A person washed away Due to Heavy Rains in Hyderabad | హైదరాబాద్ లో కుండపోత
హైదరాబాద్‌ని వాన ముంచెత్తింది. ఒక్కసారిగా కుంభవృష్ఠి కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్ తో పాటు వరద నీరు చేరడంతో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై పోయాయి. మురుగు నీరు కూడా ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. జూబ్లీహిల్స్ కృష్ణానగర్ లో ఒక వ్యక్తి బైక్ తో పాటు కొట్టుకుపోయాడు. రోడ్డుపై నీళ్లు వేగంగా ప్రవహిస్తుండడంతో అక్కడే ఉన్న స్థానికులు కూడా ఎలాంటి సహాయం చేయలేక పొయ్యారు. ట్రాఫిక్ కూడా రోడ్లపై స్తంభించపోవడంతో రాత్రి వరకు వర్షంలోనే వాహనదారులు నరకం చూశారు. ఒక్కసారిగా హైదరాబాద్ వ్యాప్తంగా క్లౌడ్ బరస్ట్ అయింది. శేరిలింగంపల్లిలో 13.38 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయింది.
హైదరాబాద్ 5 ప్రాంతాల్లో రికార్డ్ స్థాయిలో వర్ష పాతం నమోదు అయింది. శేరిలింగంపల్లిలో 13.38 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయింది. గచ్చిబౌలిలో 13.38 సె.మీ నమోదు కాగా సరూర్ నగర్ లో 12 సెంటీ మీటర్లు అత్యధిక వర్షపాతం నమోదు అయింది. శ్రీ నగర్ కాలనీలో 12సెంటీమీటర్లు, ఖైరతాబాద్ ప్రాంతంలో 11.88, యూసఫ్ గూడలో 11 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షంతో వెంటనే అపప్రమత్తమైన అధికారులు అలెర్ట్ జారీ చేసి ట్రాఫిక్ ను క్లియర్ చేసారు.





















