Guppedanta Manasu January 14th Update: మనసుని మబ్బులా కమ్మేశావ్ అన్న రిషి - మీ కోపాన్ని అలకని త్వరలో తీర్చేస్తానంటూ వసు భరోసా!
Guppedantha Manasu January 14th Update: గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
గుప్పెడంతమనసు జనవరి 14 శనివారం ఎపిసోడ్ (Guppedanta Manasu January 14th Update)
వసుధార-రిషి ఇద్దరూ ఎవరికి వారే..ఇద్దరూ కలసి ఉన్న క్షణాలన్నీ గుర్తుచేసుకుంటారు. రిషి సార్ కి కాల్ చేద్దాం అని వసుధార అనుకుంటే.. రిషి కూడా వసు గొంతు వినక ఇన్నిగంటలైందా అనుకుంటాడు. నేను కాల్ చేస్తే సార్ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేను..అందుకే నాన్న సెల్ నుంచి కాల్ చేస్తాను..రిషి సార్ గొంతుని నా ఫోన్లో సేవ్ చేసుకుంటాను అనుకుంటుంది. కొత్త నంబర్ ఎత్తొద్దు అనుకుంటూనే ఏమో ఏదైనా అవసరం అయితే అనే ఆలోచనతో కాల్ లిఫ్ట్ చేస్తాడు. వసు ఏమీ మాట్లాడకుండా రిషి వాయిస్ రికార్డ్ చేస్తుంటుంది.. రిషి మాత్రం పోల్చేస్తాడు..వసుధారా అని పిలుస్తాడు.. ఆ పిలుపు విని కన్నీళ్లతో కాల్ కట్ చేస్తుంది వసుధార.. రిషి వెంటనే రిటర్న్ కాల్ చేస్తాడు.. అప్పుడు వసుధార పక్కనున్న నర్స్ కి ఫోన్ ఇచ్చి..రాంగ్ నంబర్ అని చెప్పమంటుంది...బిల్లు కట్టేందుకు వసుధార వెళ్లడంతో..రిషీంద్రభూషన్ అనే వ్యక్తి బిల్లుకట్టారని చెబుతారు. అప్పుడు చక్రపాణి జరిగినదంతా చెప్పడంతో వివరించడంతో వసుధార సంతోషపడుతుంది. గంధపు చెక్క ఏదో విషపు మొక్క ఏదో లేటుగా తెలుసుకున్నాను. తొందరగా వెళ్లి రిషి సార్ ని కలుసుకో అమ్మ అంటాడు చక్రపాణి.
మరోవైపు కాలేజీలో స్టాఫ్ రిషి,వసు, జగతి గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఈ భూషణ్ ఫ్యామిలీనే ఇంత ఏమని చెప్పగలం అని అనడంతో కోపంతో రగిలిపోతున్న జగతి... మేడం అని గట్టిగా అరుస్తుంది.
జగతి: ఏం మాట్లాడుతున్నారు మేడం ఒక్కసారి ఒకసారి చెప్తే అర్థం కాదా ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు పాజిటివ్ గా చూడాలి కానీ ఇలా టాపిక్ దొరికింది కదా అని మాట్లాడుకోకూడదు.
మేడమ్స్: మేమే మాట్లాడాం అని కవర్ చేస్తుండగా..నేను మొత్తం విన్నాను అంటుంది జగతి.
జగతి: మీకు జీతాలు ఇచ్చి మిమ్మల్ని పోషిస్తుంటే భూషణ్ ఫ్యామిలీనే దూషిస్తున్నారా. మీరేం చిన్నపిల్లలు కాదు కదా మేడం లెక్చరర్స్ ప్రతిసారి వసుధారని టార్గెట్ చేస్తూ మీ మాటలతో తూట్లను ఆమె గుండెను పొడిచారు. ఆ అమ్మాయి కూడా మీ కూతురు లాంటిదే కదా ఎందుకు మీరు ఇలా ప్రవర్తిస్తున్నారు. (ఇంతలో రిషి వచ్చి వారి మాటలు వింటాడు) మిమ్మల్ని తిరిగి వసుధార ఒక మాట అనలేదు రిషికి కూడా మీ గురించి ఒక్క మాట చెప్పలేదు అనడంతో వారిద్దరూ తలదించుకుంటారు. అవసరంగా సాటి స్త్రీ hw నిందలు వేసి అవమానపరిస్తే మీకేం వస్తుంది మేడం ఇంకaసారి రిపీట్ కాకూడదు అని సీరియస్ గా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది జగతి.
Also Read: మళ్లీ కొత్తగా మొదలైన రిషిధార ప్రేమ ప్రయాణం, రొమాంటిక్ ఊహల్లో రిషి
వసుధార, చక్రపాణి, సుమిత్ర ముగ్గురు ఇంటికి వెళ్తారు. అప్పుడు ఇల్లు మొత్తం చెల్లాచెదురుగా పడి ఉండడంతో అది చూసి బాధపడుతూ ఉంటారు. అప్పుడు చక్రపాణి రాజీవ్ అన్న మాటలు చేసిన పనులు గుర్తు తెచ్చుకుని బాధపడతాడు.
వసుధార: చక్రపాణి దగ్గరికి వెళ్లి ఏం ఆలోచించొద్దు నాన్న
చక్రపాణి: ఆలోచించకుండా ఎలా ఉంటానమ్మా జరిగింది చిన్న విషయం కాదు కదా
వసుధార ఓదార్చుతూ ఉంటుంది..అప్పుడు చక్రపాణి బాధపడుతుండగా వసుధార ఓదారుస్తుంది. ఆ తర్వాత చక్రపాణి అక్కడి నుంచి లేచి పక్కకు వెళ్లి వసుధార కాళ్ళ మీద పడతాడు. అయ్యో నాన్న ఏంటిది ముందు పైకి లేవండి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటుంది వసుధార. నన్ను క్షమించు వసుధార అని ఏడుస్తూ ఉంటాడు చక్రపాణి. అప్పుడు సుమిత్ర ఏంటండీ మీరు ఇలా చేస్తున్నారు అని అంటుంది. ఏం మాట్లాడాలో తెలియడం లేదు నా ప్రవర్తనకి నేను సిగ్గుపడుతున్నాను అని అంటాడు. అప్పుడు చేతులు జోడించి వసుధారని నన్ను క్షమించు అమ్మ అని ఏడుస్తూ ఉంటాడు. తర్వాత వసుధారని సుమిత్రను దగ్గరికి తీసుకుంటాడు. అప్పుడు వసు అక్కడే ఉన్న రిషి వాచ్ ను చూసి అది తీసుకుంటుంది. ఆ వాచీ పక్కన పెట్టాలి అని చూస్తుండగా అది తన మంగళసూత్రానికి తగులుకుంటుంది. కానీ ఆ వాచ్ రాకపోయేసరికి బంధం ఎప్పటికీ విడిపోదేమో అని అనుకుంటుంది.
వసుధార-రిషి
ఒకలా ఆలోచించే ఇద్దరూ ఎవరికి వారే మాట్లాడుకుంటారు..
వసు: రాజీవ్ అన్న మాటలు రిషి గొప్పతనాన్ని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది
రిషి: నేను ఒక లూజర్ ని కానీ నువ్వు నాకు జెంటిల్మెన్ అని పేరు పెట్టావు
వసు: మీరు ఏం ఆలోచిస్తున్నారో , మీ మనసేంటో నాకు తెలుసు
రిషి: నా మనసు నీకు తెలియడం ఏంటి..నా మనసులో ఉన్నది నువ్వేగా
వసు: ఎందుకు చేశానో నాకు తెలుసు
రిషి: నా బాధను తెలుసుకోలేవా..
వసు: బిడ్డను కొట్టి బాధపడిన తల్లిలా ఉంది నా పరిస్థితి
రిషి: నీకు అన్నీ తెలుసు..రిషి వసుధారలు రిషిధారలుగా మారింది తెలుసు
వసు: అన్నీ తెలిసినా ఒక్కోసారి కాలం చేతిలో బంధీలుగా మారకతప్పదు..ఈ పొగరని క్షమించండి.. రిషిధార లోంచి ధార కేవలం కన్నీటి ధారగానే మిగిలింది..దేవుడికోసం దోసిళ్లతో పూలు తీసుకెళుతుంటే..దురదృష్టమైన పూలు దారిలోనే జారికిందపడతాయి... నేను దురదృష్టవంతురాలిని...
రిషి: నువ్వు నన్ను బాధపెట్టావని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా