By: ABP Desam | Updated at : 13 Jan 2023 08:03 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Disney Plus Hotstar/ Star Maa
రాణి వేద, యష్ వాళ్ళకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అని వేద అడుగుతుంది. అన్యోన్య దాంపత్య వ్రతంలో ఇది కూడా ఒక భాగమే తర్వాత నీకు ఒడి బియ్యం పోయాలి అప్పుడే వ్రతం పూర్తి అయినట్టు రాణి చెప్తుంది. అటు యష్ కూడా తనకి ఆఫీసులో చాలా పనులు ఉన్నాయని అర్జెంట్ గా వెళ్లాలని అడుగుతాడు. కానీ ఈ ఒక్కరోజు ఉండి తీరాల్సిందేనని చెప్పేసి వెళ్ళిపోతాడు. వేదని రాణి, యష్ ని రాజా చక్కగా అందంగా ముస్తాబు చేస్తారు. రాజా సెంట్ కొట్టబోతుంటే వద్దని చెప్తాడు. సెంట్ కొట్టుకుని రావడం తనకి ఇష్టం లేదని చీటీ రాసి కంప్లైంట్ బాక్స్ లో వేసిందని అంటాడు.
వేద చేతికి గాజులు చూసి అన్ని ఎందుకు వేసుకున్నావ్ తీసేయ్ అని రాణి అంటుంది. కానీ వేద మాత్రం తన భర్తకి గాజులు ఉంచుకోవడమే ఇష్టమని చెప్తుంది. భార్య అందంగా కనిపించాల్సింది అద్దంలో కాదు భర్త కళ్ళలో కనిపించాలి అప్పుడే నువ్వు మంచి భార్యవి అవుతావని రాణి అంటుంది. నీకు నువ్వు నచ్చేలా కాదు నీ భార్య మెచ్చేలా ఉండాలి అప్పుడే నువ్వు మంచి భర్తవి అవుతావు. కష్టం, సుఖం చెరిసగం పంచుకోండి అని రాజా యష్ కి చెప్తాడు. వేదని శోభనం గదిలోకి పంపిస్తారు. కాసేపటికి యష్ కూడా వచ్చి వేదని అలా చూస్తూ చాలా బ్యూటీఫుల్ గా ఉన్నావ్ అని అంటాడు. వేద పాలు తాగమని గ్లాసు ఇస్తుంది. ఎందుకు నిద్ర పట్టడానికా అని యష్ అమాయకంగా అడుగుతాడు.
Also Read: వేద, యష్ తొలిరాత్రి- భార్యాభర్తలుగా ఒక్కటవుతారా?
వేద కిందపడుకోవడానికి రెడీ అవుతుంటే యష్ ఆపుతాడు. తన కోసం అయినా మంచం మీద పడుకోమని అడుగుతాడు. దీంతో ఇద్దరూ మంచానికి చెరొక వైపు పడుకుంటారు. ‘ఏం జరుగుతుంది? ఇష్టాన్ని కష్టం చేశాడు. కష్టాన్ని ఇష్టం చేశాడు. కోరుకున్న జీవితం అందని ద్రాక్ష అవుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి. జీవితాంతం ఖుషికి తల్లిగానే ఉండాలా? యశోధర్ కి భార్యని కాలేనా? భర్తగా ఆయన చొరవ తీసుకోవాలి కానీ ఆడదానిగా నేను చేయలేను కదా’ అని వేద మనసులో అనుకుంటుంది. ‘మేమిద్దరం భార్యాభర్తలు అయ్యింది ఖుషికి అమ్మానాన్నలు కావడం కోసమే కదా. దాన్ని నేను అతిక్రమిస్తే బాగోదు. అయినా తన మనసులో నేను ఖుషికి తండ్రిగానే ఉన్నా, జీవితాంతం అలాగే ఉండాలా? భర్తని కాలేనా? ఇదేనా జీవితం భర్తని కాలేనా’? అని యష్ మనసులో అనుకుంటాడు.
Also Read: వేద, యష్‌తో అన్యోన్య దాంపత్య వ్రతం చేయిస్తున్న రాజా- ఇద్దరు ఒక్కటి అవుతారా?
‘ఖుషికి అమ్మానాన్నలుగా మేమిద్దరం ఒక్కటై పోయాం, కానీ భార్యాభర్తలుగా మాత్రం ఒక్కటి కాలేకపోయాం. బయట అమ్మమ్మ తాతయ్య వాళ్ళని నొప్పించలేము కదా. మమ్మల్ని కలపాలని అన్యోన్య దాంపత్య వ్రతం చేయించారు. శోభనం ఏర్పాటు చేశారు. కానీ వాళ్ళు ఆశపడినట్టు ఏం జరగలేదని తెలిస్తే ఎంత బాధపడతారు. వాళ్ళ ముందు నటించక తప్పదు’ అని చీర, పూలు నలిగినట్టు వేద చేసుకుంటుంది. అదంతా బయట నుంచి రాణి చూస్తుంది. దిగులుగా రాజా దగ్గరకి వస్తుంది. వేద నవ్వుతూ వాళ్ళకి కనిపించేసరికి శోభనం అయ్యిందని రాజా అనుకుంటాడు. కానీ రాణి వాళ్ళిద్దరూ కలవలేదని నిజం చెప్తుంది.
Salim Khan Marriage: పెళ్లి కోసం పేరు మార్చుకున్న సల్మాన్ తండ్రి, సలీం ఖాన్ శంకర్ గా ఎలా మారారో తెలుసా?
Satyadeep Misra Marriage: రహస్యం ఏమీ లేదు, అందరికీ చెప్పే మసాబాను పెళ్లి చేసుకున్నా- సత్యదీప్ మిశ్రా
Sidharth Kiara Advani Wedding: సిద్ధార్థ్-కియారా పెళ్లికి వెళ్లే గెస్టులకు ఓ కండీషన్, దయచేసి ఆపని చెయ్యొద్దని కోరిన కొత్త జంట!
Vani Jayaram Death Mystery : రక్తపు మడుగులో వాణీ జయరామ్ - మిస్టరీగా లెజండరీ సింగర్ మృతి
Singer Vani Jayaram Death : లెజండరీ సింగర్ వాణీ జయరామ్ మృతి - రెండు నేషనల్ అవార్డులు విశ్వనాథ్ సినిమాల్లో పాటలకే
BRS Nanded Meeting : నాందేడ్లో బీఆర్ఎస్ బహిరంగసభకు ఏర్పాట్లు పూర్తి - భారీగా మహారాష్ట్ర నేతల చేరికలు !
Rushikonda Green Carpet : పచ్చగా మారిపోయిన రుషికొండ - ఈ మ్యాజిక్ ఎలా జరిగిందో తెలుసా ?
Hyderabad News : కేసీఆర్ మనవడు రితేశ్ రావు మిస్సింగ్, అర్ధరాత్రి పోలీసులే తీసుకెళ్లారని రమ్య రావు ఆరోపణ!
IND vs AUS: వీళ్లని లైట్ తీసుకుంటే టీమిండియాకు కష్టమే - ఆరుగురు డేంజరస్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్!