Ennenno Janmalabandham March 2nd: గూగుల్ లో వెతికి మరీ వేదకి ముద్దుపెట్టేసిన యష్- చిత్ర ప్లాన్ ఫెయిల్ చేసిన్ అభిమన్యు
యష్, వేద మధ్య విన్నీ రావడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
యష్ వేద కోసం ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకొస్తాడు. కానీ వేద మాత్రం వద్దని అంటుంది. అప్పుడే విన్నీ స్పైసీ నూడుల్స్ తీసుకొచ్చి ఇచ్చేసరికి ఎంజాయ్ చేస్తూ తింటుంది. బెస్ట్ హజ్బెండ్ కానివ్వకుండా విన్నీ కుట్ర పన్నుతున్నాడు వీడి సంగతి చెప్తానని యష్ మనసులో తిట్టుకుంటాడు. అభిమన్యు చిత్రని తన క్యాబిన్ కి పిలిచి ఫైల్ లో ఏదో తప్పులు ఉన్నాయని చెప్పి కవర్ చేసి తన మొబైల్ పగలగొట్టేస్తాడు. పల్లవి మాటలు రికార్డ్ చేయడం ఈ నీచుడు గుర్తుపట్టేశాడని చిత్ర అర్థం చేసుకుంటుంది. ఎన్ని చేసినా చిత్ర లొంగడం లేదని అనుకుని వసంత్ నుంచి విడగొట్టేందుకు స్కెచ్ వేస్తాడు.
యష్ బెస్ట్ హజ్బెండ్ అనిపించుకోవడం ఎలా అని తెగ ఆలోచిస్తూ ఉంటాడు. ఫోన్ తీసి గూగుల్ లో గుడ్ హజ్బెండ్ అవాలంటే ఏం చేయాలని వెతికేస్తాడు. అది చదువుతూ ఉంటాడు, అందులో మంచి భర్త అనిపించుకోవాలంటే తనని ప్రేమగా కిస్ చేయాలని రాసి ఉంటుంది. భార్యకి ముద్దు పెడితే బెస్ట్ హజ్బెండ్ అయిపోతాడా అని యష్ అనుకుని ముద్దు పెట్టడానికి గదికి వచ్చేస్తాడు. అప్పుడు బెడ్ మీద దుప్పటి కప్పి ఉండేసరికి వేద పడుకుందని అనుకుని మెల్లగా వెళతాడు. మధ్య మధ్యలో యష్ తనని తాను తెగ పొగిడేసుకుంటాడు. ఎవరు చూడటం లేదు కదా అని వెళ్ళి దుప్పటి తీసేసరికి దిండు ఉంటుంది, వేద ఏమైందని అనుకుంటూ ఉండగా బాత్ రూమ్ నుంచి సౌండ్ వస్తుంది. వేద వాష్ రూమ్ నుంచి బయటకి రాగానే గబుక్కున పట్టుకుని కిస్ పెట్టేయాలని అనుకుంటాడు.
Also Read: నగలతో స్వప్న జంప్, కనకం షాక్- రాజ్ పెళ్లి కావ్యతోనే జరుగుతుందా?
నర్స్ వాష్ రూమ్ లో నుంచి రాగానే ఎవరు వస్తున్నారో కూడా చూసుకోకుండా ముద్దు పెట్టేస్తాడు. యష్ ముద్దు పెట్టేసారికి నర్స్ బిత్తరపోతుంది. తనని చూసి యష్ కూడా షాక్ అవుతాడు. సిస్టర్ మా మిసెస్ అనుకుని యష్ చెప్పబోతుంటే నర్స్ గోల గోల చేస్తుంది. యష్ చెప్పేది వినిపించకుండా అరుస్తూనే ఉంటుంది. అప్పుడే వేద, విన్నీ వచ్చేస్తారు. ఏం చేయాలో తెలియక బిక్క మొహం వేస్తాడు. సిస్టర్ అరుస్తున్నారు గొడవ ఏంటని వేద అడుగుతుంది. సిస్టర్ చెప్పబోతుంటే యష్ దణ్ణం పెట్టేస్తాడు. వేద మళ్ళీ అడుగుతుంది. అంతా నీ వల్లే నువ్వు అనుకుని ఆవిడ్ని నేను అని యష్ చెప్పలేక తిప్పలు పడతాడు. నేను అనుకుని ఏం చేశారని అడుగుతుంది. మీ ఆయన నన్ను కిస్ చేశారని చెప్పేసరికీ వేద యష్ కోటు వెనుక మొహం దాచేసుకుంటాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తానని అనేసరికి యష్ సోరి చెప్తాడు. ఏదో పొరపాటున జరిగింది ఆయన తరఫున నేను సోరి చెప్తున్నా, ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి అని వేద బతిమలాడుతుంది.
మీరు బాగానే ఉన్నారా అని వేద అడుగుతుంది. యష్ ఏదేదో చెప్పి కవర్ చేయాలని చూస్తాడు కానీ వేద మాత్రం నమ్మదు. మాళవిక నైట్ లేట్ గా వచ్చేసరికి భ్రమరాంబిక అపి తనని తిడుతుంది. నీకు కాదు నాకు హక్కు ఉంది, ఆరేళ్లుగా మేం లివింగ్ టూ గెదర్ అరవకు అని మాళవిక ఎదురుతిరుగుతుంది. అభి వచ్చి ఎందుకక్కా అరుస్తున్నావ్, నువ్వు వచ్చిన దగ్గర నుంచి మా మధ్య గొడవలు పెడుతూనే ఉన్నావ్ అతిథివి అతిథిలాగా ఉండు అని అంటాడు. మాళవిక ఈ ఇంటికి యజమానురాలని అంటాడు. మాళవిక వెళ్లిపోయాక ఏంటి ఇది చెప్పింది ఏంటి చేసేది ఏంటని భ్రమరాంబిక అడుగుతుంది. నా యాక్టింగ్ నమ్మేశావా, తనతో చిరాకుగా ఉంది భరించలేకపోతున్న ఏదో ఒక ఛాయిస్ దొరికితే తనని నేనే గెంటేస్తాను అని అంటుంది. తను ఈ ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్లకూడదని అభి అనేసరికి ఈ ఇంటి నుంచి తనని ఎలా వెళ్లగొట్టాలో తనకి తెలుసని భ్రమరాంబిక చెప్తుంది.
Also Read: రాజ్యలక్ష్మి అసలు స్వరూపం బట్టబయలు, తల్లిని గుడ్డిగా నమ్ముతున్న విక్రమ్- దివ్యని ఒప్పించేపనిలో తులసి
వేద హాస్పిటల్ లో జరిగిన విషయం సులోచన వాళ్ళకి చెప్పేసరికి అందరూ పడి పడి నవ్వుతారు. అసలు ఆయన కిస్ పెట్టాలని అనుకుంది నర్స్ కి కాదు మన వేద అక్కకి అని చిత్ర అంటుంది. యష్ కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటాడు. వేద నా భార్య కదా తనని ముద్దు పెట్టుకోవడానికి ఇంతగా ఆలోచించాలని అనుకుంటాడు. తర్వాత ఖుషితో వేదని రప్పించి మరి తనకి ముద్దు పెట్టేస్తాడు.