Gruhalakshmi July 8th Update: దగ్గరైన తల్లీకొడుకులు, ప్రేమ్ పాటల పోటీలో ఒడిపోయేలా చేయాలని లాస్య స్కెచ్
తన వల్లే తన కొడుకు జీవితాన్ని కోల్పోతున్నాడని అర్థం చేసుకున్న తులసి కొడుకు దగ్గరకి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది. తల్లి తన దగ్గరకి రావడం చూసి ప్రేమ్ ఎమోషనల్ అవుతాడు. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..
నందు మనం ఇలా నాలుగు గోడల మధ్యే ఉంటే మన ఆలోచనలు జరిగిపోయిన సంఘటన చుట్టూనే తిరుగుతూ ఉంటాయని అప్పుడు మనం ప్రశాంతంగా ఉండలేమని నందు మూడ్ మార్చేందుకు బయటకి వెళ్దామని లాస్య అంటుంది. రేపు ఏవో పాటల పోటీలు జరుగుతున్నాయంట అవి చూడటానికి రమ్మని మా ఫ్రెండ్ ఫోన్ చేసింది అక్కడికి వెళ్దామని అంటే నందు సరే అంటాడు. ఇక ప్రేమ్ పాట రాయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. మరోవైపు తులసి ప్రేమ్ ని తలుచుకుని బాధపడుతుంది. అప్పుడే సంజన తులసికి ఫోన్ చేసి ప్రేమ్ ఇంక నన్ను కలవలేదు మాట్లాడలేదు అంటే పాటల పోటీకే సిద్ధమవుతున్నాడాని ఆ పనిలోనే ఉన్నాడని చెప్తుంది. నేను దూరంగా ఉండటం వల్లే ప్రేమ్ ఇలా అయిపోయాడని తులసి బాధపడటం అంకిత చూస్తుంది.
మీరు దూరంగా ఉన్నారనే దిగులే ప్రేమ్ టాలెంట్ ని సగం చంపేసిందని మీరు మొండిగా ఉండటం వల్లే ఇలా అవుతుందని అంకిత అంటుంది. మీరు దూరంగా ఉండటం వల్ల ప్రేమ్ తన మీద తాను నమ్మకం పోగొట్టుకుంటున్నాడని అంటుంది. ప్రేమ్ కి మీరు ఎప్పుడు బలమే కానీ బలహీనత కాదు, మీకు చెప్పేంత పెద్దదాన్నికాదు కానీ మీరు ఈ టైం లో ప్రేమ్ పక్కన ఉండటం చాలా అవసరం అని చెప్పి అంకిత అక్కడనుంచి వెళ్తుంది. ఇక తులసి నేను చేసిన తప్పుని ఇప్పటికైనా ఒప్పుకోవాలి దాన్ని సరిదిద్దుకుని ప్రేమ్ పక్కనే ఉండాలని మనసులో అనుకుంటుంది.
Also Read: రిషి మనసులో దాగని ప్రేమ, వసు కళ్లుతిరిగి పడిపోయిందనగానే కంగారుపడిపోయిన ఈగో మాస్టర్
‘పాటల పోటీలో గెలిచాకే నీ ముందు వచ్చి నిలబడదామని అనుకున్నాను విజేతగా నా కొడుకుని గుండెలకి హత్తుకుందామని అనుకున్నాను. విజేతగా నా కొడుకు నిలిచాడని లోకమంతా వినిపించేలా గట్టిగా అరిచి చెప్దామనుకున్నాను. నేను గర్వపడాలనుకున్న ఆ క్షణం చేజారిపోతుందేమో, నా బిడ్డ ఎక్కడ ఓడిపోయిన వాడిలాగా నిలబడతాదేమో అని భయపడుతూ ఇంత రాత్రి వేళ నీ కోసం వచ్చాను. అమ్మ అంటే నీకు ఇష్టం, ప్రాణం, ప్రపంచమని నాకు తెలుసు. నీ గురించి ఈ అమ్మ కనే కలని నెరవేర్చి అమ్మని సంతోషపెట్టాలి అంతే కానీ అమ్మ దూరంగా ఉంచిందని దిగులుపడి నీ శక్తిని నువ్వు మర్చిపోవడం కాదురా నువ్వు చేయాల్సింది’ అని తులసి కొడుక్కి హితబోధ చేస్తుంది. ఆ మాటలకి ‘అమ్మా ఒక్కసారి నీ భుజం మీద తల పెట్టుకోవచ్చా నీ దగ్గరకి రావచ్చా’ అని ప్రేమ్ ఎమోషనల్ గా అడుగుతాడు. తులసి రా నాన్న అని కొడుకుని దగ్గరకి తీసుకుంటుంది. ప్రేమ్ తల్లిని కౌగలించుకుని చిన్న పిల్లడిలా ఏడుస్తాడు.
Also Read: రాత్రంతా జ్వాల(శౌర్య) ఇంటి ముందే వర్షంలో నిల్చున్న హిమ, తాతయ్య-నానమ్మ కన్నీళ్లకు కరగని శౌర్య
కొత్త జన్మ ఎత్తినంత ఆనందంగా ఉందమ్మా అని ప్రేమ్ అంటాడు. ఆ ఆనందం నీకే కాదు ఈ అమ్మకి కూడా కావాలి. నువ్వు నా కల నెరవేర్చినప్పుడే నాకు ఆ ఆనందమని తులసి అంటుంది. ఈ అమ్మ కోరిక నెరవేరుస్తావ్ కదూ అని అడుగుతుంది.. నెరవేర్చకపోతే నేను కొడుకునే కాదమ్మా అని అంటాడు. అక్కడ ఉన్న గిటార్ తీసుకొచ్చి తులసి ప్రేమ్ కి ఇస్తుంది. పందెంలో నా కొడుకే గెలుస్తాడని తులసి అంటుంది. ఇక పాటల పోటీ జరిగే దగ్గరకి ప్రేమ్, తులసి కుటుంబం మొత్తం వస్తారు. ఇక అప్పుడే అక్కడికి అభి కూడా వస్తాడు. పాటల పోటీ లో తప్పకుండా గెలవాలని తులసి ప్రేమ్ కి ధైర్యం చెప్తుంది. నందు, లాస్య అప్పుడే అక్కడికి వచ్చి తులసి వాళ్ళని చూసి షాక్ అవుతారు. చెంప దెబ్బ కొట్టి ఇంట్లో నుంచి గెంటేశావ్ అంతలోనే దిగులు పెట్టుకున్నవా కొడుకుతో చేతులు కలిపేశావ్ అని లాస్య వెటకారంగా అంటుంది. అదే తల్లీబిడ్డల బంధం అంటారు నీకు చెప్పిన అర్థం కావులే అని అంటుంది. ఇక లాస్య ప్రేమ్ నిన్ను ఓడించడానికే ఆ దేవుడు ఈరోజు నన్ను ఇక్కడికి రప్పించాడు, నీకు గెలుపు మిస్ అయ్యేలాగా చేస్తానని లాస్య మనసులో అనుకుంటుంది.