బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్తుంటే కుక్కలు వెంబడించాయి.. భారీ గౌనుతో నటి తిప్పలు
రాఖీ సావంత్‌ను కుక్కలు వెంటాడాయి. ఆమె వేసుకున్న భారీ గౌనును చూసి.. ఆమెను వెంబడించాయి.
పిచ్చి దుస్తులు వేసుకుంటే కుక్కలు వెంటాడతాయని తెలిసిందే. ఇలాంటి అనుభవమే ఓ నటికి కూడా ఎదురైంది. ఆమె మరెవ్వరో కాదు.. సినిమాల్లో కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో ఉండే రాఖీ సావంత్. ఇప్పటికే ఆమె హిందీలోని ‘బిగ్‌బాస్-14’లో ఎంట్రీ ఇచ్చి బోలెడంత వినోదాన్ని పంచింది. మరి.. మళ్లీ ఎందుకు బిగ్‌బాస్‌కు వెళ్తుందనేగా మీ సందేహం?
ఇప్పుడు VOOT ఓటీటీ వేదికగా ‘బిగ్‌బాస్ ఓటీటీ’ పేరుతో ప్రసారమవుతోంది. దీనికి కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. గతంలో బిగ్‌బాస్‌లో పాపులరైన సెలబ్రిటీలతో మళ్లీ ఈ సీజన్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రాఖీ సావంత్‌కు సైతం ఆహ్వానం లభించింది. ‘బిగ్‌బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రాఖీ సావంత్ పింక్ కలర్ గౌను ధరించింది. భారీ డ్రెస్‌లో బుట్టబొమ్మలా సిద్ధమైన ఆమె నడుచుకుంటూ బిగ్‌బాస్ హౌస్ వైపు వెళ్తుంటే.. వీధి కుక్కలు ఆమె వెంటనే వచ్చాయి. దీంతో హడలిపోయిన రాఖీ.. ‘‘అవి నా అభిమానులా ఏంటీ.. నా వెనకాలే వస్తున్నాయి’’ అంటూ గబగబా నడుచుకుంటూ వెళ్లిపోయింది. పాపం ఆమె అంత భయపడుతున్నా.. అక్కడ సెక్యూరిటీ సిబ్బంది సాయం చేయలేదు.
Also Read: శృంగారం లేకుండా ఉండగలవా? అభిమాని ప్రశ్నకు.. దిమ్మతిరిగే జవాబిచ్చిన శృతి హాసన్
ఈ వీడియోను రాఖీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన నెటిజనులు ‘‘అయ్యో పాపం.. రాఖీ’’ అంటూ జాలిచూపుతున్నారు. లక్కీగా అవి కరవలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే.. బిగ్‌బాస్ హౌస్‌కు బదులు పెద్దాసుపత్రికి వెళ్లేదని కామెంట్లు చేస్తున్నారు. ఈ షోలోకి వచ్చేందుకు రాఖీ సావంత్ చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరికి నిరసనలు కూడా వ్యక్తం చేసింది. స్పైడర్ ఉమెన్ గెటప్ వేసుకుని ముంబయి వీధుల్లో తిరుగుతూ రచ్చ చేసింది. ‘‘నేను రాఖీని కాదని స్పైడర్-ఉమెన్’’ అని సూట్‌కేసుతో తిరిగింది. ‘‘నాకు బిగ్‌బాస్ షో అంటే చాలా ఇష్టం. ‘బిగ్‌బాస్’ ఓటీటీ సీజన్‌లోకి నన్ను ఆహ్వానించకపోవడం బాధగా ఉంది. సిద్ధార్థ్ శుక్లా, షెహ్నాజ్ గిల్‌ను ఆహ్వానించి నన్నెందుకు ఆహ్వానించలేదని ఆమె ప్రశ్నించింది. దీంతో ఆమెను ‘బిగ్‌బాస్ ఓటీటీ’ నుంచి ఆమెకు ఆహ్వానం అందింది. లేకపోతే ఆమెను ఇంకెన్ని వేషాల్లో చూడాల్సి వచ్చేదో!
Also Read: ‘నాని.. నిజజీవితంలో హీరో కాదు, పిరికోడు’.. లైఫ్‌టైమ్ బ్యాన్ తప్పదు, ఎగ్జిబిటర్స్ షాకింగ్ నిర్ణయం!
Also Read: ఆర్జీవీ అదేం పని.. నటితో రొమాంటిక్ డ్యాన్స్, వైరల్ వీడియోలో ఉన్న ఆమె ఎవరు?