Vishnu Manchu - Ginna New Release Date : దసరాకు 'జిన్నా' రావట్లేదు - పదిహేను రోజులు వెనక్కి వెళ్ళిన విష్ణు మంచు
Ginna Movie Postponed : విజయ దశమికి 'జిన్నా' సినిమాను విడుదల చేయాలని విష్ణు మంచు ప్లాన్ చేశారు. అయితే, ఇప్పుడు దసరాకు ఆ సినిమా రావడం లేదు. కొత్త విడుదల తేదీని ఆయన వెల్లడించారు.
విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'జిన్నా' (Ginna Movie). దీనిని విజయ దశమికి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని అనుకున్నారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే... ఆ రోజు సినిమా విడుదల కావడం లేదు.
అక్టోబర్ 5న చిరంజీవి 'గాడ్ ఫాదర్', అక్కినేని నాగార్జున 'ది ఘోస్ట్', బెల్లంకొండ గణేష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న 'స్వాతి ముత్యం' ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. విష్ణు సినిమా వస్తే థియేటర్లలో గట్టి పోటీ ఉండేది. ఆయన సినిమాను వాయిదా వేయడం వల్ల ఆ పోటీ తప్పింది.
విజయ దశమికి ట్రైలర్!
Ginna Movie Trailer Release On Dussehra 2022 : ఇప్పుడు దసరాకు 'జిన్నా' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు విష్ణు మంచు తెలిపారు. సినిమాను అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని ఇటీవల జరిగిన మీమర్స్ మీట్‌లో ఆయన పేర్కొన్నారు.
View this post on Instagram
'జిన్నా' సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ మీద విష్ణు మంచు కన్నేశారు. తెలుగు సహా హిందీ, మలయాళం భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందుకని, ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కావడం లేదు. హారర్ కామెడీగా రూపొందిన ఈ సినిమాలో ఫైట్లు, పాటల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఒక్కో పాటకు ఒక్కో స్టార్ కొరియోగ్రాఫర్ చేత స్టెప్పులు కంపోజ్ చేయించారు. 'జిన్నా'లో ప్రభుదేవా ఒక సాంగ్ చేశారు. గణేష్ ఆచార్య మరో సాంగ్ చేశారు. ప్రేమ్ రక్షిత్ కూడా సాంగ్స్ చేశారు. ఆయన నేతృత్వంలో ఓ పాట చేసినప్పుడు విష్ణుకు గాయం అయ్యింది.
View this post on Instagram
సన్నీ లియోన్... పాయల్... ఇద్దరు హీరోయిన్లు!
'జిన్నా'లో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. స్వాతి పాత్రలో పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput), రేణుకగా సన్నీ లియోన్ (Sunny Leone) నటించారు. ఈ సినిమా 'చంద్రముఖి' తరహాలో ఉంటుందని, బాక్సాఫీస్ బరిలో భారీ వసూళ్లు సాధిస్తుందని విష్ణు మంచు ఆశాభావం వ్యక్తం చేశారు.
'జిన్నా'తో కుమార్తెలను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న విష్ణు
'జిన్నా'లో స్నేహం నేపథ్యంలో రూపొందిన ఫ్రెండ్షిప్ సాంగ్‌ను విష్ణు కుమార్తెలు, కవలలు అరియానా - వివియానా ఆలపించారు. మిగతా పాటలను సీజనల్ సింగర్స్ పాడారు. సినిమాకు అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ప్లస్ అవుతుందని యూనిట్ చెబుతోంది.
Also Read : మహేష్ సినిమా కోసం మస్త్ ఐటమ్ సాంగ్ రెడీ - రూట్ మార్చిన త్రివిక్రమ్!
కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి మూల కథ అందించగా... కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్ కూడా ఆయనే. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. 'వెన్నెల' కిశోర్, 'చమ్మక్' చంద్ర, రఘుబాబు, సద్దాం తదితరులు కీలక పాత్రలు చేశారు.
Also Read : మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కన్నుమూత - విషాదంలో కృష్ణ ఫ్యామిలీ