By: ABP Desam | Updated at : 30 Jan 2023 08:42 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
వేద మలయాళీ అమ్మాయిలా ముచ్చటగా రెడీ అయిపోతుంది. అది చూసి విన్నీ వేదని ఏంజెల్ లా ఉన్నావ్ అని అంటాడు. డ్రెస్ వేసుకున్నంత మాత్రాన మలయాళీ అయిపోతావా అని అంటాడు. దీంతో వేద మలయాళంలో మాట్లాడి యష్ ని ఆశ్చర్యపరుస్తుంది. తను మలయాళంలో గలగలా మాట్లాడటం చూసి అక్కడ అందరూ నోరెళ్ళబెడతారు. విన్నీ వేదకి వాటర్ తీసుకొచ్చి ఇస్తాడు, కానీ వాటిని తీసుకొచ్చి యష్ కి ఇస్తుంది. అలకనంద ఫ్లాట్స్ లో సంక్రాంతి పండుగ సంబరాలు వేడుకగా జరుగుతూ ఉంటాయి. వేద కుటుంబం అందరితో నవ్వుతూ ఫోటోస్ దిగుతుంటే యష్ తనకి సైట్ కొడతాడు. వేద ఎప్పుడూ లేనిది మలయాళీ గెటప్ వేసుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉందని రత్నం, శర్మ అనుకుంటూ ఉండగా నేనే ఇచ్చాను అని వినని ఎంట్రీ ఇస్తాడు.
Also Read: పండగపూట కలిసిన అన్నాచెల్లెళ్ళు- నిజం తెలిసి తులసి మీద చిందులేసిన నందు
అది చూసి యష్ జలస్ ఫీలవుతాడు. తనని మరింత ఉడికించేందుకు వేద విన్నీతో క్లోజ్ గా ఉన్నట్టు నటిస్తుంది. అలకనంద ఫ్లాట్స్ లో ముగ్గుల పోటీకి భ్రమరాంబికని ఆహ్వానిస్తారు. తనకి సులోచన, మాలిని స్వాగతం చెప్తారు. వాళ్ళని చూసి మాళవిక షాక్ అవుతుంది. కారులోనే ఉండటంతో భ్రమరాంబిక తనని పిలుస్తుంది. వదిన అని మాళవిక భ్రమరాంబికని పిలవడంతో తను అభికి అక్క అనుకుంటా అని సులోచన వాళ్ళు అనుకుంటారు. తనని చూసి మీకు మాళవిక ముందే తెలుసా అంటే లేదని మాళవిక అంటుంది. యష్, వేద ఏదో మాట్లాడుకుంటూ ఉండగా విన్నీ రమ్మని పిలుస్తాడు. పండగ పూట కూడా ఈ పాత డ్రెస్ ఏంటి కొత్త డ్రెస్ వేసుకోమని బతిమలాడతాడు. కానీ నో చెప్తాడు.
మా విన్నీ చూడండి అమెరికా నుంచి వచ్చినా కూడా ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుని మెరిసిపోతున్నాడని అంటుంది. అయితే మెరిసిపోతున్న మీ విన్నీ దగ్గరకి వెళ్ళి ఎంజాయ్ చెయ్యి అని అంటాడు. అప్పుడే మాలిని, సులోచన వేద యష్ ని భ్రమరాంబికకి పరిచయం చేస్తారు. ముగ్గుల పోటీకి గెస్ట్ గా వచ్చారు, ఆ పక్కన ఉన్న ఆవిడ గెస్ట్ అంట అని వెటకారంగా పరిచయం చేస్తారు. మాజీ మొగుడు ఒక పక్క, మాజీ పెళ్ళాం ఇంకొక పక్క, మాజీ అత్తగారు ఇంకొక పక్క ఏమి తెలియనట్టు అందరూ భలే నటిస్తున్నారని భ్రమరాంబిక మనసులో అనుకుంటుంది. వేదని చూసి ఎంత పవిత్రమైన పేరు చూడటానికి కూడా ఎంత పవిత్రంగా ఉన్నావ్. యశోధర్ నువ్వు వెరీ లక్కీ ఫెలో అని భ్రమరాంబిక మెచ్చుకుంటుంది.
Also Read: మాళవికకి అదిరిపోయే ఝలక్ ఇచ్చిన భ్రమరాంబిక- విన్నీని చూసి కుళ్ళుకుంటున్న యష్
నా భార్యని చూసి గర్విస్తున్నా అని యష్ అంటే వేద కూడా తన భర్తని మెచ్చుకుంటుంది. వాళ్ళని చూసి మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా అని భ్రమరాంబిక అంటుంది. ఏం మాళవిక మాట్లాడవే అని భ్రమరాంబిక అడుగుతుంది. మా వేద లాంటి భార్య దొరకడం చాలా అరుదు, కొంతమంది ఉంటారు పిల్లల్ని వదిలేసి రోడ్డున పడిపోతారని సులోచన వాళ్ళు ఇన్ డైరెక్ట్ గా మాళవికని తిడతారు. యష్ ని ట్రెడిషనల్ గా రెడీ అయి ఉంటే బాగుండేదని భ్రమరాంబిక అంటుంది. బయట వాళ్ళతో కూడా చెప్పించుకోవాలా మార్చుకోవచ్చు కదా అని వేద అంటుంది. కానీ యష్ మాత్రం ఒప్పుకోను అంటాడు. ముగ్గుల పోటీ స్టార్ అవుతుందని అనేసరికి యష్ ట్రెడిషినల్ గా రెడీ అయిపోతాడు.
DVV Danayya: రూ.80 కోట్లా? ఆస్కార్స్ ఖర్చుపై స్పందించిన ‘RRR’ నిర్మాత డీవీవీ దానయ్య
Suriya Jyotika: ముంబైకి మకాం మార్చిన సూర్య, జ్యోతిక - తొలిసారి తల్లిదండ్రులను వదిలి..
18 ఏళ్లుగా అదేపని, చోరీ డబ్బుతో ఏకంగా ఇల్లే కట్టేశారు - సూపర్ స్టార్ కూతురికే షాకిచ్చిన పనివారు
Nithiin Rashmika New Movie : నితిన్ ఫ్లాపులు, రష్మిక కాంట్రవర్సీలు - కొత్త సినిమా కబురులో ఫుల్ సెటైర్లు
Dasara: అదరగొట్టే మాస్ స్టెప్స్తో ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ - ‘దసరా’ ఫస్ట్ వీడియో సాంగ్ వచ్చేసింది!
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం - వైసీపీ హై అలర్ట్
IND Vs AUS 3rd ODI: మూడో వన్డే ఆస్ట్రేలియాదే - 2019 తర్వాత స్వదేశంలో సిరీస్ కోల్పోయిన టీమిండియా!
TSPSC Paper Leak: 'గ్రూప్-1' పేపర్ లీక్ స్కాంలో సిట్ దూకుడు, మరో ముగ్గురిపై ఎఫ్ఐఆర్ నమోదు!
Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?