News
News
X

Kiara Pregnancy: కియరా ప్రెగ్నెంటా? ఆ ‘పోల్కా డాట్‌ డ్రెస్’ వెనుక అంత కథ ఉందా? అసలు నిజం ఇదీ!

హీరోయిన్ కియారా అడ్వాణీ ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. ఆమె బ్లాక్ అండ్ వైట్ పోల్కా డాట్ డ్రెస్ ధరించిన కారణంగా, పెళ్ళైన మూడు వారాలకే ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

FOLLOW US: 
Share:

బాలీవుడ్‌ క్రేజీ కపుల్స్‌ లో కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా జంట ఒకటి. గత కొన్నేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్న ఉన్న ఈ జంట.. ఫిబ్రవరి 7న పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. రాజస్థాన్‌ లోని ఓ ప్యాలెస్‌ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అనంతరం ముంబై - ఢిల్లీలలో రిసెప్షన్‌ ని ఏర్పాటు చేయగా, సినీ ప్రముఖులు అందరూ హాజరై నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది కానీ.. వీరి వివాహం జరిగి మూడు వారాలు తిరక్కుండానే, కియారా ప్రెగ్నెంట్ అంటూ సోషల్ మీడియాలో రూమర్స్ చక్కర్లు కొట్టడం చర్చనీయాంశంగా మారింది.

ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది ఓ మధుర జ్ఞాపకం. ఆ తర్వాత దంపతులకు సంతానం కలగడంలో ఉన్న ఆనందాన్ని వర్ణించడం ఎవరి తరం కాదు. అది సామాన్యులైనా.. సెలబ్రిటీలైనా ఒక్కటే. అయితే గత కొంతకాలంగా బాలీవుడ్ సెలబ్రిటీలు పోల్కా డాట్‌ డ్రెస్ స్టైల్‌ లో ప్రెగ్నెన్సీని ప్రకటిస్తూ వస్తున్నారు. అనుష్క శర్మను మొదలు కొని అలియా భట్ వరకూ అనేక మంది ముద్దుగుమ్మలు ఇదే విధంగా గర్భధారణ విషయాన్ని ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రకటించారు. అయితే ఇప్పుడు కియారా కూడా అలాంటి డ్రెస్సింగ్ లోనే కనిపించడంతో ఆమెపై ప్రెగ్నెంట్ రూమర్స్ పుట్టుకొచ్చాయని తెలుస్తోంది. 

కియారా ఒక గొడుగు పట్టుకొని, బ్లాక్ అండ్ వైట్ పోల్కా డాట్ డ్రెస్‌లో ఉన్న ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇది గమనించిన నెటిజన్లు గతంలో మ్యాజికల్ డ్రెస్ కోడ్ తో ప్రెగ్నెన్సీ విషయాన్ని ప్రకటించిన సెలబ్రిటీల ఫొటోలతో లింక్ చేస్తూ.. కియారా కూడా గర్భవతి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రకటన చేయడానికి ఆమె పోల్కాస్‌ ని ఎంచుకుంది అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. 

View this post on Instagram
 
A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ జంట తమ మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రెగ్నెన్సీ ప్రకటన చేసినప్పుడు, అనుష్క నలుపు-తెలుపు పోల్కా డాట్ డ్రెస్ ధరించి కనిపించింది. హార్దిక్ పాండ్యా - నటాసా స్టాంకోవిచ్ దంపతులు కూడా ఇదే ఫాలో అయిపోయారు. కరీనా కపూర్ ఖాన్, ప్రియాంక చోప్రా, మీరా రాజ్ పుత్ కపూర్, నేహా దుపియా, సానియా మీర్జా, లారా దత్తా వంటి పలువురు సెలబ్రిటీలు సైతం పోల్కా డాట్‌ డ్రెస్ లోనే గర్భధారణ ప్రకటన చేశారు. దీంతో కియరా కూడా ప్రెగ్నెన్సీ వార్తని ప్రకటించడానికి ఆ డ్రెస్ వేసుకుందని అంటున్నారు.  అలియా భట్ మాదిరిగానే కియారా కూడా పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అంటూ మీమ్ రాయుళ్లు రకరకాల మీమ్స్ తో రెచ్చిపోతున్నారు. నిజానికి కియారా 2019లో ఈ డ్రెస్ లో కనిపించింది. కాకపోతే రీసెంట్ గా పెళ్లి చేసుకోవడంతో.. ఆ ఫోటోలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. 

View this post on Instagram
 
A post shared by KIARA (@kiaraaliaadvani)

గతంలో రణవీర్ సింగ్ పోల్కా క్యాస్టూమ్స్ లో ఉన్నప్పుడు దీపికా పడుకునే పైనా ఫన్నీ మీమ్స్ వైరల్ అయ్యాయి. అలానే కత్రినా కైఫ్, కృతి సనన్, అనన్య పాండే, మలైకా అరోరా వంటి పలువురు హీరోయిన్లు బ్లాక్ అండ్ వైట్ పోల్కా డాట్ డ్రెస్‌ ధరించడంపైనా కొన్ని హిస్టీరికల్ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పుడు కియారా మీద కూడా మీమ్స్ పుట్టుకొచ్చాయి. 

ఇదిలా ఉంటే వివాదాస్పద సినీ విశ్లేషకుడు కమాల్ ఆర్ ఖాన్ ఇటీవల సిద్దార్థ్ - కియారా జంటపై సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశాడు. ‘‘ముందుగా గర్భం దాల్చి ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం బాలీవుడ్ కొత్త ట్రెండ్. మూలాల ప్రకారం.. బాలీవుడ్‌లో కొత్తగా పెళ్లి చేసుకున్న జంట కూడా అదే ఫార్ములాని ఫాలో అయ్యింది’’ అని పేర్కొన్నాడు. రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ పెళ్లి చేసుకున్న రెండున్నర నెలలకే, ఆలియా గర్భవతి అయినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 7 నెలలకే ఆలియా ఓ పండంటి పాపకి జన్మనిచ్చింది. ఈ తరుణంలో ఇదే ట్రెండ్‌ ని కియారా కపుల్ కూడా ఫాలో అయ్యారంటూ కేఆర్కే వ్యగ్యంగా ట్వీట్ చేశారు. 

Published at : 28 Feb 2023 10:09 PM (IST) Tags: Kiara Advani Bollywood Sidharth Malhotra black polka dress Kiara Advani Pregnant Kiara Pregnancy

సంబంధిత కథనాలు

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Pushpa 2 OTT Rights Price : 'పుష్ప 2' ఓటీటీ రైట్స్‌కు 200 కోట్లు - ఇదంతా 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ మహిమేనా?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Naga Chaitanya - Sobhita Dhulipala: చైతూ - శోభిత మళ్లీ దొరికిపోయారా? వైరల్ అవుతున్న డేటింగ్ ఫొటో!

Balakrishna - Boyapati Srinu : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?

Balakrishna - Boyapati Srinu : ఏపీ ఎన్నికలే టార్గెట్‌గా బాలకృష్ణతో బోయపాటి పొలిటికల్ ఫిల్మ్?

Meena Second Marriage : మీనా రెండో పెళ్లి - వయసులో చిన్నోడు, విడాకులు తీసుకున్న హీరోతో?

Meena Second Marriage : మీనా రెండో పెళ్లి - వయసులో చిన్నోడు, విడాకులు తీసుకున్న హీరోతో?

టాప్ స్టోరీస్

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

YSRCP Leader Meet Nara Lokesh: నారా లోకేష్‌తో నెల్లూరు వైసీపీ నేత సీక్రెట్ మీటింగ్, నిజమేనా?

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

KTR On Vizag Steel: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి - కేంద్రానికి TS మంత్రి కేటీఆర్ లేఖ

Kadiam Srihari: ఎన్నికల్లో నన్ను వాడుకుంటారు, ఈ మీటింగ్‌లకు మాత్రం పిలవరు - ఎమ్మెల్సీ కడియం వ్యాఖ్యలు

Kadiam Srihari: ఎన్నికల్లో నన్ను వాడుకుంటారు, ఈ మీటింగ్‌లకు మాత్రం పిలవరు - ఎమ్మెల్సీ కడియం వ్యాఖ్యలు

IPL 2023: బట్లర్‌ అరాచకం.. 6 ఓవర్లకే రాజస్థాన్‌ 85/1 - పవర్‌ప్లే రికార్డు!

IPL 2023: బట్లర్‌ అరాచకం.. 6 ఓవర్లకే రాజస్థాన్‌ 85/1 - పవర్‌ప్లే రికార్డు!