Saif Ali Khan: అటువంటి వాటికి దూరంగా ఉంటే మంచిది... ‘ఆదిపురుష్‘, ‘తాండవ్‘ వివాదాలపై సైఫ్ షాకింగ్ కామెంట్స్
Adipurush Controversy: తన కెరీర్ లో తీవ్ర వివాదానికి కారణమైన ‘ఆదిపురుష్‘, ‘తాండవ్‘పై నటుడు సైఫ్ అలీ ఖాన్ తొలిసారి స్పందించారు. ఈ వివాదాలు తనకు తీవ్ర అశాంతిని కలిగించాయన్నారు.

Saif Ali Khan About Adipurush Controversy: బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ తన కెరీర్ లో తీవ్ర వివాదానికి కారణమైన ‘ఆది పురుష్‘ సినిమాతో పాటు ‘తాండవ్‘ వెబ్ సిరీస్ పై తొలిసారి మౌనం వీడారు. ‘దేవర‘ సినిమా ప్రమోషన్ లో పాల్గొన్న ఆయన, పలు కీలక విషయాలు వెల్లడించారు. ‘ఆదిపురుష్‘, ‘తాండవ్‘ విషయంలో తనను టార్గెట్ చేయడం చాలా మానసిక ఆవేదనకు గురి చేసినట్లు వెల్లడించారు. ఒక నటుడు తెర మీద చెప్పే విషయానికి బాధ్యత తీసుకోవాలని కోర్టు చెప్పడం ఎంత వరకు కరెక్టె తనకు తెలియదన్నారు. కానీ, నచ్చింది చెప్పే స్వేచ్ఛ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని అర్థం అయ్యిందన్నారు. లేకపోతే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు.
దర్శకులు చెప్పింది చేయడమే మా పని- సైఫ్ అలీ
ఒక నటుడిగా తాను అన్ని రకాల సినిమాలు చేసేందుకు ఇష్టపడుతానని సైఫ్ అలీ ఖాన్ చెప్పారు. “ఒక నటుడిగా నేను అన్ని రకాల సినిమాలు చేయాలి అనుకుంటాను. ఒక్కోసారి కొత్తగా ప్రయత్నించే సమయంలో ఫెయిల్యూర్స్ రావచ్చు. వైఫల్యాలు వచ్చినప్పుడే మనిషిలో మరింత కసి పెరుగుతుంది. ఇంకా బాగా ప్రయత్నించాలనే తపన ఉంటుంది. ‘ఆది పురుష్’, ‘తాండవ్‘ గురించి చాలా విమర్శలు వచ్చాయి. ఏదైనా ప్రయత్నించేటప్పుడు వైఫల్యాలు రావచ్చు. అంతమాత్రాని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ప్రయత్నాన్ని అభినందిస్తే చాలు. కానీ, దురదృష్టవశాత్తు విమర్శలు చేయడం బాధ కలిగించింది. నటీనటులు మతానికి దూరంగా ఉండాలి. నటుడికి మతాన్ని ఆపాదించి విమర్శలు చేయకూడదు” అని చెప్పుకొచ్చారు.
‘ఆదిపురుష్’, ‘తాండవ్’పై తీవ్ర విమర్శలు
‘ఆదిపురుష్’, ‘తాండవ్’ విషయంలో చాలా మంది సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)ను తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన హిందూ దేవుళ్లను కించపరుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తాండవ్’లో కొన్ని కులాలను కించపరిచే సన్నివేశాలు, డైలాగ్ లు ఉన్నాయంటూ పలు హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి. మేకర్స్ పై పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. “చాలా మంది నన్ను ఒకటే ప్రశ్న అడుగుతున్నారు. మళ్లీ ఇలాంటి తప్పులే చేస్తావా? అంటున్నారు. నాకు సినిమాల అవకాశాలు రావడం నా అదృష్టం. అందుకే, నేను కులాలు, మతాలకు అతీతంగా సినిమాలు చేయాలని భావిస్తున్నాను” అని చెప్పుకొచ్చారు.
‘దేవర’లో నెగెటివ్ రోల్ పోషించిన సైఫ్ అలీ ఖాన్
జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ తెరకెక్కించిన ‘దేవర’ సినిమాలో సైఫ్ అలీ ఖాన్ నెగెటివ్ రోల్ పోషించారు. ఈ సినిమాతో సైఫ్, జాన్వీ తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది. తొలి రోజు ఈ సినిమా ఏకంగా రూ. 170 కోట్లకు పైగా వసూళు చేసింది.
Read Also: ఐఫా 2024... చిరు, బాలయ్య నుంచి మృణాల్, ప్రగ్య వరకు - టాలీవుడ్ అంతా దుబాయ్‌లో వాలిందిగా
Read Also: బాలయ్య అలాంటి వారు కాదు... నటసింహంపై హాట్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

