Devara Day 1 Collection: బాక్సాఫీస్ బరిలో 'దేవర' జాతర... మొదటి రోజు వరల్డ్ వైడ్ ఎన్ని కోట్ల కలెక్షన్ వచ్చిందంటే?
Devara Box Office Collection Day 1: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ 'దేవర'తో భారీ ఓపెనింగ్ సాధించారు. ఈ సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్ వచ్చిందో తెలుసా?
బాక్సాఫీస్ బరిలో 'దేవర' (Devara) భారీ నంబర్స్ నమోదు చేసింది. మొదటి రోజు ఈ సినిమా వంద కోట్ల మార్క్ చేరుకోవడం కేక్ వాక్ అని అడ్వాన్స్డ్ బుకింగ్స్ చూస్తే అర్థం అయ్యింది. అది నిజమేనని తెలిసింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ఆరేళ్ల తర్వాత 'దేవర'తో సోలో హీరోగా థియేటర్లలోకి వచ్చారు. దీనికి మొదటి రోజు భారీ ఓపెనింగ్ లభించింది.
తెలుగులో దుమ్ము దులిపిన 'దేవర'
Devara First Day Collection: ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 'దేవర' దుమ్ము దులిపింది. ఆల్మోస్ట్ 70 కోట్ల రూపాయల నెట్ కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాల టాక్. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 68.6 కోట్లు వచ్చాయట. కొన్ని ఏరియాల్లో హైర్స్ ఉన్నాయి. కానీ, వాటిని ఈ సినిమా కలెక్షన్లలో కలపలేదని సమాచారం.
ఫస్ట్ డే హయ్యస్ట్ షేర్ కలెక్షన్ చేసిన సినిమాల్లో తెలుగు రాష్ట్రాల్లో 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' తర్వాత స్థానంలో 'దేవర' నిలిచింది.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో 'దేవర'కు ఫస్ట్ డే ఏ ఏరియాలో ఎన్ని కోట్ల షేర్ వచ్చిందో తెలుసా?
హిందీలో 'దేవర' కలెక్షన్ ఎలా ఉంది?...
తెలుగు రాష్ట్రాల బయట పరిస్థితి ఏంటి?
'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా కావడంతో నార్త్ ఇండియాలోనూ 'దేవర'కు మంచి బజ్ నెలకొంది. అడ్వాన్స్డ్ బుకింగ్స్ ట్రెండ్ అక్కడ నిదానంగా మొదలైనప్పటికీ హిందీ క్రిటిక్స్ నుంచి మంచి టాక్ రావడంతో మ్యాటీ షోస్ నుంచి మంచి నంబర్స్ నమోదు చేసింది.
మొదటి రోజు 'దేవర'కు నార్త్ ఇండియా మార్కెట్ నుంచి రూ. 7 కోట్ల నెట్ కలెక్షన్ వచ్చిందని తెలిసింది. తెలుగు రాష్ట్రాలు కాకుండా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో 'దేవర'కు డీసెంట్ నంబర్స్ వచ్చాయి. కర్ణాటకలో రూ. 30 లక్షలు, కేరళలో రూ. 30 లక్షలు, తమిళనాడులో 80 లక్షలు వచ్చాయట. ఇండియా వైడ్ నెట్ చూస్తే... రూ. 77 కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఓవర్సీస్‌లో 'దేవర' ముగింట రికార్డులు ఎంత?
Devara USA First Day Collection: 'దేవర' ఓవర్సీస్ కలెక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అడ్వాన్స్డ్ సేల్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి జోరు చూపిస్తూ వస్తోంది. నార్త్ అమెరికా, ఓవర్సీస్ నుంచి సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. ఎలా లేదన్నా రూ. 35 కోట్ల కంటే ఎక్కువ నెట్ కలెక్షన్ వచ్చినట్టు తెలుస్తోంది. మొత్తం మీద 'దేవర' ఫస్ట్ డే సెంచరీ దాటింది. ఆల్ ఓవర్‌గా రూ. 140 కోట్లు కలెక్షన్ రాబట్టినట్టు తెలుస్తోంది. పలు ఏరియాల్లో ఆల్ టైం హయ్యస్ట్ రికార్డుల్లో రెండో స్థానంలో నిలిచింది. నాన్ 'ఆర్ఆర్ఆర్' రికార్డ్స్ క్రియేట్ చేసినట్టు తెలుస్తోంది.
Box-office Tsunami Everywhere 🌊🌊🌊 #Devara North America Gross crosses $3.5 Million+ mark & counting! 🔥🔥 #DevaraUSA release by @Hamsinient & @PrathyangiraUS
— Hamsini Entertainment (@Hamsinient) September 27, 2024
Man of Masses @tarak9999 #KoratalaSiva @YuvasudhaArts @NTRArtsOfficial @DevaraMovie pic.twitter.com/wVI1Cei8BP