(Source: ECI/ABP News/ABP Majha)
Kajal Aggarwal: కమల్ హాసన్ సినిమాతో కాజల్ రీ ఎంట్రీ కన్ఫర్మ్!
వచ్చే నెల నుంచి 'ఇండియన్2' సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఇదే విషయాన్ని హీరోయిన్ కాజల్ కూడా కన్ఫర్మ్ చేసింది.
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో దర్శకుడు శంకర్ 'ఇండియన్ 2' సినిమాను మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి ఏదొక అడ్డంకి వస్తూనే ఉంది. షూటింగ్ స్పాట్ లో క్రేన్ యాక్సిడెంట్, కమల్ రాజకీయాల్లో బిజీ అవ్వడం, నిర్మాతలతో దర్శకుడి గొడవ.. ఈ కారణాల వలన సినిమా షూటింగ్ ఆలస్యమవుతోంది. దీంతో శంకర్.. రామ్ చరణ్ తో సినిమాను మొదలుపెట్టేశారు. దీంతో కమల్ సినిమాను లైట్ తీసుకున్నారని అందరూ అనుకున్నారు.
ఫైనల్ గా 'ఇండియన్ 2' నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.. శంకర్ తో రాజీకి వచ్చింది. దీంతో సినిమా పూర్తి చేయడానికి శంకర్ ఒప్పుకున్నారు. అయితే రామ్ చరణ్ సినిమా పూర్తయ్యే వరకు కమల్ సినిమా మొదలవ్వదనే మాటలు వినిపించాయి. కానీ ఇప్పుడు శంకర్.. 'ఇండియన్ 2' సినిమాను పునః ప్రారంభించబోతున్నారని తెలుస్తోంది. కొంతకాలం పాటు రామ్ చరణ్ సినిమాను హోల్డ్ లో పెట్టి కమల్ సినిమాను పూర్తి చేయాలనుకుంటున్నారు.
వచ్చే నెల నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఇదే విషయాన్ని హీరోయిన్ కాజల్ కూడా కన్ఫర్మ్ చేసింది. ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ సినిమాలను దూరమైంది. ఇప్పుడు బిడ్డ పుట్టడంతో తిరిగి మళ్లీ ముఖానికి మేకప్ వేసుకోబోతుంది. 'ఇండియన్ 2' సినిమాలో ముందుగా రకుల్, కాజల్ లను హీరోయిన్లుగా తీసుకున్నారు. కాజల్ గర్భవతి కావడంతో ఆమె సినిమా నుంచి తప్పుకుందనే వార్తలొచ్చాయి. అయితే షూటింగ్ లో ఆలస్యం జరగడం కాజల్ కి కలిసొచ్చింది.
ఇప్పుడు కాజల్ నటించడానికి సిద్ధంగా ఉండడంతో కమల్ సెట్స్ లో జాయిన్ అవ్వబోతుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన కాజల్.. 'ఇండియన్2' సినిమాలో నటించబోతున్నట్లు, కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నట్లు చెప్పింది. అంటే ఈ సినిమాతో ఆమె ఎంట్రీ ఖాయమన్నమాట!
Also Read: మళ్ళీ నిఖిల్‌ను వెనక్కి పంపారు - ఆగస్టు 12న కాదు, తర్వాత రోజున 'కార్తికేయ 2'
Also Read: నాగ చైతన్య నవ్వితే డేటింగ్‌లో ఉన్నట్టేనా? ఆమెతో ప్రేమ నిజమేనా?
View this post on Instagram