అన్వేషించండి

Tirumala News: సీనియర్ సిటిజన్లకు టీటీడీ గుడ్ న్యూస్ - ఇలా చేస్తే సకల సౌకర్యాలతో శ్రీవారి దర్శనం

Andhra News: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే వృద్ధులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. స్వామి ఉచిత దర్శనం కోసం వారికి 2 స్లాట్లు కేటాయించారు.

TTD Special Services For Senior Citizens: 65 ఏళ్లు దాటిన వృద్ధులకు టీటీడీ (TTD) గుడ్ న్యూస్ చెప్పింది. వయసు రీత్యా శ్రీవారి దర్శనానికి వచ్చే వారికి ప్రత్యేక వెసులుబాట్లు కల్పించనుంది. సీనియర్ సిటిజన్లకు స్వామి వారి ఉచిత దర్శనం కోసం రెండు స్లాట్లు కేటాయించారు. ఉదయం 10 గంటలకు మధ్యాహ్నం 3 గంటలకు రెండు స్లాట్లు కేటాయించారు. వీరు ఫోటో ఐడీతో పాటు వయస్సును నిర్ధారించే రుజువును సమర్పించాల్సి ఉంటుంది. దీన్ని S1 కౌంటర్‌కు నివేదించాల్సి ఉంటుంది. వీరు వంతెన దిగువన ఉన్న గ్యాలరీ నుంచి ఆలయం కుడి గోడ వద్ద రహదారిని దాటాలి. ఏ మెట్లు సైతం ఎక్కాల్సిన పని లేదు. అక్కడ దర్శనం కోసం వేచి చూసే సౌకర్యాలు కల్పిస్తారు.

వృద్ధులకు అనుగుణంగా ఉత్తమ సీట్లు, వేడిగా సాంబార్ అన్నం, పెరుగన్న, వేడి పాలు ఇవన్నీ వారి సీట్ల దగ్గరికే తెచ్చి సిబ్బంది అందిస్తారు. దర్శనం అనంతరం ఆలయం నిష్క్రమణ ద్వారం వద్ద కార్ పార్కింగ్ ప్రాంతం నుంచి, కౌంటర్ వద్ద వీరిని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కారు అందుబాటులో ఉంది. ఎలాంటి ఒత్తిడి, బలవంతం లేకుండా ప్రశాంతంగా స్వామి దర్శనం చేసేలా వృద్ధుల కోసం టీటీడీ చర్యలు చేపట్టింది. దర్శన క్యూ తర్వాత వీరు 30 నిమిషాల్లోపే దర్శనం నుంచి నిష్క్రమించవచ్చు. పూర్తి వివరాలకు హెల్ప్ లైన్ నెం. 08772277777ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

గురువారం టికెట్లు విడుదల

మరోవైపు, తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ఫిబ్రవరి నెల కోటాను టీటీడీ గురువారం విడుదల చేయనుంది. కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లను గురువారం ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఇక, శ్రీవారి ఆలయంలో అంగ ప్రదక్షిణ టికెట్ల కోటాను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయో వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారి కోసం ప్రత్యేక దర్శన టోకెన్లు విడుదల చేయనున్నారు. అలాగే, ఈ నెల 24న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయనున్నారు.

ఇకపై వారికి నో ఎంట్రీ

అటు, తిరుమలలో అన్యమత ప్రచారంపై టీటీడీ ఫోకస్ చేసింది. ప్రసిద్ధ హిందూ ధార్మిక క్షేత్రంలో తరచూ అన్యమత ప్రచారం వివాదంగా మారుతోంది. నిబంధనల ఉల్లంఘనపై తితిదే ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 రోజుల క్రితం అటవీ శాఖ పరిధిలోని పాపనాశనం వద్ద కొందరు మహిళలు క్రైస్తవ గీతాలు పాడుతూ రీల్స్ చేయడం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీటీడీ విజిలెన్స్ విభాగం స్పందించింది. తిరుమల టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు రీల్స్ చేసిన మహిళల ఆచూకీ తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. విజిలెన్స్, పోలీసులు, అటవీ యంత్రాంగం సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో సమీప దుకాణాల్లో దాదాపు 25 మందికిపైనే అన్యమతస్తులు పని చేస్తున్నట్లు తేలింది. ఈ క్రమంలో ప్రతీ దుకాణాన్ని పరిశీలించి ఇతర మతాలకు చెందిన వారి ఆధారాలు కనిపెట్టేందుకు చర్యలు చేపట్టారు.

Also Read: Andhra Pradesh Volunteer System: వలంటీర్‌ వ్యవస్థ కథ ముగిసినట్టే- ఆపేసింది జగనే- సభలో మంత్రి కీలక ప్రకటన

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Parvatipram Manyam District: చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
జనానికి ఏథర్ షాక్‌: జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ.3,000 వరకు పెంపు
2026 నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రేట్లు పెంపు - ఇప్పుడు కొంటేనే డబ్బులు ఆదా!

వీడియోలు

Union Minister Kishan Reddy Interview | త్వరలోనే ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధి పనులు | ABP Desam
World Cup 2026 Squad BCCI Selectors | బీసీసీఐపై మాజీ కెప్టెన్ ఫైర్
Trolls on Gambhir about Rohit Form | గంభీర్ ను టార్గెట్ చేసిన హిట్ మ్యాన్ ఫ్యాన్స్
Ashwin about Shubman Gill T20 Career | మాజీ ప్లేయర్ అశ్విన్ సంచలన కామెంట్స్
India vs Sri Lanka 3rd T20 | నేడు భారత్‌, శ్రీలంక మూడో టీ20

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Parvatipram Manyam District: చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
చెత్త రిక్షాలో వృద్ధురాలి మృతదేహం తరలింపు- రాష్ట్రానికి కాదా తలవంపు!
Medchal Crime News: ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
ఆన్లైన్ గేమ్స్ మహమ్మారికి మరో కుర్రాడు బలి; డబ్బులు నష్టపోయి మేడ్చల్ యువకుడు ఆత్మహత్య
Guntur Railway Station: గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
గుంటూరు రైల్వే స్టేషన్‌లో స్లీపింగ్ పాడ్స్-రేట్ చాలా తక్కువ!
జనానికి ఏథర్ షాక్‌: జనవరి 1 నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ.3,000 వరకు పెంపు
2026 నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్ల రేట్లు పెంపు - ఇప్పుడు కొంటేనే డబ్బులు ఆదా!
DGCA Committee Report: ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
ఇండిగో విమానాలు ఎందుకు రద్దు అయ్యాయి? ప్రభుత్వానికి చేరిన DGCA కమిటీ నివేదిక!
AI Impact In India:భారత్‌లో ఉద్యోగాలపై AI ప్రభావం ఉండదు! ఒకే క్లిక్‌లో పూర్తి వివరాలు తెలుసుకోండి!
భారత్‌లో ఉద్యోగాలపై AI ప్రభావం ఉండదు! ఒకే క్లిక్‌లో పూర్తి వివరాలు తెలుసుకోండి!
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షన్నర రూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
శాంసంగ్‌ ఫోల్డ్‌బుల్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌- లక్షన్నర రూపాయల ఫోన్‌పై 65000 తగ్గింపు
Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్
బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై భారత్‌ ఆందోళన- హిందువులపై దాడులు ఆపాలని డిమాండ్
Embed widget