అన్వేషించండి
Advertisement
DJ Tillu First Day Share: 'అట్లుంటది మరి ఆడియన్స్ కి నచ్చితే', 'డీజే టిల్లు' కలెక్షన్స్
మొదటిరోజే హిట్ టాక్ తెచ్చుకున్న 'డీజే టిల్లు' సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు రూ.4 కోట్ల షేర్ ని రాబట్టింది.
యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటించిన లేటెస్ట్ సినిమా 'డీజే టిల్లు'. 'అట్లుంటది మనతోని' అనేది సినిమా ట్యాగ్ లైన్. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేశారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ట్రైలర్ తో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
సినిమాలో లాజిక్స్ లేనప్పటికీ మంచి ఎంటర్టైన్మెంట్ ఉండడంతో అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది. కామెడీ బాగా వర్కవుట్ అయింది. ముఖ్యంగా సిద్ధు డైలాగ్స్ అండ్ యాక్షన్ కి యూత్ బాగా కనెక్ట్ అవుతుంది. అన్ని ఏరియాల నుంచి ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో జనాలు ఈ సినిమాకి క్యూ కడుతున్నారు. రవితేజ సినిమా థియేటర్లో ఉన్నప్పటికీ.. 'డీజే టిల్లు'నే ఫస్ట్ ఆప్షన్ గా పెట్టుకున్నారు. మొదటిరోజే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ రాబడుతోంది. తొలిరోజు రూ.4 కోట్ల షేర్ ని రాబట్టింది. ఈ విషయాన్ని చిత్రబృందం అఫీషియల్ గా వెల్లడించింది.
ఒక్క నైజాంలోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించినట్లు టాక్ వినిపిస్తుంది. ఇండియాతో సహా ఓవర్సీస్ లో కూడా మంచి షేర్స్ ను రాబడుతుంది. ఇదే కంటిన్యూ అయితే ఫుల్ రన్ లో కచ్చితంగా ఈ సినిమా గట్టి లాభాలు తీసుకురావడం ఖాయం.
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
తెలంగాణ
ఎంటర్టైన్మెంట్
రాజమండ్రి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion