News
News
X

Fingertip 2 Review: ‘ఫింగర్‌టిప్’ సీజన్ 2 రివ్యూ: ఇది మీ జీవితమే, మీ వేళ్లే మీ శత్రువులైతే ఏం జరుగుతుంది?

మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది. మీ చేతి వేళ్లు చేసే పని మీదే అది ఆధారపడి ఉంది. అదెలా సాధ్యమో తెలియాలంటే ‘ఫింగర్‌టిప్’ సీజన్-2 చూడాల్సిందే.

FOLLOW US: 
Share:

వెబ్ సిరీస్ రివ్యూ: ఫింగర్‌టిప్ (సీజన్ 2)
మొత్తం ఎపిసోడ్లు: 8
రేటింగ్: 2.75/5
నటీనటులు: ప్రసన్న, అపర్ణ బాలమురళి, రెజినా కసాండ్ర, కన్న రవి, శరత్ రవి, వినోద్ కిషన్‌ తదితరులు. 
దర్శకత్వం: శివకర్ శ్రీనివాసన్
ఓటీటీ: Zee5
స్ట్రీమింగ్ డేట్: జూన్ 17

కథా నేపథ్యం: ఇంటర్నెట్.. అరచేతిలో ప్రపంచాన్ని చూపే అత్యాధునిక టెక్నాలజీ. ఇది మన జీవితాలను ఎంతగా మార్చేసిందో తెలిసిందో. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రజలపై ఎంత ప్రభావం చూపుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రపంచంలో ఇప్పుడు ఎవరు ఎక్కడున్నా లైవ్‌లో చూసేంత టెక్నాలజీ మనకు అందుబాటులో ఉంది. ఇది ఒకింత మంచే చేస్తుంది. కానీ, అందరికీ కాకపోవచ్చు. ఈ టెక్నాలజీ వల్ల మీరు మీకు తెలియకుండానే టార్గెట్ అవుతున్నారనే సంగతి మీకు తెలుసా? మీ మొబైల్‌కు మాత్రమే పరిమితం అనుకుంటున్న మీ వ్యక్తిగత విషయాలు, ఆర్థిక లావాదేవీలు వివరాలు నేరగాళ్ల చేతిలోకి చేరే ‘తాళం’ చేతిని మీరే స్వయంగా ఇస్తున్నారు. నమ్మబుద్ధి కావడం లేదా? అయితే, మీరు ‘ఫింగర్‌టిప్’ సీజన్-1 చూడాలి. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘ఫింగర్‌టిప్’ సీజన్-2 కూడా నేపథ్యం కూడా అదే. అయితే, సీజన్‌-2 మరింత థ్రిల్‌గా దీన్ని తెరకెక్కించారు. మన జీవితాలపై ఇంటర్నెట్ ఏ విధంగా ప్రభావం చూపుతుందనే విషయాన్ని స్పష్టంగా చూపించే ప్రయత్నం చేశారు. దర్శకుడు శివకర్ శ్రీనివాసన్, రచయిత రోహిత్ అందించిన ఈ థ్రిల్లర్‌ వెబ్ సీరిస్‌.. ఎనిమిది ఎపిసోడ్‌లతో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రసన్న, అపర్ణ బాలమురళి, రెజినా కసాండ్ర,  కన్న రవి, శరత్ రవి, వినోద్ కిషన్‌లు కీలక పాత్రల్లో నటించారు. 

కథ: ఫస్ట్ ఎపిసోడ్ ప్రారంభం కాగానే.. సైకాలజిస్ట్ శ్రుతి (అపర్ణ బాలమురళి)కు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ ఇచ్చిన పేషెంట్ ఇంటికి వెళ్తుండగా ఓ షాకింగ్ ఘటన చూస్తుంది. శ్రుతి కళ్లముందే ఆ పేషెంట్ అపార్ట్‌మెంట్‌ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ ఘటనకు ఆరు నెలల ముందు ఏం జరిగిందనేదే అసలైన కథ. సైకాలజిస్ట్ శ్రుతి ఆన్‌లైన్, సోషల్ మీడియా వల్ల మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నవారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇస్తుంటుంది. ఈ సందర్భంగా ఆమె పోలీసుల కోసం ప్రత్యేకంగా ఒక ప్రజంటేషన్ ఇస్తుంది. డిజిటల్ సొసైటీలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రమాదాలు, బాధితులు డిప్రెషన్‌లోకి చేరుకోవడం ఆత్మహత్యలకు పాల్పడటం, మానసిక వ్యాధులతో బాధపడటం వంటి అంశాలను పోలీసులకు తెలియజేస్తుంది. ఆమె చెప్పే విషయాలను పోలీసులు సీరియస్‌గా తీసుకోరు. అయితే, ACP అరివళగన్ (ప్రసన్న) మాత్రం ఆసక్తి చూపిస్తాడు. దీంతో వారిద్దరి మధ్య స్నేహం కుదురుతుంది. కానీ, ఆమె ఏసీపీ వద్ద ఒక రహస్యాన్ని దాస్తుంది. మరోవైపు అరివళగన్‌ ‘ఎక్లిప్స్’ అనే హ్యాకర్‌‌ను ఎదుర్కోవలసి వస్తుంది. ‘ఎక్లిప్స్’ చేసేవి మంచి పనులైనా.. ఆన్‌లైన్ నేరాలకు పాల్పడుతున్నాడనే కారణంతో ఎలాగైనా ఆ హ్యాకర్‌ను పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అదే సమయంలో అరివళగన్‌కు ఎంతో సన్నిహితుడైన ఓ పెద్దాయన, ఆయన భార్యను ఎవరో దారుణంగా హత్య చేస్తారు. అక్కడి నుంచి కథ అనేక మలుపులు తిరుగుతుంది. 

ఈ కథతో సమాంతరంగా.. తన ముక్కును అసహ్యించుకొనే ప్రియా(రెజినా) సెలబ్రిటీగా మారినా సరే, అసంతృప్తితో జీవిస్తుంటుంది. చిన్నప్పుడు స్నేహితులు ఆమెను వంకర ముక్కు అని వెక్కిరిస్తారు.  అది ఆమెను మానసికంగా కుంగదీస్తుంది. దీంతో ఆమె ఎలాగైనా సరే తన ముక్కుకు సర్జరీ చేయించుకోవాలని భావిస్తుంది. అదే సమయంలో ఆమెకు హాలీవుడ్ సినిమాలో అవకాశం వస్తుంది. మరోవైపు సెల్‌ఫోన్ దుకాణం యజమాని ఆదినాథ్ (శరత్ రవి) డీప్ ఫేక్‌ వీడియోలతో అమ్మాయిలను లోబరుచుకోవడం, ఓ పోలీస్ ఆఫీసర్ కూతురి జీవితంతో ఆటలాడటాన్ని కథలో చూపిస్తారు. మరోవైపు ఫుడ్ డెలివరీ చేసే వెంకట్ (వినోత్ కిషన్).. తన ప్రేమ విఫలమైందనే కారణంతో మద్యం మత్తులో అమ్మాయిలను తిడతాడు. అది మరొకడు వీడియో తీసి వైరల్ చేస్తాడు. 

ఇంకో వైపు నవీన్(కన్న రవి) సోషల్ మీడియాను వాడుకొని నకిలీ డిజిటల్ కంటెంట్ సృష్టిస్తాడు. ఓ రాజకీయ నాయకుడిని ఎన్నికల్లో గెలిపించడానికి ప్రయత్నిస్తాడు. ఈ పాత్రలన్నీ ఒకరికి తెలియకుండా మరొకరితో కనెక్టవుతూ ఉంటాయి. ఏసీపీ దగ్గర శ్రుతి దాచిన రహస్యం ఏమిటీ? శ్రుతికి అక్కకు ఏం జరుగుతుంది? ఆమె తండ్రికి చూపు ఎందుకు పోతుంది? ఏసీపీ సన్నిహితులను ఎవరు చంపుతారు? నటి ప్రియా ముక్కు సర్జరీ తర్వాత ఎదుర్కొనే పరిణామాలు ఏమిటీ? డీప్ ఫేక్ వీడియోలు చేసే ఆదినాథ్‌ను పోలీసులు పుట్టుకోగలిగారా? ఫుడ్ డెలివరీ బాయ్ వీడియో ఇద్దరి మరణానికి ఎలా కారణం అవుతుంది? ఏసీపీ పట్టుకోవాలనే చూస్తున్న ఆ ‘ఎక్లిప్స్’ ఎవరు? అనేది తెలియాలంటే వెబ్ సీరిస్‌ను చూడాల్సిందే. 

విశ్లేషణ: ఇది నూటికి నూరుపాళ్లు మన కథ. ఇందులో విలన్ మరెవ్వరో కాదు.. మన చేతి వేళ్లే. నిత్యం మొబైల్‌పై కదలాడే చేతి వేళ్లు.. సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తాయో తెలియదు. ఎవరితో ఎలాంటి వీడియోను షేర్ చేసుకుంటాయో తెలీదు. అలాగే, ఏ వీడియోను రికార్డు చేస్తాయో తెలీదు. అందుకే, ఈ వెబ్ సీరిస్‌కు ‘ఫింగర్‌టిప్’ అని పేరు పెట్టారు. ఇలాంటి సబ్జెట్‌ను ఎంచుకోవడమంటే కత్తిమీద సామే. పైగా, దాన్ని ఆసక్తికరంగా, థ్రిల్ కలిగించేలా చూపించడం మరింత కష్టం. ఈ విషయంలో దర్శకుడు శివకర్ విజయం సాధించాడనే చెప్పుకోవాలి. అయితే, కథ చాలా స్లోగా సాగుతుంది. కానీ కొన్ని ట్విస్టులు కథపై ఆసక్తిని కలిగిస్తాయి. కాబట్టి, చివరి ఎపిసోడ్ వరకు మిమ్మల్ని కథ ఎంగేజ్ చేస్తుంది. ఈ కథలో అన్ని పాత్రలు ఒకదాన్ని ఒకటి కనెక్టై ఉంటాయి. ఆసక్తిని కూడా కలిగిస్తుంటాయి. కానీ, రెజినా పాత్ర మాత్రం కథ మధ్యలోకి చొప్పించినట్లుగా ఉంటుంది. ఆమె పాత్ర వచ్చినప్పుడల్లా ‘ముక్కు’ గురించే ప్రస్తావన. ఈ రోజుల్లో సోషల్ మీడియా మోజులో పడి చాలామంది అమ్మాయిలు తమ రూపు రేఖలు మార్చుకోడానికి ప్రయత్నిస్తున్నారు. లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు. ఈ విషయాన్ని రెజీనా పాత్ర ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. 

అమ్మాయిలు తమ వీడియోలు, ఫొటోలను ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వల్ల కలిగే సమస్యలను కూడా ఇందులో చూపించారు. ‘డీప్ ఫేక్’ వీడియోల ద్వారా వారి ముఖాలను పోర్న్ స్టార్ శరీరాలకు అతికించి రియల్ వీడియోలా తయారుచేసే టెక్నాలజీ గురించి చూపించారు. అలాగే, ఇంట్లో ఒంటరిగా జీవించే వృద్ధ జంటలను నేరగాళ్లు ఎలా టార్గెట్ చేసుకుంటారు? సోషల్ మీడియాలో తెలిసో తెలియకో చేసే పోస్టు వల్ల ఎన్ని ఇబ్బందులు ఏర్పడుతాయి? బెడ్‌రూమ్‌లో ఏకాంత క్షణాలను వీడియో తీయడం వల్ల కలిగే సమస్యలు, సోషల్ మీడియాలో వచ్చేవన్నీ నిజమేనని గుడ్డిగా నమ్మేయడం.. ఇలా మన జీవితాలతో ముడిపడే విషయాలెన్నో ఈ వెబ్‌సీరిస్‌లో ప్రస్తావించారు. ‘ఫింగర్‌టిప్‌’ మూడవ సీజన్‌ కూడా ఉంటుందని చివర్లో ఒక ట్విస్ట్ ఇచ్చారు.

ఎవరెవరు ఎలా చేశారు?: ఏసీపీ పాత్రలో ప్రసన్న జీవించాడనే చెప్పాలి. ఆ పాత్రలో భిన్న భాగోద్వేగాలను ప్రసన్న పండించాడు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా నటించిన వినోద్ కిషన్ నటన మనసును హత్తుకుంటుంది. అపర్ణ బాలమురళి, శరత్ రవి, కన్నా రవి తమ పాత్రలను చక్కగా పోషించారు. రెజీనా ఆ పాత్ర వల్ల పెద్దగా హైలెట్ కాలేదు. ఇందులోని కొన్ని క్యారెక్టర్లను అల్లుకోవడంలో తడబాటు కనిపిస్తుంది. కానీ, సబ్జెక్ట్ మంచిది కాబట్టి, అవి పెద్ద విషయాలు కాదు. చివరిగా.. నేరగాళ్ల బయటే కాదు.. మీరు వాడే మొబైల్, యాప్స్, సోషల్ మీడియాలో కూడా దాగే ఉన్నారు. అదెలా సాధ్యం అని తెలుసుకోవాలంటే.. ఈ సీరిస్‌ను చూడండి.

Also Read: 'సుడల్' రివ్యూ: శ్రియా రెడ్డి, ఐశ్వర్యా రాజేష్ నటించిన వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

Also Read: 'రెక్కీ' వెబ్ సిరీస్ రివ్యూ: కామకోరిక ఎంత దూరం తీసుకువెళుతుంది? ఏయే పనులు చేయిస్తుందంటే?

Published at : 20 Jun 2022 03:56 PM (IST) Tags: Regina Cassandra Fingertip Season 2 Review Fingertip 2 Review Fingertip Season 2 Fingertip Season 2 Review in Telugu fingertip 2 review in telugu Prasanna

సంబంధిత కథనాలు

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Keeravani On RGV: కీరవాణి మాటలకు చనిపోయాననే ఫీలింగ్ కలుగుతోంది- ఆర్జీవీ మరీ అంతమాట అనేశారు ఏంటండీ?

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

Anushka Sharma Fitness: అందాల అనుష్క అంత స్లిమ్ గా ఎలా ఉంటుందో తెలుసా? ఈ చిట్కాలు మీరు ట్రై చేస్తారా !

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

NTR 30 Update : ఎన్టీఆర్ సినిమాకు హాలీవుడ్ స్టంట్ కొరియోగ్రాఫర్ - షిప్పులో సూపర్ ఫైట్ గ్యారెంటీ 

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Nani On His Struggles : నాని డబ్బులు కొట్టేసిన కో డైరెక్టర్లు - ఆ స్కామ్స్ బయట పెట్టిన నేచురల్ స్టార్

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

Ghantadi Krishna - Risk Movie : 'రిస్క్' చేసిన ఘంటాడి కృష్ణ - పాన్ ఇండియా సినిమాతో దర్శక నిర్మాతగా

టాప్ స్టోరీస్

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

రాహుల్ కంటే ముందు అన‌ర్హ‌త వేటు ప‌డిన నేత‌లు వీరే

Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Nara Rohit :  రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్   ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం

ISRO LVM3: మరికొన్ని గంటల్లో నింగిలోకి ఎల్వీఎం3 - లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌ లోకి 36 ఉపగ్రహాలతో ప్రయోగం