Suriya 47: ఇండస్ట్రీ దద్దరిల్లే కాంబో సెట్టు... సూర్య 47వ సినిమాకు దర్శక నిర్మాతలుగా కంటిన్యూస్ హిట్స్ కొడుతున్న మలయాళ స్టార్స్
Suriya 47 : ప్రస్తుతం 'రెట్రో'తో పాటు మరో రెండు సినిమాలతో బిజీగా ఉన్న సూర్య నెక్స్ట్ మూవీని బాసిల్ జోసెఫ్ దర్శకత్వంలో చేయనున్నారని టాక్ నడుస్తోంది.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, మలయాళ స్టార్ హీరోతో కలిసి సినిమా చేయబోతున్నాడని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరు స్టార్స్ కలిసి చేయబోతున్న ప్రయోగాత్మక సినిమాను మరో మాలీవుడ్ బిగ్గెస్ట్ స్టార్ నిర్మించబోతున్నారనే వార్త ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
లెజెండరీ హీరో నిర్మాతగా సూర్య నెక్స్ట్ మూవీ...
గత ఏడాది 'కంగువ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కోలీవుడ్ స్టార్ సూర్య. ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఎంత రిస్క్ కైనా వెనకాడని ఈ హీరో నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంతో 'కంగవా'పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. కానీ మూవీ రిలీజ్ అయ్యాక ఆ అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. దీంతో సూర్య ఈ మూవీ రిజల్ట్ ని పక్కన పెట్టేసి, తన నెక్స్ట్ మూవీపై దృష్టి పెట్టాడు. సూర్య హీరోగా, కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో 'రెట్రో' అనే మూవీ రూపొందుతోంది. ఇందులో సూర్య సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన గ్లిమ్స్ రిలీజ్ కాగా, మూవీపై బజ్ బాగానే పెరిగింది. అయితే 'రెట్రో' మూవీ తర్వాత సూర్య చేయబోయే నెక్స్ట్ మూవీ ఏంటి అన్నది మిస్టరీగా ఉంది. ఆ మిస్టరీకి సమాధానంగా ఒక మాలీవుడ్ స్టార్ తో సూర్య సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది.
సూర్య తన 47వ సినిమా కోసం అవార్డు విన్నింగ్ మలయాళ నటుడు, దర్శకుడు బాసిల్ జోసెఫ్ తో కలిసి ఓ ప్రాజెక్టుకి సైన్ చేసాడని కోలీవుడ్ కోడై కోస్తోంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బాసిల్ ఆ రూమర్స్ ను ఖండించకపోవడంతో ఈ ప్రాజెక్ట్ పై వస్తున్న రూమర్లకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సూర్య 47వ సినిమాను లెజెండరీ మలయాళ నటుడు మమ్ముట్టి తన నిర్మాణ సంస్థ మమ్ముట్టి కంపెనీ ప్రొడక్షన్ హౌస్ లో నిర్మించబోతున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ఇంటరెస్టింగ్ విషయం ఏమిటంటే సూర్య ఇందులో సూపర్ హీరోగా కనిపించబోతున్నారు. అయితే ఈ వార్తలపైనే కాదు అసలు ఈ ప్రాజెక్టు పైనే ఇప్పటిదాకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.
హీరో, దర్శకుడిగా బాసిల్ జోసెఫ్ బిజీ
మాలీవుడ్ స్టార్ హీరోల్లో బాసిల్ జోసెఫ్ కూడా ఒకరు. నటుడిగా ఫుల్ బిజీగా ఉన్న బాసిల్ దర్శకుడిగా కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల కాలంలో బాసిల్ జోసెఫ్ నటించిన సినిమాలన్ని వరసగా హిట్ అయ్యాయి. రీసెంట్ గా ఆయన హీరోగా నటించిన 'సూక్ష్మదర్శిని' మూవీ ఓటీటీలోకి వచ్చింది. అంతకుముందు 'గురువాయూర్ అంబలనడయి, నునక్కుజి, జయజయ జయహే వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా ఆయన దగ్గరయ్యాడు.
వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెట్టిన సూర్య
సూర్య 'రెట్రో' మూవీ మే 1న విడుదల కానుంది. సూర్య ప్రస్తుతం తన 45వ ప్రాజెక్ట్ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నారు. అలాగే వెట్రిమారన్ 'వాడివాసల్' మూవీని కూడా లైన్ లో పెట్టారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

