Raksha Bandhan 2025 Wishes : రాఖీ శుభాకాంక్షలు 2025.. ఫేస్బుక్, వాట్సాప్‌లలో మీ బ్రదర్ లేదా సిస్టర్‌కి ఇలా విష్ చేసేయండి
Happy Raksha Bandhan 2025 Wishes in Telugu : మీ బ్రదర్ లేదా సిస్టర్‌కి సోషల్ మీడియా ద్వారా రాఖీ శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? అయితే ఈ ఫోటోలు, కోట్లతో పోస్ట్‌లు పెట్టేయండి.

అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్లకు రాఖీ పండుగ అనేది ఓ ఎమోషన్. ఏడాదంతా కొట్టుకుని తిట్టుకున్నా.. అస్సలు మాట్లాడుకోకపోయినా.. రాఖీ పండుగ వస్తే చాలు ఒకరిపై ఒకరికి ఉన్న ఇష్టాన్ని, ప్రేమను బయటపెడతారు. సోదర, సోదరి బంధానికి అదే అసలైన అర్థం. ఇది ప్రేమ, నమ్మకాన్ని, విడదీయరాని బంధాన్ని సూచిస్తుంది. పేగు తెంచుకుని పుడతారు కాబట్టి.. ఆ బంధం అలాగే కొనసాగుతుంది. ఇంతటి స్పెషల్ రాఖీ.. ఈ ఏడాది 2025లో ఆగస్టు 9వ తేదీ శనివారం వచ్చింది.
రాఖీ సందర్భంగా చాలామంది బ్రదర్స్, సిస్టర్స్ కలుసుకుని పండుగను సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే వివిధ కారణాల వల్ల కొందరు దూరంగా కూడా ఉంటారు. అయితే మీ అన్నతో లేదా తమ్ముడితో రాఖీ సెలబ్రేట్ చేసుకుని ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలన్నా.. దూరంగా ఉన్న మీ చెల్లికో, అక్కకో వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా విష్ చేయాలన్నా కొన్ని కోట్స్, ఫోటోలు అవసరం. అయితే వారికోసం మీరు ఎలాంటి సందేశాలు పంపాలి, కోట్స్ రాయాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.
రక్షాబంధన్ శుభాకాంక్షలు
హ్యాపీ రాఖీ అన్నయ్య – ఈ ఏడాది నీకు రాఖీ కట్టలేకపోతున్నాను. కానీ మన మధ్య ఈ దూరం ఎప్పటికీ ఉండకూడదని కోరుకుంటున్నాను.
- నువ్వు లేకుంటే నా బాల్యం అసంపూర్ణం – నువ్వు బ్రదర్ మాత్రమే కాదు, నా ధైర్యం కూడా. హ్యాపీ రాఖీ.

- మన మధ్య గొడవలు ఉన్నా ఆ ప్రేమ ఎప్పటికీ తగ్గదని రాఖీ చెప్పే రోజు ఇది. లవ్ యూ బ్రదర్. హ్యాపీ రక్షాబంధన్.

- ఈ ఏడాది నీ ప్రతి అడుగు విజయమే కావాలి. నీ గోల్‌కి చేరాలని కోరుకుంటూ హ్యాపీ రక్షాబంధన్ రా.

- చెల్లిగా నా జీవితంలోకి వచ్చి.. అమ్మగా ప్రేమను పంచావు. ఎన్నో సందర్భాల్లో ఇంట్లో అందరినీ ఎదురించి నాకు నచ్చిన రంగంలో ఎదిగేలా చేశావు. నువ్వు నా లైఫ్ సపోర్ట్. ఈ జీవితంలో నీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటానని.. నీకు అండగా ఉంటాను అని మాటిస్తున్నాను. హ్యాపీ రక్షాబంధన్ రా బుజ్జి.

- పెళ్లి అయి దూరమయ్యావు. కానీ నువ్వు పిలిస్తే ఎంత దూరమైనా వస్తాను. నువ్వు సంతోషంగా ఉండాలనేదే నా కోరిక. హ్యాపీ రాఖీ సిస్టర్.

- కలిసి ఉన్నంతకాలం ఏదొకటి గొడవ పడుతూనే ఉన్నాము. దూరంగా ఉన్నాకే నువ్వు లేని లోటు నాకు తెలిసి వచ్చింది. నీవల్లే నా చైల్డ్‌హుడ్ మెమరబుల్‌గా మారింది. లవ్ యూ సిస్/బ్రో. హ్యాపీ రాఖీ.
రాఖీ కట్టడం వెనుక అర్థమిదే..
రాఖీ కట్టి సోదరి అన్న లేదా తమ్ముడి మంచి భవిష్యత్తును కోరుకుంటుంది. అలాగే వారి ప్రేమను, ఆప్యాయతను దూరం చేసుకోకూడదనుకుంటుంది. రాఖీ కట్టించుకున్న వ్యక్తి తన చెల్లి లేదా అక్కకి ఎప్పటికీ తోడుగా, అండగా ఉంటూ రక్షిస్తాననే ప్రతిజ్ఞ చేస్తాడు. ఇలా ఒకరికొకరు తోడుగా ఉండడమే నిజమైన రక్షా బంధన్.
Also Read : రాఖీ కట్టిన తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు ఈ ఫోటో స్టిల్స్ ట్రై చేయండి






















