Katrina-Vicky wedding: కత్రినా నిశ్చితార్థపు ఉంగరం, మంగళసూత్రం ఎంత ఖరీదో తెలుసా?
కత్రినా - విక్కీ కౌశల్ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.
బాలీవుడ్ ప్రేమికులు కత్రినా-విక్కీ పెద్దల సమక్షంలో ఒక్కటయ్యారు. సెలెబ్రిటీ పెళ్లంటే బాలీవుడ్ జనాలకే కాదు సాధారణ ప్రజలకు కూడా ఎంతో ఆసక్తి. వారి వేసుకున్న డ్రెస్సు నుంచి నగల వరకు అన్నీ పరిశీలిస్తారు. తాజాగా కత్రినా నిశ్చితార్థపు రింగు ఖరీదు వివరాలు బయటికి వచ్చాయి. ఇప్పుడు ఈ వార్తే బాలీవుడ్లో ట్రెండవుతోంది. నీలమణితో చేసిన ఆ డైమండ్ రింగ్ విలువ దాదాపు ఏడున్నర లక్షల రూపాయలుగా తెలుస్తోంది. ఇలాంటి రింగ్ బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ డయానా ప్రిన్స్ చార్లెస్ తో తన నిశ్చితార్థం సమయంలో ధరించింది.
ఇక కత్రినా మెడలో కనిపిస్తున్న నల్లపూసల మంగళ సూత్రం విలువ కూడా కొన్ని లక్షల రూపాయలని తెలుస్తోంది. సింగిల్ లైన్ నల్లపూసలకు చివర్లో రెండు డైమండ్ డ్రాప్స్ వేలాడుతూ కనిపిస్తున్నాయి. ఆ డైమండ్లను విక్కీ తన భార్యకు పెళ్లి సందర్భంగా బహుమతిగా ఇచ్చినట్టు సమాచారం. ఈ మంగళసూత్రాన్ని సబ్యసాచి ప్రత్యేకంగా రూపొందించాడు. అంతేకాదు కత్రినా వేసుకున్న ఎరుపు లెహెంగా కూడా సబ్యసాచి క్రియేషనే.
కాగా వీరి వెడ్డింగ్ ప్రసార హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుక్కునేందుకు ముందుకొచ్చిందని టాక్ వినిపిస్తోంది. దాదాపు రూ.వందకోట్లు ఇందుకు చెల్లించేందుకు సిద్ధమైందని, అయితే కత్రినా-విక్కీ ఈ డీల్ కు ఒప్పుకున్నారో లేదో మాత్రం తెలియరాలేదు.
కత్రినా-విక్కీల పెళ్లి రాజస్థాన్లోని ‘సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బర్వారా హోటల్ లో’ అంగరంగవైభవంగా జరిగింది. ఈ జంట ముంబైలో భారీస్థాయిలో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. పెళ్లికి సినిమా ఇండస్ట్రీ నుంచి ఎక్కువ మందిని పిలువలేదు, అందుకే స్నేహితులు, ఇండస్ట్రీలోని పెద్దలు, ఆర్టిస్టుల కోసం భారీ విందు ఏర్పాటు చేయబోతున్నారు.
Congratulations Katrina and Vicky!! Your fans couldn't be more happier for you 💗💗💗 pic.twitter.com/lD8iqp1tmS
— Katrina Kaif Online (@KatrinaKaifFB) December 9, 2021
Also Read: కత్రినా-విక్కీ.. పెళ్లి ఫొటోలు వచ్చేశాయ్.. కొత్త జంట భలే ముచ్చటగా ఉంది!
Also Read: కొత్త జీవితంలో అడుగు పెట్టిన కత్రినా కైఫ్, విక్కీ కౌశల్
Also Read: కత్రినా, విక్కీ కౌశల్ వెడ్డింగ్ కార్డ్ లీక్.. పోస్ట్ వైరల్..
Also Read: ఒక్కసినిమా కూడా కలిసి చేయలేదు, కేవలం ఆ ఒక్క మాటతో ప్రేమలో పడ్డారు... విక్కీ-కత్రినా లవ్ స్టోరీ
Also Read: ఈ సెలెబ్రిటీ పెళ్లి ఓటీటీలో ప్రసారం కానుందా... వందకోట్ల డీల్ కుదిరిందా?