అభిమన్యుకి నీలాంబరి లవ్ టెస్ట్, ఫుల్ ఫన్- యష్ ఇంట్లో సెటిలైన మాళవిక
అభిమన్యు మాళవికని ఇంట్లో నుంచి గెంటేయడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
ఆదిత్యతో కలిసి శాశ్వతంగా కలిసి ఉండాలని యష్ కోరుకుంటాడు. తను ఈ ఇంటి వారసుడి తనకి దక్కాల్సిన స్థానం దక్కెట్టు చేద్దాం. మీ ఇద్దరినీ కలిపే బాధ్యత తనదని వేద హామీ ఇస్తుంది. మాళవిక నిద్ర లేచి అభిమన్యు పెళ్లి చేసుకున్నది, తనని బయటకి గెంటేసిన విషయం గుర్తు చేసుకుంటుంది. ఇక్కడికి మమ్మల్ని ఎవరు తీసుకొచ్చారు మేము ఎక్కడ ఉన్నామని మాళవిక అనుకుని పక్కనే నిద్రపోతున్న ఆదిత్యని నిద్రలేపుతుంది. నువ్వు రాత్రి మందు తాగి పడిపోయావు ఎంత పిలిచినా లేవలేదు. అప్పుడు నేను యష్ డాడీకి ఫోన్ చేశాను. ఆయన వేద ఆంటీ వచ్చి మనల్ని ఇంటికి తీసుకొచ్చారని చెప్తాడు. గోడ మీద యష్ వేద ఫోటో చూసి రగిలిపోతుంది. సరిగా నాకు అభికీ పెళ్లి అవుతుందని అనగా చిత్రని అడ్డం పెట్టి అరెస్ట్ చేయించారు. లేదంటే ఈ పాటికి మా ఇద్దరికీ పెళ్లి జరిగి ఆనందంగా ఉండే వాళ్ళం. అరెస్ట్ అయిన అభి బలహీన క్షణంలో ఇంకొక ఆడదానికి దగ్గరై నన్ను వదిలేశాడు. నా జీవితం ఇలా అవడానికి కారణం వీళ్ళేనని తిట్టుకుంటుంది.
Also Read: కావ్యని ఆగర్భ శత్రువన్న రాజ్- రుద్రాణిని వాయించేసిన అత్తాకోడళ్ళు
వేద ఆంటీ చాలా మంచిది డాడీ నిన్ను రోడ్డు మీద వదిలేసి నన్ను తీసుకెళ్లబోతుంటే డాడీని రిక్వెస్ట్ చేసి ఇంటికి తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చాక కూడా మనల్ని బాగా చూసుకుంది. వేద ఆంటీ చాలా అంటే చాలా మంచిదని పొగుడుతాడు. నా కొడుకు ఏంటి వేదని తెగ పొగిడేస్తున్నాడు, తను చూపించే ప్రేమ వీడి మనసుని కరిగించేలా ఉంది వీడి మనసు విరిచేయాలని మాళవిక అనుకుంటుంది. వేద మంచిది కాదని తన నిజస్వరూపం తెలియక మంచిదని అనుకుంటున్నావ్, ఈ ఇంట్లో వాళ్ళ ముందు మనల్ని బాగా చూసుకుంటున్నట్టు నటిస్తుందని అబద్ధాలు చెప్తుంది. అది చూపించే ప్రేమ అంతా నటన మన బతుకులు రోడ్డున పడటానికి కారణం వేదనే. అభి మనల్ని గెంటేయాడానికి కారణం వీళ్ళేనని చెప్తుంది. నువ్వు మాత్రం మమ్మీ చెప్పిన మాట విను వేదని అసలు నమ్మకు, తను ఏం చెప్పిన మమ్మీకి చెప్పమని అంటుంది.
యష్ యోగా చేస్తూ ఉంటే నడుము పట్టేస్తుంది. వేద వచ్చి అయ్యో ఏమైందని అంటుంది. నువ్వు వచ్చేటప్పుడు ఇటు నుంచి వచ్చి నవ్వొచ్చు నిన్ను చూస్తూ ఉండేసరికి నడుము పట్టేసిందని తిప్పలు పడతాడు. వేద భర్త కళ్ళలోకి చూస్తూ మెస్మరైజ్ చేసి యష్ నడుముని సరిచేస్తుంది. ట్రీట్మెంట్ చేసినందుకు ఫీజు కావాలని అంటుంది. వెంటనే యష్ పెళ్ళాం బుగ్గ మీద ముద్దు పెట్టేస్తాడు. ఇద్దరం కలిసి బయటకి వెళ్దామని నిన్ను ఎవరూ పిలవని చోటుకి తీసుకుని వెళ్లిపోతానని అంటాడు. ఆ మాటకు వేద సంతోషంగా సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. ఖైలాష్ వచ్చి యష్ నిన్ను కొడితే చప్పగా ఉన్నావ్ ఏంటి పగ తీర్చుకోకుండా ఉన్నావాని రెచ్చగొడతాడు. అభిమన్యుకి నీలాంబరి లవ్ టేస్ట్ పెడతానని అంటుంది. ఇందులో పాస్ అయితే నా ఆస్తులన్నింటికీ హక్కుదారుడు అవుతాడని చెప్తుంది. హారతి కర్పూరం తెచ్చి నీలాంబరి అభిమన్యు చేతిలో పెడుతుంది. అది కింద పడేస్తే నా మీద నీకు ప్రేమ లేనట్టు అది ఆరిపోయే దాకా పట్టుకుంటే ప్రేమ ఉన్నట్టు అని చెప్తుంది.
Also Read: తులసిని తోసేసి మరీ కేఫ్ కాగితాలు చేజిక్కించుకున్న లాస్య- దివ్య, రాజ్యలక్ష్మి మాటల యుద్దం
అది చూసి ఇది ప్రేమ కాదు పైశాచికత్వమని ఖైలాష్ బిత్తరపోతాడు. కర్పూరం కాలిపోయేవరకు అభి చేతిలోనే ఉంచుకుంటాడు. నీ మనసులో నేను ఉన్నానని కొంత వరకు నమ్మకం వచ్చింది, ఇంకా కొన్ని టెస్ట్ లు ఉన్నాయి అవి కూడా పాస్ అయితే అప్పుడు పూర్తిగా ప్రేమ ఉందని నమ్ముతానని నీలాంబరి అమాయకంగా చెప్తుంది. మాళవిక నిద్ర లేచి బయటకి వస్తే మాలిని బాగా తిడుతుంది. తాగి రోడ్డున పడితే తీసుకొచ్చారు అందుకని ఇంట్లో ఉండిపోవడమేనా సిగ్గు లేకపోతే సరి అని గడ్డిపెడుతుంది.