Adult Apps Ban: ULLU, ALTT సహా దేశంలో 25 అడల్ట్ యాప్‌లు నిషేధం: మీ ఫోన్‌లో ఉంటే అంతే సంగతులు
Multiple apps Ban: అభ్యంతరకరమైన, అశ్లీలమైన కంటెంట్ అందిస్తున్నారన్న కారణంతో దేశంలో 25 మొబైల్‌యాప్‌లపై నిషేధం విధించారు. ఇందులో ఎక్కువ పాపులర్ అయిన ULLU, ALTT వంటివి కూడా ఉన్నాయి.

Indian Adult Apps Banned: అశ్లీల దృశ్యాలతో మొబైల్స్‌ను ముంచెత్తుతున్న యాప్‌లకు కేంద్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. దేశంలోని 25 అడల్ట్ మొబైల్‌యాప్‌లను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అభ్యంతరకరమైన కంటెంట్‌ను అందిస్తున్న మొబైల్ అప్లికేషన్‌లను భారత్‌లో ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాలని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు (ISP)లకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ MIB ఆదేశాలు చేసినట్లు Storyboard18 పేర్కొంది. తీవ్ర అభ్యంతరకరమైన వీడియో కంటెంట్ అందిస్తున్న 25 మొబైల్‌యాప్‌లను Ministry of Information & Broadcasting (MIB) గుర్తించిందని ఇందులో అభ్యంతరకరమైన అడ్వర్‌టైజ్‌మెంట్లతో పాటు.. పోర్నోగ్రఫీ ఉన్నట్లుగా పేర్కొంటూ మంత్రిత్వశాఖ ISPలకు లేఖ రాసింది. దేశంలో బాగా పాపులర్ అయినటువంటి..ALTT, ULLU లాంటి యాప్‌లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి
ఉల్లంఘించిన చట్టాలు ఇవే..!
IT చట్టం 2000, Intermediary Guidelines & Digital Media Ethics Code, 2021 లకు విరుద్ధంగా వీటి ప్రసారాలున్నాయని కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది.
- అసభ్య ప్రదర్శనలు, పోర్నోగ్రఫీలను నిరోధించే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 294 (2023) కూడా వర్తిస్తుందని పేర్కొంది. వీటితో పాటు మహిళలను అనుచితంగా చూపించే ప్రసారాలు Indecent Representation of Women (Prohibition) Act, 1986 పరిధిలోనూ ఇవి వస్తాయని తెలిపింది. IT Act 2000 లోని సెక్షన్ 79(3)(b) ప్రకారం ఇలాంటి అభ్యంతరకరమైన ప్రసారాలు మధ్యవర్తి సంస్థలు (ISPs) అడ్డుకోవాలని.. అలా జరగని పక్షంలో వాటిపై కూడా చర్య తీసుకునేందుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం కొంచం తీవ్రంగానే హెచ్చరించింది. పోర్నోగ్రఫీతో పాటు, అభ్యంతరకరమైన, అసభ్యమైన ప్రకటనలు, వీడియోలు, మహిళల ప్రతిష్టను దిగజార్చే విధమైన కంటెంట్ వల్ల సమాజానికి హాని జరుగుతుందని తెలిపింది.
నిషేధిత అప్లికేషన్ల పూర్తి జాబితా ఇదే..!
ULLU, ALTT, Desiflix, Big Shots App, Boomex, Navarasa Lite, Gulab App, Kangan App, Bull App, Jalva App, Look Entertainment, Hitprime, Feneo, ShowX, Sol Talkies, Adda TV, HotX VIP, Hulchul App, MoodX, NeonX VIP, Fugi, Mojflix, Triflicks
ప్రభుత్వ ఆదేశాలు
- ISPs (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్): ఈ యాప్స్, వెబ్‌సైట్లన్నిటిపై యాక్సెస్ పూర్తిగా బ్లాక్ చేయాల్సిందిగా స్పష్టమైన ఆదేశాలు విడుదల
- Google Play Store, Apple App Store నుంచి కూడా ఈ యాప్స్ తొలగించడంపై చర్యలు
- OTT, డిజిటల్ మీడియా ప్లాట్‌ఫాంలు భారతీయ చట్టాలు/నిబంధనలు అనుసరించకుంటే చట్టపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాల్సిందేనని హెచ్చరిక





















