News
News
X

Prey Review: ప్రే సినిమా రివ్యూ: ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన లేటెస్ట్ ప్రిడేటర్ సినిమా ఎలా ఉందంటే?

డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజ్ అయిన ప్రే సినిమా ఎలా ఉందంటే?

FOLLOW US: 
 
సినిమా రివ్యూ : ప్రే (ఓటీటీ)
రేటింగ్ : 3/5
నటీనటులు : యాంబర్ మిడ్‌థండర్, డకోటా బీవర్స్ తదితరులు
సినిమాటోగ్రఫీ : జెఫ్ కటర్
సంగీతం: సారా షానర్
నిర్మాతలు : జాన్ డేవిస్, జేన్ మేయర్స్, మార్టీ పి.ఎవింగ్
దర్శకత్వం : డాన్ ట్రాచ్‌టెన్‌బర్గ్
విడుదల తేదీ: అక్టోబర్ 7, 2022
ఓటీటీ ప్లాట్‌ఫాం: డిస్నీప్లస్ హాట్‌స్టార్

హాలీవుడ్‌లో ఏలియన్లకు సంబంధించిన సినిమాలు చూసేవారికి ఏలియన్, ప్రిడేటర్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రియేచర్ (ఏదైనా వింత జీవి) బేస్డ్ సినిమాల్లో ఇవి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశాయి. ఈ సిరీస్‌లో లేటెస్ట్‌గా వచ్చిన సినిమా ‘ప్రే (Prey)’. ఈ సినిమా శుక్రవారం నేరుగా డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో విడుదల అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? టైం వేస్టా? టైం పాసా?

కథ (Prey Movie Plot): 1719లో జరిగే కథ ఇది. అంటే ఇప్పటివరకు ముందు వచ్చిన ఏలియన్, ప్రిడేటర్ సిరీస్ సినిమాలకు ప్రీక్వెల్ అన్నమాట. నార్త్ అమెరికాలోని గ్రేట్ ఫ్లాట్ ల్యాండ్స్‌లోని తెగల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఒక ప్రిడేటర్ స్థానికంగా ఉండే జంతువులను, తెగల మనుషులను చంపుతుంది. అక్కడి తెగలోని మనుషులంతా అది అడవి జంతువుల పని అనుకుంటారు. కానీ నరు (ఆంబర్ మిడ్‌థండర్) మాత్రం ఇదేదో వింత జీవి పని అని చెబుతుంది. కానీ వారెవరూ నమ్మరు. దీంతో ఈ విషయాన్ని నిరూపించడానికి నరు ఒంటరిగా బయలుదేరుతుంది. చివరికి ఏం అయింది? ఎంతో బలమైన ప్రిడేటర్‌ని నరు ఒంటరిగా ఎదిరించిందా? ఈ విషయాలు తెలియాలంటే ‘ప్రే’పై ఒక లుక్కేయాల్సిందే.

విశ్లేషణ: ఒక క్రియేచర్ బేస్ట్ సినిమా తీయడం కత్తి మీద సాము లాంటిది. కథ, కథనాలతో పాటు గ్రాఫిక్స్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండేలా చూసుకోవాలి. ఒక సినిమాను నేరుగా ఓటీటీకి తీస్తున్నామంటే బడ్జెట్ విషయంలో హాలీవుడ్ స్టూడియోలు చాలా కచ్చితంగా వ్యవహరిస్తాయి. క్వాలిటీ కూడా థియేటర్ సినిమాలకు ఒకలా, ఓటీటీ సినిమాలకు ఒకలా ఉంటుంది. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి స్టూడియోలకు వీటి నుంచి మినహాయింపు ఇవ్వవచ్చు. ‘ప్రే’లో వింత జీవిని ప్రత్యేకంగా గ్రాఫిక్స్ ద్వారా క్రియేట్ చేయకుండా ఒక మనిషికి మేకప్ వేయడం దగ్గర బడ్జెట్ చాలా సేవ్ అయింది. గ్రాఫిక్స్ ఏ దశలోనూ కంప్లయింట్ చేసేలా ఉండకపోవడం పెద్ద ప్లస్ పాయింట్.

News Reels

అలాగే సినిమా రన్ టైం కూడా కేవలం ఒక గంటా 39 నిమిషాలు మాత్రమే. దీంతో స్క్రీన్‌ప్లేనే మరింత టైట్‌గా రాసుకున్నారు. ప్రిడేటర్ లాంటి బలమైన ఏలియన్‌కి ఒక యువతి ఒంటరిగా ఎలా ఎదురువెళ్లిందనే అంశాన్ని ఎంతో ఆసక్తికరంగా చూపించారు. ప్రిడేటర్‌ను ఎదుర్కోవడానికి నరు అడవిలోకి వెళ్లినప్పటి నుంచి సినిమా మరింత వేగంగా సాగుతుంది. ప్రిడేటర్‌ను నరు తెలివితో ఎదుర్కునే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

టెక్నికల్‌గా కూడా ఈ సినిమా అద్భుతంగా ఉంది. దర్శకుడు డాన్ ట్రాచ్‌టెన్‌బర్గ్ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. జెఫ్ కట్టర్ కెమెరా వర్క్ మనల్ని ఆ కాలానికి తీసుకెళ్తుంది. సారా షానర్ మ్యూజిక్ సినిమా మూడ్‌కు తగ్గట్లు ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

Also Read : 'గాడ్ ఫాదర్' రివ్యూ : మెగాస్టార్ మూవీ హిట్టా? చిరంజీవి రాజకీయ నేపథ్య చిత్రమ్ ఎలా ఉందంటే?

ఇక నటీనటుల విషయానికి వస్తే... నరు పాత్రలో నటించిన ఆంబర్ మిడ్‌థండర్ అందులో ఒదిగిపోయింది. ప్రిడేటర్‌గా కనిపించిన డకోటా బీవర్స్... పాత్రకు కావాల్సిన బాడీ లాంగ్వేజ్‌ను దించేశారు. మిగతా పాత్రధారులందరూ వారి పాత్రలకు న్యాయం చేశారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... ఈ వీకెండ్‌లో ఇంట్లో కూర్చుని మంచి థ్రిల్లింగ్ సినిమా చూడాలంటే ‘ప్రే’ మీకు మంచి ఆప్షన్. డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో ఇంగ్లిష్, హిందీ లాంగ్వేజెస్‌లో ఈ సినిమాను స్ట్రీమ్ చేయవచ్చు.

Also Read : 'స్వాతి ముత్యం' రివ్యూ : మండపంలో పెళ్లి ఆగితే అంత వినోదమా? బెల్లంకొండ గణేష్ సినిమా ఎలా ఉందంటే?

Published at : 07 Oct 2022 08:26 PM (IST) Tags: ABPDesamReview Prey Movie Prey Prey Movie Review Prey Movie Review in Telugu Prey Review Amber Midthunder Prey Movie Rating

సంబంధిత కథనాలు

Mounika Reddy Marriage:పెళ్లి పీటలెక్కుతున్న యూట్యూబ్ స్టార్ మౌనిక రెడ్డి, వరుడు ఎవరంటే..

Mounika Reddy Marriage:పెళ్లి పీటలెక్కుతున్న యూట్యూబ్ స్టార్ మౌనిక రెడ్డి, వరుడు ఎవరంటే..

Malaika Arora: అర్బాజ్‌తో అందుకే విడిపోయా - అర్జున్‌తో రిలేషన్ ట్రోల్స్ పట్టించుకోను: మలైకా అరోరా

Malaika Arora: అర్బాజ్‌తో అందుకే విడిపోయా - అర్జున్‌తో రిలేషన్ ట్రోల్స్ పట్టించుకోను: మలైకా అరోరా

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

Jagamemaya Trailer: ‘జగమే మాయ’ ట్రైలర్ - వామ్మో, ఈ అమ్మాయ్ చాలా ‘చిత్ర’మైనది!

Mirzapur season 3: ‘మీర్జాపూర్’ సీజన్ 3 అప్‌డేట్ - ఎమోషనల్ పోస్టుతో గుడ్డూ భయ్యా గుడ్ న్యూస్!

Mirzapur season 3: ‘మీర్జాపూర్’ సీజన్ 3 అప్‌డేట్ - ఎమోషనల్ పోస్టుతో గుడ్డూ భయ్యా గుడ్ న్యూస్!

Yashoda Movie OTT Release : సమంత 'యశోద' - ఈ వారమే ఓటీటీలోకి

Yashoda Movie OTT Release : సమంత 'యశోద' - ఈ వారమే ఓటీటీలోకి

టాప్ స్టోరీస్

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Jagan Review : వైఎస్ఆర్‌సీపీలోనూ వాలంటీర్ తరహా వ్యవస్థ - ప్రతి యాభై ఇళ్లకు ఓ నేతను పెట్టాలని జగన్ నిర్ణయం !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Sharmila On Sajjala : తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతీయవద్దు - సజ్జలకు షర్మిల స్ట్రాంగ్ వార్నింగ్ !

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Connect Movie Trailer: డిఫరెంట్ హర్రర్ థ్రిల్‌ ఇచ్చే నయనతార ‘కనెక్ట్’ - ట్రైలర్ వచ్చేసింది - భయపడటం మాత్రం పక్కా!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!

Pawan Kalyan: ఇంకో రీమేకా? మాకొద్దు బాబోయ్ - ట్విట్టర్‌లో పవన్ ఫ్యాన్స్ రచ్చ!