Guppedanta Manasu January 30th: వసుధార వద్దకు బయల్దేరిన రిషి- టెన్షన్ లో మహేంద్ర
Guppedantha Manasu January 30th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
రిషి వసు మాటలు తలుచుకుంటాడు. ‘అసలు ఏం జరగనట్టు అలా మాట్లాడుతున్నావ్, నన్ను అంతగా బాధించి నీకేమి పట్టనట్టు నువ్వేమి చేయనట్టు మాట్లాడుతున్నావ్, ఇలా ఎందుకు చేశావ్. నువ్వు ఇలాంటి పరిస్థితి తీసుకొస్తావని ఎప్పుడు అనుకోలేదు. అన్ని మాటలు చెప్పి అన్నీ జ్ఞాపకాలు అందించి చివరికి నీ ఇష్టం అన్నావ్, ఆ ఇష్టం నీదైనప్పుడు అందులో నేను ఎందుకు లేను. నువ్వు నిజంగా నన్ను ఇష్టపడలేదా? అందమైన జ్ఞాపకాలు అందిచావ్ కదా ఎందుకు నాకు ఇంత పెద్ద శిక్ష వేశావ్. రిషి వసుధార వేర్వేరు కాదు రిషిధార అన్నావ్. మరి ఇప్పుడు చేసింది ఏంటి. ప్రిన్స్, జెంటిల్మెన్ అన్నావ్. మరి ఇలా ఎందుకు చేశావ్. అన్ని మర్చిపోవాలి’ అనుకుంటూనే తనతో గడిపిన క్షణాలన్నీ తలుచుకుని చాలా బాధపడతాడు.
Also Read: చుట్టూ కమ్మే రేయో,మాయో మొత్తం కరగాలి - వసుని మరింత గాయపర్చిన రిషి
మహేంద్ర వసుధార వాళ్ళ నాన్న మన ఇంటికి వస్తే ఏం మాట్లాడలేకపోయాం, అసలు తను ఎందుకు వచ్చాడో తెలుసుకోవాల్సిందని అంటాడు. కానీ జగతి మాత్రం తనతో మాట్లాడటానికి ఏమి లేదు. దేవయాని అక్కయ్య చూస్తే ఇంకా గొడవ అయ్యేదని పంపించేశామని జగతి అంటుంటే దేవయాని చప్పట్లు కొడుతూ ఎంట్రీ ఇస్తుంది. మా మాటలు ఇంకా వింటూనే ఉన్నారా అని మహేంద్ర అంటాడు. వసుధార వాళ్ళ నాన్న వస్తే మీరు పంపించేస్తారా? మీ వల్లే రిషి బతుకు ఇలా అయ్యింది. సాక్షిని ఇచ్చి పెళ్లి చేద్దాంఅని అనుకుంటే వసుని వల వేసి మనసు మార్చేశారు అని నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. రిషి భవిష్యత్ కోసం ఆలోచించేది నేనే అని అంటుంది. రిషి ఎక్కడ ఉన్నాడో ఎలా ఉన్నాడో అని ఆలోచిస్తున్నారా అని నిలదీస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మీరు చేతులు పట్టుకుని తిరుగుతున్నారు ఇది కరెక్టేనా అని తిడుతుంది.
మా పర్సనల్ విషయాల గురించి మాట్లాడొద్దని జగతి అంటుంది. రిషి అక్కడ ఉంటేనే ప్రశాంతంగా ఉంటాడని మహేంద్ర అంటాడు. కానీ దేవయాని మాత్రం రిషిని ఎలాగైనా నేనే తీసుకొస్తాను అంటుంది. రిషికి ఫోన్ చేసి వెళ్తాను అని ట్రై చేస్తుంది కానీ ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. రిషిని అడ్డుపెట్టుకుని చేయాల్సినవన్నీ చేస్తానని మనసులో అనుకుంటుంది. వదిన వెళ్ళి రిషిని ఇబ్బంది పెడుతుందేమో అని మహేంద్ర అంటాడు. అక్కయ్య వెళ్ళి రిషి మనసు డిస్ట్రబ్ చేయకముందే మనం వెళ్దామని జగతి, మహేంద్ర కూడా బయల్దేరతారు. వసు తండ్రి చక్రపాణికి భోజనం వడ్డిస్తుంది. కాలం మనల్ని దూరం చేసింది మనల్ని ఇంకెవరూ విడదీయలేరని చక్రపాణి అంటుంటే దేవయాని అడుగుపెడుతుంది. తనని చూసి వసు షాక్ అవుతుంది.
దేవయాని: ఏంటి వసుధార నేను వస్తానని ఊహించలేదా? నేను రిషి పెద్దమ్మని దేవయానిని, తనని పెంచి పెద్ద చేసింది నేనే. రిషి ఎక్కడ
వసు: రిషి సర్ గురించి నన్ను ఎందుకు అడుగుతున్నారు
దేవయాని: జరిగినవన్నీ మాట్లాడటం ఇష్టం లేదు. నువ్వు ఏం చేశావో ఎందుకు చేశావో నీకు మాత్రమే తెలుసు మళ్ళీ ఎందుకు వచ్చావో నాకు అర్థం కావడం లేదు
వసు: రిషి సర్ కి అర్థం అయితే చాలు
దేవయాని: బ్లాంక్ చెక్ ఇచ్చి ఊరు వదిలి వెళ్లిపో అంటుంది
వసు: నేను ఎందుకు వెళ్ళాలి
Also Read: యష్, వేదని మెచ్చుకున్న భ్రమరాంబిక- విన్నీని అడ్డం పెట్టుకుని చిచ్చుపెడుతున్న మాళవిక
దేవయాని: పెళ్లి చేసుకుని మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావ్. పైగా గౌతమ్ ఇంట్లో ఉంటున్నారు. అసలు రిషిని ఏం చేద్దామని అనుకుంటున్నారు
చక్రపాణి నిజం చెప్పబోతుంటే వసు ఆపి లోపలికి పంపించేస్తుంది.
వసు: ఓ చెక్ మీద సంతకం పెట్టి వెళ్లిపొమ్మంటే ఎలా వెళ్లిపోతాను. వచ్చిన దారిలోనే వెళ్లిపోండి ఇంతకన్నా మర్యాదగా చెప్పలేను
దేవయాని: రిషికి దూరంగా వెళ్లిపో. ఈరోజుతో ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెడదాం
వసు: చాలా సమస్యలకు మీరే కారణం, మీరు సమస్యల గురించి మాట్లాడకపోతేనే బెటర్ అనేసి చెక్ తన చేతిలో పెడుతుంది.
జగతి, మహేంద్ర రిషి ఉన్న దగ్గరకి వస్తారు. అక్కడ దేవయాని లేదేంటి అనుకుని ఎక్కడికి వెళ్ళి ఉంటుందా అని ఆలోచిస్తూ ఉంటారు. మహేంద్రకి అప్పుడే వసు ఫోన్ చేస్తుంది. వెంటనే వచ్చిన రిషి వసు డాడ్ కి ఫోన్ చెయ్యడం ఏంటి అని మహేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయగానే వచ్చి తీసుకుంటాడు. దేవయాని మేడమ్ ఇక్కడికి వచ్చారు, ఏదేదో మాట్లాడుతూ గొడవ చేస్తున్నారు ఒకసారి రండి అని చెప్తుంది. ఆ మాటలు విని రిషి మహేంద్రకి విషయం చెప్పి వసు దగ్గరకి బయల్దేరతాడు. నీకు మీ నాన్నకి టికెట్స్ బుక్ చేస్తాను మీరు వెళ్లిపోండని అంటుంది దేవయాని. ఆ చెక్ చించి మొహాన విసిరికొడితే కానీ బయటకి వెళ్లరా అని వసు సీరియస్ గా అంటుంది.