Ennenno Janmalabandham November 17th: ఊహించని ట్విస్ట్, వేద కేసులో ఒడిపోవాలంటున్న యష్- యాక్సిడెంట్ చేసింది మాళవిక కాదా?
యాక్సిడెంట్ గురించి అసలు నిజం వేదకి తెలియడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
సులోచన నిద్రలో తనకి జరిగిన యాక్సిడెంట్ గుర్తు చేసుకుని భయపడుతుంది. గట్టిగా అరుస్తూ మంచం మీద నుంచి కింద పడిపోతుంది. గమనించిన చిత్ర, శర్మ వెంటనే తనని పైకి లేపి మంచం మీద పడుకోబెడతారు. వేద వాళ్ళు కంగారుగా వస్తారు. ఈ మధ్య నీ గురించే ఆలోచించి టెన్షన్ పడుతుందని శర్మ బాధగా చెప్తాడు. నేను బాగానే ఉన్నాను అని వేద ఏడుస్తూ చెప్తుంది. ఎందుకు టెన్షన్ మా కోడలికి ఇంట్లో ఏ కొరత రానివ్వను అని మాలిని, రత్నం కూడా ధైర్యం చెప్పేందుకు చూస్తారు. డాక్టర్ వచ్చి సులోచనని చెక్ చేస్తుంది. యాక్సిడెంట్ షాక్ నుంచి ఆమె ఇంకా కోలుకోలేదని, ఆమెని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతుంది.
తల్లి పరిస్థితి గురించి తలుచుకుని వేద చాలా బాధపడుతుంది. యాక్సిడెంట్ చేసిన మాళవికని వదిలిపెట్టె ప్రసక్తే లేదని ఎంత పెద్ద శిక్ష అయినా పడేలా చేస్తాను అని వేద అనుకుంటుంది. అటు మాళవిక వేదకి నిజం తెలిసిపోయిందని టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడ సిచ్యుయేషన్ ఎలా ఉందో అని యష్ కి ఫోన్ చేస్తుంది కానీ లిఫ్ట్ చెయ్యడు. అప్పుడే అభి, ఖైలాష్ వచ్చి ఏంటి టెన్షన్ పడుతున్నావ్ అని అడుగుతాడు. నువ్వేమి టెన్షన్ పడకు నేను ఉన్నాను అని అభి అంటే ‘నా ధైర్యం నా కొడుకు అభి, వాడంటే యశోధర్ కి పంచ ప్రాణాలు, నాకోసం కావాలంటే ఆ యశోధర్ వేదతో ఫైట్ కూడా చేస్తాడు. పిల్లల్ని అడ్డుపెట్టుకుని వేదని ఒడిస్తాను. వేద,యశోధర్ బంధాన్ని విడగొడతాను’ అని మాళవిక అభి వాళ్ళకి తన ప్లాన్ చెప్తుంది.
Also Read: రంగంలోకి దిగిన వేద, ఇక మాళవికకి చుక్కలే- క్షమించమని అడిగిన యష్
వేద ఏడుస్తూ ఉంటే మాలిని వచ్చి తనని పలకరిస్తుంది. దీనికంతటికి కారణం ఆ యాక్సిడెంట్ చేసిన మనిషి, అతను ఎవరో వెతికి పట్టుకుని జైల్లో పెట్టించాలి. కేసు స్ట్రాంగ్ చెయ్యి, ఎవరు అడ్డం వచ్చినా కనికరం చూపించకు అని మాలిని వేదతో చెప్పడం యష్ కూడా వింటాడు. ఆయనకి వ్యతిరేకంగా వెళ్లాల్సి వస్తుంది తప్పడం లేదని వేద ఫిక్స్ అవుతుంది. లాయర్ ఝాన్సీ (కరుణ) ఎంట్రీ ఇస్తుంది. తనని ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తుంది వేద. కేసు గురించిన్ వివరాలు మొత్తం వేద లాయర్ కి వివరిస్తుంది. అమ్మకి యాక్సిడెంట్ చేసిన వ్యక్తి జైలుకి వెళ్ళి తీరాల్సిందే, తప్పించుకోవడానికి వీల్లేదని వేద లాయర్ కి చెప్తుంది. అది విని యష్ షాక్ అవుతాడు.
ఆ మాళవిక తరఫున వాదిస్తున్న వ్యక్తి చాలా ఫేమస్, సాక్ష్యాలు కూడా తారుమారు చేసినట్లు తెలిసిందని ఝాన్సీ చెప్తుంది. ఈ కేసులో అవతలి వాళ్ళ తరఫున మీ హజ్బెండ్ ఫైట్ చేస్తున్నారు, ఒకరకంగా తనకి వ్యతిరేకంగా ముందుకు వెళ్తున్నారు, దానికి మీరు సిద్ధమేనా, ఈ కేసు వల్ల మీ భార్యాభర్తల మధ్య ఫైట్ జరగబోతుంది ఆలోచించుకుని చెప్పమని లాయర్ ఝాన్సీ వేదని అడుగుతుంది. నేను భర్తకి వ్యతిరేకంగా పోరాడటం లేదు న్యాయం కోసం పోరాడుతున్నా అని వేద ఖరాఖండీగా చెప్తుంది. యష్ కంగారుగా తన లాయర్ కి ఫోన్ చేస్తాడు. వేద కొత్త లాయర్ ని పిలిచి యాక్సిడెంట్ కేసు అప్పగించిందని చెప్తాడు. తన ముందు నిలబడలేరని పరమేశ్వరన్ యష్ తో అంటాడు. కొత్త లాయర్ ఎవరు అని ఆడగ్గానే లాయర్ ఝాన్సీ అని యష్ చెప్పడంతో అతను షాక్ అవుతాడు.
Also Read: వసు ముందు తడబడిన గౌతమ్, దేవయానిని నిలదీసిన ఫణీంద్ర, రిషి ఏం చేయబోతున్నాడు!
ఈ కేసు చాలా సీరియస్ అవుతుంది, వేద చాలా స్ట్రాంగ్ గా శిక్ష పడాలని చూస్తుంది, ఎలాగైనా మీరే మాళవికని గట్టేక్కించాలి అని యష్ లాయర్ ని అడగటం మాలిని విని షాక్ అవుతుంది. వేద ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లో గెలవకూడదు, మాళవికకి శిక్ష పడకూడదు అని యష్ అంటాడు.
తరువాయి భాగంలో..
మాళవిక యష్ తో మాట్లాడటానికి వస్తుంది. అసలు ఈ యాక్సిడెంట్ చేసింది నువ్వు కాదు ఆదిత్య ఆ విషయం నాకు తెలియదని అనుకుంటున్నావా అని యష్ కోపంగా అంటాడు. అప్పుడే వేదని చూపించారు. వేద ఆ మాటలు విన్నదో లేదో రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది.