Gruhalakshmi January 14th: తులసి మీద ప్రేమని బయటపెట్టిన సామ్రాట్- మెప్పు కోసం తిప్పలు పడుతున్న లాస్య
లాస్య నిజస్వరూపం బయటపడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
సామ్రాట్ తులసి గురించి ఆ
లోచిస్తూ ఉంటాడు. అప్పుడే తన బాబాయ్ వచ్చి మంచి అవకాశాన్ని వదులుకున్నావ్ కనీసం నీ మనసులో మాట అయినా నాకు చెప్పుకో అని అంటాడు. తులసి తన మనసులో మాట ఎప్పుడో చెప్పేశారు. తనకి మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, ఎప్పటికీ నేను తన ఆత్మబంధువే అని చెప్పారు. అన్ని కలలు నిజం కావు కొన్ని కలగానే మిగిలిపోతాయ్ అని బాధపడతాడు.
బాబాయ్: తను నీ జీవితంలోకి రావాలని నీ కోరిక, ఆశ కదా
సామ్రాట్: కోరికలు, ఆశలు నిజం అవ్వాలంటే అదృష్టం ఉండాలి
బాబాయ్: అంటే ఏంటి నీ ప్రేమని చంపేసుకుంటావా
సామ్రాట్: చంపేసుకుంటే చచ్చిపోతే అది ప్రేమ ఎందుకు అవుతుంది. దాచేసుకుంటా ఎప్పటికీ బయట పడకుండా గుండె లోతుల్లో దాచుకుంటా. తులసి మనసు అంతా కుటుంబం ఉంది. తన కోసం జీవితాంతం ఎదురు చూస్తూనే ఉంటాను అని బాధపడతాడు.
Also Read: జానకి పనిమనిషని అవమానించిన మల్లిక- కష్టాల సంద్రంలో జ్ఞానంబ కుటుంబం
శ్రుతి కిచెన్ లో పని చేసుకుంటూ ఉండగా రాములమ్మ వస్తుంది. తులసి తనని రమ్మంది అని చెప్పి గలగలా మాట్లాడేస్తుంది. రాములమ్మని శ్రుతి పనులు చూసుకోమని చెప్తుంది. యాపిల్ జ్యూస్ తీసుకురావడానికి అని రాములమ్మ ఫ్రిజ్ తీయబోతుంటే తాళం వేసి ఉంటుంది. తులసి కోపంగా ఏంటి ఇది అని అడుగుతుంది. లాస్య ఆంటీ ఇంకా మారలేదు, అదే కుళ్ళు బుద్ధి తనకి ఏం కావాలన్నా పర్మిషన్ అడిగి తీసుకోవాల్సిందే అని శ్రుతి చెప్పేసరికి తులసి కోపంగా లాస్య దగ్గరకి వెళ్తుంది.
ఇంటిని నా పేరు మీద పెట్టుకుని పెత్తనం చేయాలని చూస్తే పరిస్థితి చెయ్యి దాటిపోయిందని లాస్య అనుకుంటూ ఉండగా తులసి కోపంగా వస్తుంది. తాళాలు ఇవ్వమని మర్యాదగా అడుగుతుంది. లాస్య ఇవ్వను అనేసరికి తులసి లాగేసుకుంటుంది.
తులసి: నేను వచ్చింది అన్నీ ఒక్కొక్కటి లాక్కోవడానికి నీకు ఇవ్వడానికి కాదు. నా కుటుంబం జోలికి వచ్చావ్, పిల్లలతో ఆడుకుంటున్నావ్, నీ అహంకారమే నన్ను తిరిగి ఈ ఇంటికి వచ్చేలా చేసింది. ఇప్పటి నుంచి మరొక కథ
లాస్య: అసలు నువ్వు ఎవరు ఈ ఇంటి విషయాల్లో కల్పించుకోవడానికి పరాయి దానివి నువ్వు. మరి నేను ఈ ఇంటి కోడలిని
Also Read: వేద చేసిన పనికి షాకైన రాణి- ఈ జంట ఒక్కటయ్యేది ఎప్పుడు?
తులసి: నువ్వు ఎప్పటికీ ఈ ఇంటికి ఇల్లాలివి కాలేవు, నువ్వు ఎప్పటికీ నందగోపాల్ భార్యవి అది కూడా రెండో భార్యవి మాత్రమే. తల్లకిందులుగా తపస్సు చేసిన ఈ ఇంటికి ఇల్లాలు, నా పిల్లలకి తల్లి కాలేవు
లాస్య: నీ పిల్లలకి తల్లిగా నీ స్థానాన్ని ఆక్రమించబోతున్నా ఇది గ్యారెంటీ
నెలరోజుల టైమ్ లో ఇంట్లో వాళ్ళందరిని తనవైపుకి తిప్పుకుంటాను అని లాస్య ఛాలెంజ్ చేస్తుంది. ఛాలెంజ్ కి తులసి కూడా రెడీ అంటుంది. ప్రేమ్ పాట పాడుతుంటే విని తులసి గిటార్ తీసుకుని వస్తాను పాట పాడు అని అడుగుతుంది. గిటార్ తీసుకురావడానికి లోపలికి వెళ్లడంతో ప్రేమ్ టెన్షన్ పడతాడు. గిటార్ అమ్మేశాను ఈ విషయం ఎలా చెప్పాలి అనుకుంటూ ఉండగా తులసి గిటార్ తీసుకొచ్చి ఇస్తుంది. అది చూసి ప్రేమ్ ఎమోషనల్ అవుతాడు. శ్రుతి హాస్పిటల్ ఖర్చుల కోసం అమ్మాల్సి వచ్చిందని ప్రేమ్ అంటే.. అప్పుడే నిన్ను నేను చూసి దాన్ని కొన్నాను అని తులసి చెప్తుంది. అమ్మ కంటే భార్య ప్రేమ గొప్పది, తల్లిని కూడా మరిపిస్తుంది, అలాంటి భార్య కోసం గిటార్ అమ్మావ్ అంటే జీవితం విలువ తెలుసుకున్నట్టే అని తులసి ప్రేమ్ ని మెచ్చుకుంటుంది.
తరువాయి భాగంలో..
తులసి స్థానం తీసుకోవడానికి లాస్య తెగ ట్రై చేస్తుంది. ఇంట్లో వాళ్ళకి భోజనం వడ్డించడం చేస్తుంది. అనసూయ కాళ్ళు మర్దన చేస్తా చేతకాక నొక్కేస్తూ తెగ తిప్పలు పడుతుంది.