Urvashi Rautela: బాలయ్య అలాంటి వారు కాదు... నటసింహంపై హాట్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Urvashi Rautela: బాలయ్యపై బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆయన గురించి బయట జరుగుతున్న నెగెటివ్ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఆయన చాలా ప్రొఫెషనల్ గా ఉంటారని చెప్పింది.
Urvashi Rautela About Balakrishna: గాడ్ ఆఫ్ మాసెస్, టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఆయనంటే ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. బాలయ్య ఎక్కడ కనిపించినా ‘జై బాలయ్య’ అనే నినాదాలు మార్మోగుతాయి. నటుడిగా ఆయన ఎంతో మంది అభిమానులు ఉన్నా, కొన్నిసార్లు ఆయన వ్యవహరించే తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. అభిమానులను కొట్టడం, మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం గతంలో పెద్ద దుమారం రేపాయి. రాధికా ఆప్టే లాంటి కొంత మంది హీరోయిన్లు కూడా ఆయన గురించి నెగెటివ్ కామెంట్స్ చేయడం సంచలనం కలిగింది. ఈ నేపథ్యంలో ఐటెమ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా బాలయ్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
బాలయ్య గురించి నెగెటివ్ కామెంట్స్ విన్నా, కానీ- ఊర్వశి రౌతేలా
ప్రస్తుతం బాలయ్యతో ఊర్వశి రౌతేలా కలిసి సినిమా చేస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న బాలయ్య 109వ చిత్రంలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఓ జాతీయ ఛానెల్ తో మాట్లాడిన ఆమె బాలయ్య గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. బయట ఆయన గురించి విన్న నెగెటివ్ కామెంట్స్ లో ఎలాంటి వాస్తవం లేదని చెప్పుకొచ్చింది. నేషనల్ మీడియా ఎన్డీటీవీతో మాట్లాడుతూ “బాలయ్య గురించి నేను కొన్ని నెగెటివ్ కామెంట్స్ విన్నాను. నిజమేనేమో అనుకున్నాను. కానీ, ఆయనను కలిశాక, అతడితో వర్క్ చేశాక అవన్నీ అవాస్తవం అని తెలుసుకున్నాను. ఆయన తోటి నటుల పట్ల చాలా గౌరవంగా, మంచిగా ఉంటారు. ఆయనతో నటించేటప్పుడు నేను ఎలాంటి ఇబ్బంది పడలేదు. నాతో చాలా గౌరవంగా వ్యవహరించారు. సెట్స్ లో ఆయన చాలా ప్రొఫెషనల్ గా ఉంటారు. ప్రతి మనిషిలో కొన్ని నెగెటివ్ అంశాలు ఉంటాయి. కానీ, ఎదుటి వారితో ఎలా ఉంటున్నారు అనేది గమనించాలి. ఆయన గొప్ప నటుడే కాదు, మంచి మనిషి కూడా. తనతో కలిసి నటించడం పట్ల నేను చాలా సంతోషంగా ఫీలవుతున్నాను” అని ఊర్వశి రౌతేలా ప్రశంసల వర్షం కురిపించింది.
నా పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది- ఊర్వశి రౌతేలా
ఇక బాలయ్య, బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో తన క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని ఊర్వశి రౌతేలా వెల్లడించింది. “ బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నేను కీలకపాత్ర పోషిస్తున్నాను. ఈ సినిమా కథ చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. ఇందులో నా పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. తెలుగు సినిమా పరిశ్రమ నాకు చాలా బాగా నచ్చింది. ఇక్కడ మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది.
ఊర్వశి రౌతేలా NBK109తో పాటు పలు సినిమాల్లో నటిస్తోంది. బాలీవుడ్ లోఅహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ‘బాప్’లో కీలక పాత్ర పోషిస్తోంది. ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ తో పాటు ‘కసూర్ 2’లోనూ కనిపించనుంది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లో సినిమాలు చేస్తున్నది ఊర్వశి రౌతేలా.
Read Also: ఐఫా 2024... చిరు, బాలయ్య నుంచి మృణాల్, ప్రగ్య వరకు - టాలీవుడ్ అంతా దుబాయ్‌లో వాలిందిగా