News
News
X

Ginna First Review : లక్ష్మీ మంచు కుమార్తెను భయపెట్టిన 'జిన్నా' భాయ్ - నో నిద్ర

Vishnu Manchu's Ginna Movie First Review Out : విష్ణు మంచు కథానాయకుడిగా నటించిన 'జిన్నా' దీపావళి కానుకగా అక్టోబర్ 21న విడుదల కానుంది. అయితే, మంచు ఫ్యామిలీ కోసం స్పెషల్ షో వేశారు. 

FOLLOW US: 

విష్ణు మంచు (Vishnu Manchu) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'జిన్నా' (Ginna Movie). దీపావళి కానుకగా ఈ నెల 21న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. అయితే, ఆల్రెడీ కొంత మంది సినిమా చూశారు. కుటుంబ సభ్యులకు సినిమాను స్పెషల్‌గా చూపించారు విష్ణు మంచు.

విద్యా నిర్వాణకు నిద్ర పట్టలేదు...
ఎంజాయ్ చేసిన అరియనా, వివియానా!
Ginna First Review : 'జిన్నా'కు ఫస్ట్ రివ్యూ లక్ష్మీ మంచు కుమార్తె విద్యా నిర్వాణ నుంచి వచ్చింది. హారర్ కామెడీ ఫిల్మ్ కదా! సినిమా చూశాక... ఆ రోజు రాత్రి తన కుమార్తె రాత్రి నిద్రపోలేదని, పదిసార్లు నిద్రలోంచి లేచిందని, భయపడిందని లక్ష్మీ మంచు పేర్కొన్నారు. ఇంటర్వెల్ టైమ్‌లో విష్ణుతో ''థాంక్యూ... థాంక్యూ... ఇప్పుడు నేను నిద్రపోలేను'' అని విద్యా నిర్వాణ చెప్పిందట. ఇక, విష్ణు మంచు కుమార్తెలు అరియనా, వివియనా మాత్రం బాగా ఎంజాయ్ చేశారట. 

'చంద్రముఖి'ని మించి... 
'చంద్రముఖి' జానర్‌లో 'జిన్నా' ఉంటుందని విష్ణు మంచు తెలిపారు. 'చంద్రముఖి' డార్క్ కామెడీ జానర్ అయితే... అటువంటి చిత్రమే 'జిన్నా' అని ఆయన తెలిపారు. ఆ సినిమాకు మించి కామెడీ 'జిన్నా'లో ఉందన్నారు. అలాగే, థ్రిల్ కూడా ఉంటుందట. 

జిన్నా అంటే లోడ్ చేసిన గన్ను!
దసరాకు 'జిన్నా' ట్రైలర్ విడుదల చేశారు. 'జిన్నా అంటే పొయ్యి మీద కరిగే వెన్న కాదు... లోడ్ చేసిన గన్ను! జిన్నా భాయ్‌ను టచ్ చేస్తే దీపావళే!!' అంటూ హాస్య నటుడు సద్దాం చెప్పిన డైలాగ్ సినిమాలో విష్ణు క్యారెక్టర్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పింది. ట్రైలర్ చూస్తే... ఈ సినిమా పక్కా కమర్షియల్ ఎంట‌ర్‌టైన‌ర్‌ అనేది అర్థం అవుతోంది. విష్ణు మంచు డైనమిక్‌గా, హ్యాండ్సమ్‌గా కనిపించారు. ఫైట్స్ చేశారు, డ్యాన్సులు చేశారు. సున్నీ లియోన్, పాయల్ రాజ్‌పుత్‌తో హీరో రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. 

News Reels

సన్నీ లియోన్... పాయల్... 
ఇద్దరిలో దెయ్యం ఎవరు?
ట్రైలర్‌లో క్యారెక్టర్లు రివీల్ చేశారు గానీ కథేంటో చెప్పలేదు. టెంట్ హౌస్ ఓనర్‌గా విష్ణు క్యారెక్టర్ చూపించారు. ఆయన ఊరంతా ఎందుకు అప్పులు చేశారనేది సస్పెన్స్‌లో ఉంచారు. హీరోయిన్లు పాయల్ రాజ్‌పుత్‌ (Payal Rajput), సన్నీ లియోన్ (Sunny Leone) లో దెయ్యం ఎవరనేది రివీల్ చేయలేదు. 

'నా పేరు జిన్న రా... 
అందరికి అన్న రా!
'జిన్నా' చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ఇటీవల టైటిల్ సాంగ్ విడుదల చేశారు. 'నా పేరు జిన్న రా.... అందరికి అన్న రా' అంటూ సాగే ఆ పాటకు మంచి స్పందన లభిస్తోంది. విష్ణు కుమార్తెలు అరియనా, వివియయా పాడిన ఫ్రెండ్షిప్ సాంగ్ కూడా ఆకట్టుకుంటోంది.  

Also Read : Exposed Web Series Review - ఎక్స్‌పోజ్డ్‌ వెబ్ సిరీస్ రివ్యూ : దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సమర్పించు... న్యూస్ ప్రజెంటర్ డెత్ మిస్టరీ

కలెక్షన్ కింగ్ డా. మంచు మోహన్ బాబు (Mohan Babu) ఆశీస్సులతో  AVA ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, 24  ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంస్థలపై రూపొందుతోంది. సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ కథానాయికలు. దర్శకుడు జి. నాగేశ్వర రెడ్డి మూల కథ అందించగా... కోన వెంకట్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరించారు. ఈషాన్ సూర్య దర్శకత్వం వహించారు. చోటా కె. నాయుడు ఛాయాగ్రహణం అందించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. 'వెన్నెల' కిశోర్, 'చమ్మక్' చంద్ర, రఘుబాబు, సద్దాం తదితరులు కీలక పాత్రలు చేశారు.

Also Read : Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

Published at : 08 Oct 2022 08:02 AM (IST) Tags: Vishnu Manchu Ginna First Review Ginna Movie Review Sunny Leone Payal Rajput Ginna Special Show Manchu Family Watched Ginna

సంబంధిత కథనాలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Building For Pigeons: పావురాల కోసం రెండంతస్తుల భవనం - మ్యూజిక్ సిస్టమ్, మరెన్నో ప్రత్యేకతలు

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

Mahesh Babu: నాన్నగారు నాకు చాలా ఇచ్చారు - అందులో గొప్పది మీ అభిమానం: సూపర్ స్టార్ మహేష్ బాబు!

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

ఓటీటీలోకి ‘లవ్ టుడే’ - స్ట్రీమింగ్ ఎప్పట్నుంచి అంటే?

మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై బాలకృష్ణ క్లారిటీ, డైరెక్టర్ ఆయనేనా?

మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై బాలకృష్ణ క్లారిటీ, డైరెక్టర్ ఆయనేనా?

అల్లు అర్జున్ పక్కన ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల?

అల్లు అర్జున్ పక్కన ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల?

టాప్ స్టోరీస్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం: సీఎం కేసీఆర్

KCR Review Meeting: రొటీన్‌గా కాదు, గొప్పగా పనిచేయండి - విప్లవాత్మక మార్పులు తీసుకొద్దాం:  సీఎం కేసీఆర్

Bandi Sanjay : పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Bandi Sanjay :  పాలన చేతగాక పోతే ఇంట్లో కూర్చోండి, భైంసా ఏమైనా నిషేధిత ప్రాంతమా? - బండి సంజయ్

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Mla Prakash Reddy : నా తమ్ముడు మాట్లాడిన భాష తప్పు, భావం కరెక్టే - ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి

Talasani: 125 ఏళ్ల పార్టీ అంతరించిపోయింది, బీజేపీ నీటిమీద గాలి బుడగ లాంటిది: మంత్రి తలసాని

Talasani: 125 ఏళ్ల పార్టీ అంతరించిపోయింది, బీజేపీ నీటిమీద గాలి బుడగ లాంటిది: మంత్రి తలసాని