అన్వేషించండి

Entertainment Top Stories Today: ‘దేవర’ ఫస్ట్ డే కలెక్షన్స్, ‘సత్యం సుందరం’ రివ్యూ - నేటి టాప్ సినీ విశేషాలివే!

Entertainment News Today In Telugu: ‘దేవర’ ఫస్ట్ డే కలెక్షన్స్ నుంచి ‘సత్యం సుందరం’ రివ్యూ వరకు... ఇవాళ్టి టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్.

కార్తీ హీరోగా నటించిన ‘సత్యం సుందరం’ సినిమా శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐఫా అవార్డులు శుక్రవారం ప్రారంభం అయి ఘనంగా జరుగుతున్నాయి. ‘దేవర’ మొదటి రోజు రూ.172 కోట్లు వసూలు చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు. ఆదిపురుష్ వివాదంపై సైఫ్ అలీ ఖాన్ మొదటిసారి మాట్లాడారు. ‘పుష్ప 2’ షూటింగ్‌లో ఫహాద్ ఫాజిల్ జాయిన్ అయ్యారు.

'సత్యం సుందరం' రివ్యూ
తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన తమిళ కథానాయకుడు కార్తీ. ఆయన హీరోగా నటించిన తాజా తమిళ సినిమా 'మెయ్యళగన్' (Meiyazhagan). తమిళనాట నేడు (సెప్టెంబర్ 27న) విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లో శనివారం (సెప్టెంబర్ 28వ తేదీన) 'సత్యం సుందరం' విడుదల అవుతోంది. '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరవింద్ స్వామి ప్రధాన పాత్రధారి. ఈ చిత్రాన్ని కార్తీ అన్న, వదిన సూర్య, జ్యోతిక నిర్మించారు. (ఈ సినిమా రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

బాక్సాఫీస్ బరిలో 'దేవర' జాతర
బాక్సాఫీస్ బరిలో 'దేవర' భారీ నంబర్స్ నమోదు చేసింది. మొదటి రోజు ఈ సినిమా వంద కోట్ల మార్క్ చేరుకోవడం కేక్ వాక్ అని అడ్వాన్స్డ్ బుకింగ్స్ చూస్తే అర్థం అయ్యింది. అది నిజమేనని తెలిసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆరేళ్ల తర్వాత 'దేవర'తో సోలో హీరోగా థియేటర్లలోకి వచ్చారు. దీనికి మొదటి రోజు భారీ ఓపెనింగ్ లభించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఐఫా 2024 విన్నర్స్ లిస్ట్
అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ (IIFA) అవార్డ్స్ 24వ ఎడిషన్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వంటి దక్షిణాది చలనచిత్ర పరిశ్రమల నుంచి పలువు స్టార్స్ అవార్డులు అందుకోబోతున్న ఐఫా ఉత్సవం మూడు రోజుల పాటు కన్నుల పండుగగా జరగబోతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

‘ఆదిపురుష్‘, ‘తాండవ్‘ వివాదాలపై సైఫ్ షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన కెరీర్ లో తీవ్ర వివాదానికి కారణమైన ‘ఆది పురుష్‘ సినిమాతో పాటు ‘తాండవ్‘ వెబ్ సిరీస్ పై తొలిసారి మౌనం వీడారు. ‘దేవర‘ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ఆయన, పలు కీలక విషయాలు వెల్లడించారు. ‘ఆదిపురుష్‘, ‘తాండవ్‘ విషయంలో తనను టార్గెట్ చేయడం చాలా మానసిక ఆవేదనకు గురి చేసినట్లు వెల్లడించారు. ఒక నటుడు తెర మీద చెప్పే విషయానికి బాధ్యత తీసుకోవాలని కోర్టు చెప్పడం ఎంత వరకు కరెక్టె తనకు తెలియదన్నారు. కానీ, నచ్చింది చెప్పే స్వేచ్ఛ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని అర్థం అయ్యిందన్నారు. లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

షెకావత్‌ సార్ ‘పుష్ప 2’ సెట్‌లోకి వచ్చేశాడు
‘పుష్ప 2’ సినిమాలో మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన పూర్తి సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం షెకావత్ సార్ బల్క్ గా డేట్లు ఇచ్చారట. ఈ షెడ్యూల్ లో ఆయన పార్ట్ మొత్తం కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. మరికొద్ది రోజుల పాటు వరుసగా అతడికి సంబంధించిన సన్నివేశాలను షూట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. నిజానికి చాలా రోజుల క్రితమే  ఫహద్ బల్క్ డేట్స్ ఇచ్చారు. కానీ మేకర్స్ వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో సినిమా కాస్త లేట్ అయ్యింది. అదే సమయంలో బన్నీ ఫారిన్ ట్రిప్ కు వెళ్లారు. కొద్ది రోజుల విరామం తర్వాత షూటింగ్ మళ్లీ ప్రారంభం అయ్యింది. శరవేగంగా మిగతా సన్నివేశాలను పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TG Sankranti Holidays: విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
విద్యార్థులకు పండగే.. సంక్రాంతి సెలవులు ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
AP Caravan Tourism: ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. ఎంచక్కా 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ఏపీలో కారవాన్ టూరిజం ప్రారంభం.. 4 మార్గాల్లో ప్రయాణం- ప్యాకేజీ, బుకింగ్ పూర్తి వివరాలు
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Kavitha: కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
కవిత కన్నీరు వెనుక భావోద్వేగ వ్యూహం - రాజకీయ పార్టీ ప్రకటనకు సరైన ప్రణాళికతోనే వెళ్తున్నారా?
Best Time to Drink Coffee : కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
కాఫీ తాగడానికి సరైన సమయం ఏమిటి? ఉదయాన్నే కాఫీ తాగడం వల్ల ప్రయోజనం ఉందా?
OPINION | The AQI Illusion: కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
కాలుష్యంపై పోరాటంలో ఓడిపోతున్న భారత్ - ప్రధాన కారణం డేటా మిస్సింగ్ !
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Embed widget