకి కొత్త అతిథి వస్తారు. ఉద్యోగులకు కార్యాలయంలో మీ శత్రువులు మీ పనికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నిస్తారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు ఆకస్మిక లాభం పొందుతారు.



కర్కాటక రాశి
ఈ వారం ఆరోగ్యం పట్ల మరింత సీరియస్‌గా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఫోన్లతో గడిపే సమయం తగ్గించుకుంటే కుటుంబంలో సమస్యలు కాస్త సర్దుమణుగుతాయి. వారాంతంలో మీ ఇంటికి అతిథులు రావొచ్చు. కార్యాలయంలో ఉన్నత ఉద్యోగుల నుంచి సహకారం అందుతుంది.



సింహ రాశి
ఈ వారం కొన్ని పొరపాట్లు చేసే అవకాశం ఉంది..మీరు ముందుగా గుర్తించి మార్చుకోకుంటే తగిన మూల్యం చెల్లించకతప్పదు. సహోద్యోగులతో సరిగా ప్రవర్తించండి..లేదంటే..వివరణ ఇచ్చుకునే పరిస్థితి రావొచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది.



కన్యా రాశి
ఈ వారం మీరు బిజీ బిజీగా ఉంటారు. ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఏదైనా వివాహ వేడుకలో పాల్గొంటారు.కార్యాలయంలో మీ స్థానం బలంగా ఉంటుంది. కొన్ని కొత్త ప్రాజెక్టులు వస్తాయి..మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది.



తులా రాశి
ఈ వారం మీ కెరీర్ పరంగా కొన్ని హెచ్చు తగ్గులుంటాయి. ఉద్యోగం మారే ఆలోచన చేస్తారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. అత్తమామల వైపు నుంచి మీకు నచ్చని కొన్ని విషయాలు జరుగుతాయి కానీ కాస్త ఓపిక పట్టండి.



వృశ్చిక రాశి
ఈ వారం వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలను అందిస్తుంది. ఉద్యోగులకు కార్యాలయంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు. వైవాహిక జీవితం బావుంటంది. కొత్తగా పెళ్లయిన వారు ఖర్చులు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.



ధనుస్సు రాశి
ఈ వారం వ్యాపారులకు అనుకూలమైన సమయం. కొత్త ప్రదేశాల నుంచి ఆర్డర్లు పొందడంలో విజయం సాధిస్తారు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. బ్యాంకు రుణాల కారణంగా ఎదురైన సమస్యలు తొలగుతాయి. విద్యార్థులు తమ కష్టానికి తగిన ఫలాలు అందుకుంటారు.



మకర రాశి
ఈ వారం వ్యాపారులకు, ఉద్యోగులకు అనుకూలంగా ఉంది. మీ మాటతీరులో మృదుత్వం ఉండేలా చూసుకోండి. ఎప్పటినుంచో ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగం మారాలని ఆలోచిస్తుంటే, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆకస్మికంగా నష్టపోయే అవకాశం కూడా ఉంది.



కుంభ రాశి
ఈ వారం కుంభరాశివారు ఆశించిన ఫలితాలను సాధించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది. డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అప్పులు తీసుకోవద్దు. ప్రయాణం చేయాల్సి రావొచ్చు. విద్యార్థులు క్రమశిక్షణ పాటించాలి. తప్పుడు వ్యక్తులతో స్నేహం చేయవద్దు.



మీన రాశి
జీవితంలో ముందుకు సాగడానికి కష్టపడి పనిచేయడం, మిమ్మల్ని మీరు అప్‌డేట్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. విద్యార్థులు కొత్త కోర్సులు చేసేందుకు ఆసక్తి చూపుతారు. పరిపాలనా స్థానాల్లో ఉన్న వ్యక్తులు తమ స్థానాన్ని బలోపేతం చేసుకోగలుగుతారు.