Brahmamudi February 28th: నగలతో స్వప్న జంప్, కనకం షాక్- రాజ్ పెళ్లి కావ్యతోనే జరుగుతుందా?
దుగ్గిరాల కుటుంబానికి కోడల్ని చేయాలని కనకం ప్రయత్నాలు చేస్తోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే
నలుగు నుంచి తప్పించుకోవడం కోసం స్వప్న కళ్ళు తిరిగిపడిపోయినట్టు నటిస్తుంది. రాజ్ కి మంగలస్నానాలు ఏర్పాటు చేస్తారు. టచ్ చూస్తే కళావతిలాగా అనిపించింది కానీ పెళ్లికి డెవిల్స్ ఎందుకు వస్తాయి అని మనసులో అనుకుంటాడు. రాజ్ తల మీద నీళ్ళు పోస్తున్నప్పుడే అటు కావ్య తల మీద కూడా అనుకోకుండా నీళ్ళు పడుతూ ఉంటాయి. అంటే సింబాలిక్ గా ఇద్దరికీ మంగళ స్నానాలు అయిపోయినట్టే. అటు స్వప్న రాహుల్ ని నిలదీస్తుంది. నీకోసం పిచ్చిదానిలా ఎదురుచూస్తుంటే నువ్వేమో పక్కకి తప్పుకుంటున్నావ్, ఎందుకు దూరంగా ఉంటున్నావ్ ఏమైందని స్వప్న ఏడుస్తూ అడుగుతుంది. మనం రాజ్ ని మోసం చేస్తున్నామని అనిపిస్తుంది, నీ మీద మీ వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాజ్ మీద కుటుంబం ఎన్నో ఆశలు పెట్టుకుంది. వీళ్ళకి అన్యాయం చేసి మనం లేచిపోవడం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. అందుకే నువ్వు రాజ్ ని పెళ్లి చేసుకోవడం మంచిదని అనిపిస్తుందని రాహుల్ అంటాడు.
స్వప్న: అయితే నాకు ఖరీదైన గిఫ్ట్ లు ఎందుకు ఇచ్చావ్, ఈవెంట్ కి ఎందుకు పిలిచావ్ నా మీద ప్రేమ ఉన్నట్టు ఎందుకు నటించావ్
రాహుల్: నేను నటించలేదు నిజంగానే నిన్ను మనస్పూర్తిగానే ప్రేమించాను
Also Read: రాజ్యలక్ష్మి అసలు స్వరూపం బట్టబయలు, తల్లిని గుడ్డిగా నమ్ముతున్న విక్రమ్- దివ్యని ఒప్పించేపనిలో తులసి
స్వప్న: నేను ప్రేమించాను పెళ్లి పీటల మీద నుంచి లేచిరావడానికి సిద్ధంగా ఉన్నాను. నిన్ను ప్రేమించి రాజ్ ని ఎలా చేసుకుంటాను నువ్వు కాదని అన్నావంటే ఇక్కడే చచ్చిపోతాను అని కట్టి తీసుకుని కోసుకునేందుకు ట్రై చేస్తుంది
రాహుల్: పిచ్చి పట్టిందా నీకేమైన అయితే నేను ఏం కావాలి అని పైకి అనేసి మనసులో మాత్రం ఇందుకోసమే ఇదంతా చేశానని అంటాడు. తర్వాత ఏదో ప్లాన్ చెప్తాడు. కనకం వచ్చి చూసేసరికి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు రాహుల్ కన్నింగ్ స్మైల్ ఒకటి వేస్తాడు. రాజ్ కి కళ్యాణ తిలకం పెట్టి పెళ్లి కొడుకుగా ముస్తాబు చేస్తారు. పెళ్లి ఏర్పాట్లు చూసి కనకం నోరెళ్ళబెడుతుంది. మన కావ్య ఎంత బాగా చేసిందో అని కనకం మెచ్చుకుంటుంది. పెళ్లి మండపం కళకళాడిపోతుందని మీనాక్షి అంటుంది. కావ్య వచ్చి స్వప్నని రెడీ చేసి వెళ్లిపోతానని అంటుంది. రాజ్ కుటుంబం మండపానికి బయల్దేరబోతుంటే సుభాష్ కి కాల్ వస్తుంది. అది విని షాక్ అవుతాడు. అపర్ణ అన్న కొడుకు రాజేష్ యాక్సిడెంట్ లో చనిపోయాడని సుభాష్ చెప్పేసరికి కుమిలి కుమిలి ఏడుస్తుంది. అంతా కలిసి పెళ్లికి వస్తుంటే యాక్సిడెంట్ జరిగిందని చెప్తాడు. కన్నా కొడుకు పెళ్లి కొడుకు అయితే అన్న కొడుకు శవమైయ్యాడని బాధపడుతుంది.
Also Read: నర్స్ కి ముద్దుపెట్టేసి వేద ముందు అడ్డంగా బుక్కైన యష్- మిస్టర్ యారగెంట్ దుమ్ము దులిపిన విన్నీ
చనిపోయింది పుట్టింటి వాళ్ళు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్తేనే మంచిదని సుభాష్ వాళ్ళ నాన్న సలహా ఇస్తాడు. నువ్వు లేకుండా పెళ్లి చేసుకొను పెళ్లి వాయిదా వేద్దామని రాజ్ అంటాడు కానీ అపర్ణ వద్దని సర్ది చెప్తుంది. పీటల మీద పెళ్లి ఆగిపోతే ఆడపిల్ల మీద నిందలు వేస్తారు అది మంచిది కాదు పెళ్లి చేసుకోమని చెప్పి అపర్ణ వెళ్ళిపోతుంది. కావ్య స్వప్నని అందంగా ముస్తాబు చేస్తుంది. కళ్యాణ తిలకం పెట్టినా కూడా పెళ్లి కళ రాలేదని అప్పు ఆట పట్టిస్తుంది. తర్వాత అక్క దగ్గరకి వెళ్ళి ముద్దు పెట్టి అప్పు ఎమోషనల్ గా మాట్లాడుతుంది. ఆ మాటకి స్వప్న కూడా చెల్లెళ్ళని దగ్గరకి తీసుకుని ఏడుస్తుంది. మీ ఇద్దరినీ మళ్ళీ చూస్తానో లేదో ఇదే ఆఖరి సారి అని స్వప్న మనసులోనే బాధపడుతుంది.