Overstay in Lavatory: టాయిలెట్‌లో ఫోన్ చూస్తూ కూర్చుంటే అక్కడ క్యాన్సర్ రావొచ్చు - సంచలన విషయాలు బయటపెట్టిన డాక్టర్లు
Phone In Lavatory: పొద్దున్నే వాష్ రూమ్‌లోకి కాలకృత్యాలు తీర్చుకోవడానికి ఫోన్ తోపాటు వెళ్లి కనీసం గంట గడిపేవారు ఉంటారు. ఇలాంటి వారికి షాకిచ్చే వార్త డాక్టర్లు బయట పెట్టారు.
Doctors Warn Against Sitting on the Toilet for More Than 10 Minutes: టాయిలెట్‌లో మొబైల్ ఫోన్లు , గాడ్జెట్‌లను ఉపయోగించడం సాధారణ అలవాటుగా మారిపోయింది. కాలకృత్యాలు తీర్చుకునేటప్పుడు చాలా మంది ఫోన్ చూస్తూ ఎక్కువ కాలం గడుపుతున్నారు. ఇలా చేయడం తీవ్ర అనారోగ్య సమస్యకు కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.
సాధారణంగా వాష్ రూమ్ కు వెళ్లిన వ్యక్తి మూడు నుంచి ఐదు నిమిషాలు ఉండవచ్చు. కానీ ఫోన్లు తీసుకెళ్లడం వల్ల ఆ సమయం భారీగా పెరిగిపోతోంది. ఆ కమోడ్ పై అలా కూర్చుని ఫోన్ చూస్తూ ఉండిపోవడం వల్ల సీరియస్ ఆరోగ్య సమస్యలు వస్తాయని డల్లాస్‌లోని యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ సౌత్ వెస్ట్రన్ మెడికల్ సెంటర్‌కు చెందిన సర్జన్ డాక్టర్ లై ఝూ పరిశోధన చేసి ప్రకటించారు. ఇలాంటి అలవాటు వల్ల హేమోరాయిడ్స్ రావడం, కటి కండరాలు బలహీనపడే ప్రమాదం ఉందని గుర్తించారు.
హేమోరాయిడ్స్ రావడం, కటి కండరాలు బలహీనపడిన సమస్యలతో తన వద్దకు వచ్చిన వారిని డాక్టర్ లై ఝూ పరిశీలించినప్పుడు టాయిలెట్‌లో ఎక్కువ సమయం గడపడం వారి సమస్యలకు కారణం అని గుర్తించారు. న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లోని స్టోనీ బ్రూక్ మెడిసిన్‌లోని ఇన్‌ఫ్లమేటరీ బవెల్ డిసీజ్ సెంటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఫరా మోన్‌జుర్ టాయిలెట్ సమయాన్ని సగటున 5 నుండి 10 నిమిషాలకు పరిమితం చేయాలని సిఫార్సు చేస్తున్నారు.
Also Read: గంజాయి మొక్కలతో బాల్కనీ గార్డెన్ - రొమాంటిక్ ఫోటోషూట్ చేసుకుని సోషల్ మీడియాలో పెట్టిన జంట - కట్ చేస్తే
టాయిలెట్ సిట్టింగ్ వల్ల ఓపెన్ ఓవల్ ఆకారం తుంటిపై ఒత్తిడిని కలిగిస్తుంది. అధిక సమయం కూర్చోవడం వల్ల దిగువ శరీరాన్ని క్రిందికి లాగుతుంది. ఈ పెరిగిన ఒత్తిడి రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుందని డాక్టర్లు గుర్తించారు. ఈ కారణంగా దిగువన ప్రైవేటు పార్టుల చుట్టూ ఉన్న సిరలు , రక్త నాళాలు పెద్దవిగా మరియు రక్తంతో నిండిపోతాయి. ఇది హేమోరాయిడ్స్ ప్రమాదాన్ని పెంచుతుందని డాక్టర్లు తెలిపారు.
టాయిలెట్‌లో తమ ఫోన్‌లలో నిమగ్నమైన వ్యక్తులు మలవిసర్జన చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు వారి కండరాలు ఒత్తిడికి గురవుతాయి. ఈ ప్రవర్తన అంగ-మల అవయవాలకు , కటి ప్రాంతానికి హానికరమని చెబుతున్నారు. మలవిసర్జన కష్టంగా ఉన్నట్లయితే, 10 నిమిషాల తర్వాత ఆపి, కొద్దిసేపు నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. మలబద్ధకం పెరగడం , ఎక్కువసేపు టాయిలెట్‌లో కూర్చోవడం కూడా క్యాన్సర్‌కు సంకేతమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మలబద్ధకం కొనసాగితే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యమని వైద్యులు సలహాలిస్తున్నారు.
Also Read: అడుక్కునేవాళ్లింట్లో ఫంక్షన్‌కు 20వేల మంది గెస్టులు-కోటిన్నర ఖర్చు- పాకిస్తాన్‌లో అంతే !
స్మార్ట్ ఫోన్‌ను ఎక్కువగా వినియోగించద్దని డాక్టర్లు అదే పనిగా చెబుతున్నారు. అయితే మనిషి ఇప్పుడు స్మార్ట్ ఫోన్ కు బానిసగా అయ్యారు. ఉదయం లేచాక మొదట స్మార్ట్ ఫోన్ చూస్తున్నారు. నిద్రపోయేటప్పుడు స్మార్ట్ ఫోన్ చూసి నిద్రపోతున్నారు. టాియలెట్ లోకి కూడా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు అది ప్రమాదకరంగా మారుతోంది. దీన్ని వదిలించుకుంటనే సీరియస్ అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.