Vijay Devarakonda - Rashmika : విజయ్ దేవరకొండ - రష్మిక పెళ్లి చేసుకుంటారా?
యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా త్వరలో పెళ్లి చేసుకుంటారా? ఇద్దరూ ఎన్నిసార్లు ఖండించినా... వీళ్ళ పెళ్లి డిస్కషన్ మాత్రం ఆగడం లేదు.
విజయ్ దేవరకొండ ఎప్పుడు పెళ్లి (Vijay Devarakonda Marriage) చేసుకుంటారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. కథానాయకుడిగా ఇప్పుడు ఆయన కెరీర్ జెట్ స్పీడ్‌లో దూసుకు వెళుతోంది. ఆయనకు నేషనల్ లెవల్‌లో క్రేజ్ ఉంది. ఈ టైమ్‌లో ఆయన ఎందుకు చేసుకుంటారు? పెళ్లి సంగతి పక్కన పెడితే... ప్రేమ సంగతి చెప్పడానికి కూడా విజయ్ దేవరకొండ ఇష్టపడటం లేదు.
'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో విజయ్ దేవరకొండను ప్రేమ, పెళ్లి అంశాల గురించి ప్రశ్నించగా... ''నేను పెళ్లి చేసుకునేటప్పుడు, తండ్రి అయ్యేటప్పుడు అందరికీ చెబుతా. గట్టిగా అరిచి మరీ చెబుతా. అప్పటి వరకు నన్ను అభిమానించే ప్రేక్షకుల మనోభావాలు గాయపరచాలని అనుకోవడం లేదు. నటుడిగా నన్ను చాలా మంది ప్రేమిస్తారు. నా ఫోటో వాళ్ళ గోడలపై ఉంటుంది. ఫోన్ వాల్ పేపర్స్ లో ఉంటుంది. వాళ్ళ హార్ట్ బ్రేక్ చేయాలని అనుకోవడం లేదు'' అని చెప్పారు. అయితే... రష్మికతో ఆయన ప్రేమలో ఉన్నారనేది ఇండస్ట్రీ గుసగుస.
రష్మిక డార్లింగ్ : విజయ్ దేవరకొండ
నేషనల్ క్రష్ రష్మికా మందన్నాతో తన అనుబంధం గురించి కూడా 'కాఫీ విత్ కరణ్'లో విజయ్ దేవరకొండ మాట్లాడారు. రష్మిక అంటే స్పెషల్ అని, డార్లింగ్ అని పేర్కొన్నారు. గతంలో వీళ్ళిద్దరి పెళ్లి గురించి కథనాలు వచ్చాయి. అప్పుడు ఖండించారు. మళ్ళీ ఇప్పుడు ఎందుకు వీళ్ళిద్దరి పెళ్లి ప్రస్తావన తెరపైకి వచ్చింది అంటే? 'కాఫీ విత్ కరణ్' అని ప్రోగ్రామ్ చెప్పాలి.
విజయ్ - రష్మిక ప్రేమను అనన్యా అలా బయట పెట్టారా?
కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో కరణ్ జోహార్ అడిగిన ఒక ప్రశ్నకు ''మికా సింగ్‌ను మీట్ అవ్వడానికి విజయ్ దేవరకొండ రష్ లో ఉన్నాడు'' అని అనన్యా పాండే చెప్పారు. ''రష్ ప్లస్ మికా ఈక్వల్స్ టు రష్మిక'' అని, విజయ్ దేవరకొండ రిలేషన్షిప్ విషయాన్ని అనన్యా పాండే చాలా తెలివిగా బయట పెట్టారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. అంతే కాదు... విజయ్ దేవరకొండ, రేష్మిక పెళ్లి చేసుకుంటారని నెటిజన్స్ తమకు తోచిన థియరీలు చెబుతున్నారు. అదీ సంగతి!
విజయ్ నోట రష్మిక పేరు వచ్చిన వెంటనే...
విజయ్ దేవరకొండ ఇటీవల ఒక టీవీ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆయన నోటి వెంట రష్మిక పేరు వచ్చిన వెంటనే చాలా మంది నవ్వారు. ఆ విషయాన్ని విజయ్ చెబుతూ ''నేను నీ పేరు చెప్పిన ఎందుకు అలా రియాక్ట్ అవుతున్నారో తెలియదు'' అని అన్నారు. ఆమె అందంగా ఉందని కాంప్లిమెంట్ ఇచ్చారు.
Also Read : 'లైగర్' టీమ్‌తో మెగాస్టార్, సల్మాన్ ఖాన్ - అనన్య లేటెస్ట్ ప్రాజెక్ట్, మంచు లక్ష్మి స్టైలిష్ అవతార్!
ఇటు విజయ్ దేవరకొండ గానీ... అటు రష్మికా మందన్నా గానీ... ఎప్పుడూ ప్రేమలో ఉన్నామని చెప్పలేదు. అయితే... వాళ్ళిద్దరి రిలేషన్షిప్ గురించి తరచూ సోషల్ మీడియా, ముంబై మీడియాలో డిస్కషన్ జరుగుతోంది.