By: ABP Desam | Updated at : 05 Oct 2021 04:31 PM (IST)
సమంత సీక్రెట్ టాటూ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు మణికట్టు వెనుక ఓ పచ్చబొట్టు ఉంటుంది. దాని స్టోరీ ఏంటో అందరికీ తెలిసిందే. అలాంటి టాటూనే చైతు మణికట్టుపై కూడా ఉంటుంది. ఓ సందర్భంలో ఈ టాటూ స్టోరీ ఏంటో బయటపెట్టింది సమంత. అయితే సమంతకు ఇదే కాకుండా సీక్రెట్ ప్లేస్ లో మరో టాటూ కూడా ఉంది. ఆ టాటూకి అర్ధమేంటనే విషయాన్ని కూడా ఆమె బయటపెట్టింది. 'ఓ బేబీ' సినిమా సక్సెస్ తరువాత ఓ ఇంటర్వ్యూలో ఈ పచ్చబొట్టును బయటపెట్టింది సమంత.
పక్కటెముకలకు కాస్త పైన దీన్ని పొడిపించుకుంది. ఫైనల్ గా సీక్రెట్ టాటూ చూపించేస్తున్నా అంటూ ఓ స్టిల్ ను రిలీజ్ చేసింది సమంత. ఇంతకీ ఆ టాటూ ఏంటంటే.. 'చై' అని రాసిన పదం. తన భర్తపై ఉన్న ప్రేమతో సమంత అతడి పేరుని సీక్రెట్ ప్లేస్ లో పచ్చబొట్టుగా వేయించుకుంది. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. నూరేళ్లపాటు సంతోషంగా ఉంటారనుకున్న ఈ జంట నాలుగేళ్లు తిరక్కుండానే విడాకులు తీసుకుంటున్నారు.
మరి ఈ పచ్చబొట్టు పరిస్థితేంటి..? సమంత సీక్రెట్ ప్లేస్ లో ఇప్పటికీ ఆ టాటూ ఉందా..?. నిజానికి సమంత 'చై' అని వేయించుకున్నది పర్మినెంట్ టాటూ. దీన్ని తొలగించాలంటే చాలా శ్రమ పడాల్సివుంటుంది. దాదాపు ఒక ప్లాస్టిక్ సర్జరీ అవసరం పడుతుంది. వీటికోసం చాలా మంది స్పెషలిస్ట్ లు కూడా ఉన్నారు. గతంలో చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు, కోలీవుడ్ తారలు ఇలానే తన ఒంటిపై ఉన్న టాటూలను సక్సెస్ ఫుల్ గా తొలగించి గత జ్ఞాపకాలను మర్చిపోయామంటూ కవర్ చేసుకున్నారు. ఇప్పుడు సమంత కూడా అదే పని చేస్తుందేమో చూడాలి!
Also Read:బ్రేకప్‌లకు కేరాఫ్ అడ్రస్.. అక్కినేని ఫ్యామిలీ
Karate Kalyani: నన్ను చంపేందుకు నా కార్ టైర్లు కోసేశారు, పెద్ద ప్రమాదం తప్పింది: కరాటే కళ్యాణి
షారుక్‌తో నటించేందుకు ఆ పాక్ నటుడు రూ.1 మాత్రమే తీసుకున్నాడట!
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం
Agent OTT release: 'ఏజెంట్' రీ-కట్ వెర్షన్ కూడా బాగోలేదా? ఓటీటీలో రిలీజ్ ఇప్పట్లో కష్టమేనా?
Adipurush: సినీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ‘ఆదిపురుష్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాట్లు
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ
క్యూట్ స్మైల్ తో కట్టిపడేస్తున్న లావణ్య త్రిపాఠి