By: Suresh Chelluboyina | Updated at : 25 Jun 2022 08:25 PM (IST)
Image Credit: HBO
‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ (Game of Thrones-GoT) టీవీ షో.. ఎంతటి ప్రజాధారణ పొందిందో మీకు తెలిసిందే. అయితే, 8 సీజన్ల తర్వాత ఈ సీరిస్‌ను ముగించడం అభిమానులకు నిరాశ గురిచేసింది. ఆ సీజన్‌కు ఊహించని ముగింపు ఇచ్చినందుకు ఇప్పటికీ అభిమానులు బాధపడుతూనే ఉన్నారు. ఎమీలియా క్లార్క్ నటించిన డ్రాగన్ క్వీన్ పాత్రను చంపేయడం ఫ్యాన్స్‌కు అస్సలు నచ్చలేదు. జోన్ స్నో.. కత్తితో పొడిచిన తర్వాత ఆమెను డ్రాగన్ తీసుకెళ్లిపోతుంది. దీంతో తప్పకుండా సీక్వెల్ ఉంటుందని అభిమానులు భావించినా, ఆ వెబ్ సీరిస్ దర్శకనిర్మాతలు ఎవరూ ఎలాంటి ప్రకటన చేయలేదు. అదే ముగింపు అని ప్రకటించారు. దీంతో దానికి ప్రీక్వెల్‌గా వస్తున్న ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ చూసైనా ఆనందిద్దామని అభిమానులు ఫిక్సవుతున్న తరుణంలో.. ‘హాలీవుడ్ రిపోర్టర్’ అనే వార్త సంస్థ వెల్లడించడంతో ఆశలు చిగురించాయి.
‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’కు ప్రీక్వెల్‌గా వస్తున్న ‘హౌస్ ఆఫ్ ది డ్రాగన్’ ఈ ఏడాది ఆగస్టు 21 నుంచి HBOలో స్ట్రీమింగ్ కానుంది. అయితే, ఇది ఇండియాలోని ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లో వస్తుందా? లేదా అనే స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ ఓటీటీలో ‘GoT’ ఎనిమిది సీజన్లు అందుబాటులో ఉన్నాయి. తొమ్మిదో సీజన్లో జోన్ స్నో పాత్రను ఆధారంగా చేసుకుని కథ ఉంటుందని తెలిసింది. తాజాగా ‘మదర్ ఆఫ్ డ్రాగన్స్’ పాత్రలో నటించిన ఎమీలియా క్లార్క్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.
ఇటీవల ఆమె BBC న్యూస్‌తో మాట్లాడుతూ.. “కిట్ హారింగ్టన్ (జోన్ స్నో) ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ సీక్వెల్ గురించి నాకు చెప్పాడు. దాని గురించి సన్నహాలు జరుగుతున్నాయని, నాకు తెలుసు. సీక్వెల్ వస్తుంది. ప్రస్తుతం ఇది కిట్ పాత్ర కోసం సృష్టిస్తున్న పాత్ర. కాబట్టి మొదటి నుంచి ఆ టీమ్‌తో ఉన్నాడు’’ అని తెలిపింది. అయితే, ఆమె పాత్ర ఉంటుందా లేదా అనే ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం తెలిస్తే.. అభిమానులు తప్పకుండా నిరాశకు గురవ్వుతారు. ‘‘ఇందులో డ్రాగన్‌ల రాణి పాత్రను పునరావృతం చేస్తారని మీరు ఆశలు పెంచుకోవద్దు. ప్రస్తుతమైతే నేను ఆ సీరిస్ పూర్తి చేశాననే అనుకుంటున్నాను’’ అని షాకిచ్చింది క్లార్క్. సీజన్ 8 ముగింపులో వైల్డ్‌లింగ్స్‌తో సమావేశానికి జోన్ స్నో.. ది వాల్ దాటి ఉత్తరం వైపు వెళ్లాడు. అక్కడి నుంచే సీజన్-9 ప్రారంభం కానుంది. అయితే, డ్రాగన్ క్వీన్ బతికి.. ఏదో ఒక సీజన్ లేదా ఎపిసోడ్‌లో తిరిగి రావచ్చని అభిమానులు ఆశించడంలో తప్పులేదు. ఎందుకంటే.. ఆమె లేని GoTలో అసంపూర్ణంగా ఉంటుంది.
Also Read: ‘ఫింగర్‌టిప్’ సీజన్ 2 రివ్యూ: ఇది మీ జీవితమే, మీ వేళ్లే మీ శత్రువులైతే ఏం జరుగుతుంది?
Also Read: 'సుడల్' రివ్యూ: శ్రియా రెడ్డి, ఐశ్వర్యా రాజేష్ నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?
Brahmaji: పెళ్లై, బాబు ఉన్న మహిళను ప్రేమ వివాహం చేసుకున్నా: బ్రహ్మాజీ
Urfi Javed: ఉర్ఫీ జావెద్‌కు లైంగిక వేధింపులు - అతడి ఫొటో, వాట్సాప్ చాట్ బయటపెట్టిన బ్యూటీ
Karthika Deepam Serial Doctor Babu Re-entry : తలకు కట్టు, ఎల్లో టీషర్టు 'కార్తీకదీపం' సెట్లోకి డాక్టర్ బాబు రీఎంట్రీ
Salman Khan: అభిమానులకు సల్మాన్ ఖాన్ గుడ్ న్యూస్, ఆ సినిమాకు మరో సీక్వెల్ - రిలీజ్ డేట్ ఇదే
Vijay Devarakonda : దర్శకత్వ శాఖలో పనిచేసిన విజయ్ దేవరకొండ - ఎవరి దగ్గరో తెలుసా?
Revanth Reddy : తెలంగాణను ఫిరాయింపుల ప్రయోగశాలగా మార్చేశారు- రేవంత్ రెడ్డి
Tummmala Nageswararao : హత్యారాజకీయాలు మంచిది కాదు, కార్యకర్తలు ఆవేశపడొద్దు - తుమ్మల
Independence Day 2022: ఆట పెంచిన ప్రేమ - భారతదేశానికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన విదేశీ ఆటగాళ్లు!
CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, అచ్యుతాపురం సెజ్ లో పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన