Drugs in Hyderabad Pub: పబ్‌లో డ్రగ్స్ - ఇప్పుడే సినిమాల్లో ఎదుగుతున్నాం, బద్నాం చేయవద్దు: జూనియర్ ఆర్టిస్ట్ ఆవేదన
Drugs in Pub in Hyderabad: అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారని తమకు తెలియదని, తెలిస్తే మేం ఎందుకు వెళ్తామని జూనియర్ ఆర్టిస్ట్ కల్లపు కుషితా ప్రశ్నించారు. బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి రెడీ అన్నారు.
Drugs Raid in Hyderabad: హైదరాబాద్ నడిబొడ్డున్న ఉన్న పబ్‌లో డ్రగ్స్ దందాను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఆదివారం వేకువజామున ఆకస్మిక దాడులు చేసి బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూప్లాజా హోటల్లోని పుడింగ్ అండ్ మింక్ పబ్‌లో పార్టీలో పాల్గొన్న దాదాపు 150 మందిని అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణ చేపట్టిన అనంతరం వివరాలు సేకరించి 100 మందిని వారి ఇళ్లకు పంపించివేయగా.. కొందరు పీఎస్‌లో ఉండిపోయారు. పార్టీలో పాల్గొన్న వారి వివరాలతో ఓ జాబితా వైరల్ అవుతోంది. అయితే అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారని తమకు తెలియదని, తెలిస్తే మేం ఎందుకు వెళ్తామని కొందరు బాధితులు ప్రశ్నిస్తున్నారు. తన ఫొటో, పేరును ప్రచారం చేశారంటూ నటి హేమ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
దుష్ప్రచారం చేయవద్దు, మీకు కుటుంబాలున్నాయి..
పబ్‌లో ఉన్నవారు అందరూ డ్రగ్స్ తీసుకుంటున్నారని ప్రచారం కావడంతో జూనియర్ ఆర్టిస్ట్ (షార్ట్ ఫిలిం నటి) కల్లపు కుషితా (Junior Artist Kallapu Kushita) ఆవేదన వ్యక్తం చేశారు. తమలాగే ఈ వివరాలపై దుష్ప్రచారం చేస్తున్న వారికి సైతం కుటుంబాలు ఉన్నాయని, గుర్తుంచుకోవాలని ఇది నిజమని కుటుంబసభ్యులు భావిస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె వీడియోలో మాట్లాడుతూ.. లేట్ నైట్ పబ్‌లో ఉండటం తమ తప్పు కాదన్నారు. అక్కడ డ్రగ్స్ వినియోగిస్తున్నారు అని మాకు తెలియదు.. తెలిస్తే మేము ఎందుకు వెళ్తామని ప్రశ్నించారు. అయితే పబ్‌లో మాత్రం రష్ చాలా ఎక్కువగా ఉందని చెప్పారు
అంతలోనే పోలీసుల ఎంట్రీ..
ఫ్రెండ్స్‌తో కలిసి పార్టీకి వెళ్లాను. మరికాసేపట్లో పార్టీ ముగుస్తుంది. ఇంటికి వెళ్దామనుకున్నాం. కానీ అంతలోనే పోలీసులు ఎంట్రీ ఇచ్చి పబ్‌లో ఉన్న అందర్నీ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లడం సరికాదన్నారు. పబ్ నుంచి తీసుకెళ్లాక పోలీసులు తమ వివరాలు సేకరించారని, తాము పోలీసులకు సహకరించామని జూనియర్ ఆర్టిస్ట్ కల్లపు కుషితా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు సినిమా రంగంలో ఎదుగుతున్నామని, మమల్ని ఇలా బద్నా చేయడం సరికాదని షార్ట్ ఫిలిం నటి కల్లపు కుషితా (Junior Artist Kallapu Kushita In Drugs Raid in Hyderabad) ఆవేదన వ్యక్తం చేశారు.
బ్లడ్ శాంపుల్స్ తీసుకోండి, దేనికైనా రెడీ..
150 మంది వరకు పబ్ లో ఉన్నారు. కానీ అందులో కొందరు మాత్రమే డ్రగ్స్ తీసుకుంటే ఇలా అందరిపై ద్రుష్పచారం చేయడం సరి కాదు. కావాల్సి వస్తే మా రక్త నమూనాలు (Blood Samples) తీసుకోండి. మేం డ్రగ్స్ తీసుకోలేదు. కనుక మేము బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి ఎప్పుడైనా సిద్ధమే అని నటి కల్లపు కుషితా స్పష్టం చేశారు. మీడియా వాళ్లు కొంచం సమన్వయం పాటించాలి. అందరి రక్త నమూనాలు తీసుకొని ఏవరైతే డ్రగ్స్ తీసుకున్నారు వారి పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ పబ్ కి వచ్చిన వాళ్ళని అందరిని బద్నామ్ చేయడం సరికాదు.
అక్కడ పబ్ అర్ధరాత్రి వరకు నడిపించే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని నటి అన్నారు. మేం జస్ట్ after పార్టీ కి వెళ్ళాం. తిరిగి వెళ్లిపోదాం అనుకుంటున్న సమయంలో పోలీసులు వచ్చి అందర్నీ పీఎస్‌కు తరలించారని ఆమె తెలిపారు. కానీ పబ్‌లో ఉన్న వాళ్లంతా డ్రగ్స్ తీసుకున్నట్లుగా ఫొటోలతో ప్రచారం చేయకూడదని రిక్వెస్ట్ చేశారు. బ్లడ్ శాంపిల్స్ సేకరించి డ్రగ్స్ తీసుకున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు. తనలాంటి అమాయకులపై ఇలాంటి దృష్ప్రచారం వల్ల మా కుటుంబసభ్యులు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని వీడియోలో తెలిపారు.
Also Read: Banjarahills Drugs Case : ఓటీపీ ఉంటేనే పబ్ లోకి ఎంట్రీ, ఆ జాబితా చెప్పడం కరెక్ట్ కాదు : డీసీపీ జోయల్ డేవిస్
Also Read: Banjara Hills Drugs Case : బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో నలుగురి అరెస్టు, వెలుగులోకి సంచలన విషయాలు!