Ennenno Janmalabandham June 29th: నీలాంబరి చేతిలో చావుదెబ్బ తిన్న అభిమన్యు- వేద, యష్ హనీ మూన్, ఉరి వేసుకోబోయిన మాళవిక
మాళవికని తీసుకొచ్చి వేద ఇంట్లో పెట్టుకోవడంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే..
శాంతి హోమం కోసం ఇంట్లో పూజ ఏర్పాట్లు చేస్తారు. మాళవిక తన చీర ఎలా ఉందని యష్ ని అడుగుతుంది. ఇది మన పెళ్లి రోజు నువ్వు గిఫ్ట్ గా ఇచ్చావని అంటుంది. నిన్నే మర్చిపోయాను ఇక ఇవి ఎందుకు గుర్తు ఉంటాయని గట్టిగా బదులిస్తాడు. హోమం చేస్తున్న దగ్గరకి రానని చెప్పి ఆదిత్య మొహం డల్ గా పెట్టుకుని కూర్చుంటాడు. అక్కడ వాళ్ళు నిన్ను ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు, నువ్వు ఏడుస్తావ్ నేను బాధపడతాను అందుకే అక్కడికి రానని అంటాడు. ‘ఈరోజు మనల్ని ఎవరూ ఏమి అనరని, ఈరోజు నీకు నచ్చింది చూస్తావ్. నీ కడుపు నిండిపోతుంది. ఈరోజు పూజలో మీ అమ్మానాన్న కూర్చోబోతున్నారు. అంటే నేను మీ నాన్న’ అని చెప్తుంది. ఆ మాటకి ఆదిత్య సంతోషంగా అయితే వెళ్దాం పదా అంటాడు. పిల్లలిద్దరూ హోమంలో కూర్చుంటారు. కాసేపటికి పిల్లలతో చేయించాల్సిన పూజ పూర్తయ్యింది, ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చి పూజ చేసి హోమం చుట్టు ప్రదక్షిణలు చేయాలని పంతులు చెప్తాడు.
Also Read: బయటపడిన కనకం బండారం- రాహుల్ ని పడేసేందుకు స్వప్న ప్లాన్, ఇరుక్కున్న రాజ్
యష్ పీటల మీద కూర్చుంటాడు. వేద సరిగ్గా అదే టైమ్ కి పక్కకి వెళ్లడంతో మాళవిక వెళ్ళి యష్ పక్కన పీటల మీద కూర్చుని హోమం చేస్తున్నట్టు ఊహించుకుంటుంది. తల్లిని కూడా వచ్చి కూర్చోమని అనేసరికి కాంచన మాళవికని వెళ్ళమని చెప్తుంది. వాళ్ళ తల్లివి నువ్వే కదా వెళ్ళి కూర్చో అంటుంది. కానీ యష్ మాత్రం వేదని పిలుస్తాడు. పిల్లల తల్లిదండ్రులను రమ్మన్నారు, వాళ్ళకి మాళవిక కదా తల్లి తనే కూర్చోవాలని అంటుంది. మనసున్న ఆడది ఎవరికైనా అమ్మ కావచ్చు, కానీ మనసు ముక్కలు చేసిన ఆడది ఎవరికీ భార్య కాలేదు. ఇలాంటి పవిత్ర కార్యం భార్యాభర్తలు చేయాలి. నాతో హోమం చేసే అర్హత వేదకి తప్ప ఎవరికి లేదు. ఎవరైనా అర్హత ఉందని ఫీలైతే వాళ్ళకి అర్థం అయ్యేలా చెప్పమని యష్ కఠినంగా చెప్తాడు. ఆ మాటలకి ఆదిత్య,మాళవిక బాధపడతారు. యష్, వేద కలిసి పూజ చేసిన తర్వాత హోమం చుట్టు ప్రదక్షిణలు చేస్తారు. హోమం తర్వాత ఏం కోరుకున్నారని వేద యష్ ని అడుగుతుంది. ఈ జన్మకే కాదు ఎన్ని జన్మలకైనా నువ్వే భార్యగా రావాలని కోరుకున్నానని అనేసరికి వేద సంతోషంగా ఉంటుంది.
మాళవిక కోపంగా గదిలోకి వెళ్ళి ఊరి వేసుకోబోతుంటే కాంచన వచ్చి అడ్డుపడుతుంది. ఎలాగైనా పూజలో కూర్చోబెడతాను అన్నావ్ కదా ఏం జరిగిందని ఏడుస్తుంది. మీ తమ్ముడి భార్యగా ఎలాగూ పనికిరాను, కానీ పిల్లలకి తల్లిగా కూడా పనికిరానా? నా పిల్లలు నా రక్తం పంచుకుని పుట్టారు. వాళ్ళతో పూజలో కూర్చునే అర్హత లేదా? ఏమైనా అంటే పిల్లల్ని వదిలేసి వెళ్ళినప్పుడు ఏమైంది ఈ ప్రేమ అంటున్నారు.
కాంచన: పిల్లల్ని దూరం చేసే హక్కు ఎవరికి లేదు
మాళవిక: ఇప్పుడు జరిగింది అదే కదా ఖుషితో కనీసం అమ్మ అని పిలిపించుకోలేకపోతున్నా. ఇప్పుడు హోమంలో పిల్లల్ని దూరం చేశారు. నువ్వే అన్నావ్ కదా హోమంలో కూర్చోబెడతాను అన్నావ్ కదా ఏమైంది
కాంచన: అవును కానీ హోమం చుట్టు ప్రదక్షిణలు భార్యాభర్తలు చేయాలి. కానీ నువ్వు ఇప్పుడు భార్యవి కాదు కదా. మిగతా విషయాల్లో నేనేమీ చేయలేను కానీ పిల్లలకి తల్లిగా ఈ ఇంట్లో చోటు దక్కేలా చూసే బాధ్యత నాది నన్ను నమ్ము ఇలాంటి పిచ్చి పని మళ్ళీ చేయకు
Also Read: మాళవిక బుట్టలో పడిపోయిన కాంచన- పూజలో తల్లి స్థానంలో ఎవరు కూర్చుంటారు?
చేయడానికి నేను ఏమైనా పిచ్చిదాన్నా, మిమ్మల్ని పిచ్చెక్కిస్తానని మనసులో అనుకుంటుంది. అభి వర్క్ చేసుకుంటూ ఉండగా ఖైలాష్ వస్తాడు. అక్కడ ఉన్న జ్యూస్ తాగమని అభి ఆఫర్ చేస్తాడు. గతంలో నీలాంబరి ఎలుకల మందు పెట్టిన చంపేస్తానని బెదిరించిన విషయం గుర్తు చేసుకుని బెదిరిపోతాడు. మీరిద్దరూ భార్యాభర్తలు కదా అసలు మీ మధ్య ఆ బాండింగ్ ఉందా? ముందు రొమాన్స్ మొదలుపెట్టమని ఖైలాష్ ఐడియా ఇచ్చేసరికి అభి రెచ్చిపోతానని అంటాడు. కిచెన్ లో పని చేసుకుంటున్న నీలాంబరి దగ్గరకి వెళ్ళి వెనుక నుంచి నడుము మీద చెయ్యి వేసి కౌగలించుకోబోతుంటే ఒకటి పీకుతుంది. దేనికైనా ఒక టైమ్ ఉంటుంది, ఎప్పుడుపడితే అప్పుడు చెయ్యి, కాలు వేస్తే విరగ్గొడతానని వార్నింగ్ ఇస్తుంది. యష్ సింగపూర్ వెళ్తున్నానని బట్టలు సర్దమని వేదని పిలిచి చెప్తాడు. అది విని మాలిని, సులోచన వాళ్ళు వేదని కూడా యష్ తో కలిసి వెళ్ళమంటారు.