Maestro: ఎందుకు చంపుతోంది? తమన్నాను విలన్‌గా చూసి చిన్నారి ఏడుపు.. వీడియో ట్వీట్ చేసిన నితిన్
తమన్నాను విలన్‌గా చూసి ఓ చిన్నారి తట్టుకోలేకపోయింది. ఆ సినిమాలో ఆమె హత్యలు చేయడం చూసి ఏడ్చేసింది.
నితిన్ హీరోగా నటించిన ‘మాస్ట్రో’ సినిమా శుక్రవారం ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా నెగటివ్ రోల్‌లో కనిపిస్తుంది. చాలా కూల్‌గా హత్యలు చేస్తూ.. హీరోని ఇబ్బంది పెడుతుంది. అయితే, ఇన్ని రోజులు తమన్నాను హీరోయిన్‌గా చూసిన అభిమానులు ఆమెను విలన్‌గా చూడటం కాస్త కష్టమే. కానీ, తమన్నా నటన చూసిన తర్వాత తప్పకుండా వాహ్వా అని అంటారు.
అయితే, తమన్నాను విలన్‌గా చూసి ఓ చిన్నారి తట్టుకోలేకపోయింది. ఆ సినిమాలో ఆమె హత్యలు చేయడం చూసి ఏడ్చేసింది. ఆ వీడియోను హీరో నితిన్‌ను తమన్నాకు ట్వీట్ చేశాడు. ‘‘వాట్ యా.. నీ అభిమాని ఏడిపించావ్. ఈ రోజు నేను చూసి క్యూట్ వీడియో ఇది. గాంధీ(దర్శకుడు) చిన్న కూతురు లిపి.. నీకు పెద్ద అభిమాని’’ అని నితిన్ పేర్కొన్నాడు.
ఈ వీడియోలో ఉన్న చిన్నారిని ఎందుకు ఏడుస్తున్నావ్ అని ప్రశ్నిస్తే.. ‘‘గాంధీ తమన్నా బ్రెయిన్ మార్చేశాడు. ఎందుకు అందర్నీ చంపుతుంది?’’ అంటూ ఏడ్చేసింది. ఇంట్లోవారు.. ‘‘అది సినిమా కదా..’’ అని చెబుతూ ఓదార్చారు. ఆ చిన్నారి తమన్నాకు ఫ్యాన్ కావడం వల్ల.. ఆమెను విలన్‌గా చూడలేకపోయిందని అర్థమవుతుంది. ఈ వీడియోపై తమన్నా కూడా వెంటనే స్పందించింది. ‘‘OMG.. ఆలస్యం చేయకుండా ఈ చిన్నారికి తప్పకుండా హగ్ ఇవ్వాల్సిందే’’ అని తెలిపింది. దీంతో ఆమె అభిమానులు కూడా కొంటెగా సమాధానమిస్తున్నారు. ‘‘మేం కూడా ఏడుస్తాం.. హగ్ ఇవ్వు’’ అని అంటున్నారు.
మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. నితిన్, తమన్నాల నటనకు అంతా ఫిదా అవుతున్నారు. రివ్యూలు కూడా పాజిటివ్‌గా రావడంతో నితిన్ హిట్ కొట్టినట్లే. అయితే, ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడం వల్ల అందరికీ చూసే అవకాశం లభించకపోవచ్చు. బాలీవుడ్‌లో సూపర్ హిట్ సాధించిన ‘అంధదూన్’ సినిమాను తెలుగులో ‘మాస్ట్రో’గా తెరకెక్కించిన సంగతి తెలిసింది. హిందీలో టబూ పోషించిన పాత్రలో తమన్నా నటించింది. ఇందులో హీరోకు చూపు ఉండదు. మరి అంధుడైన హీరోను తమన్నా ఎందుకు వెంబడిస్తుంది? అతడిని ఎందుకు చంపాలనుకుంటుందనేది తెరపైనే చూడాలి. ప్రస్తుతం తమన్నా మంచి ఊపు మీద ఉంది. గోపిచంద్‌తో నటించిన ‘సీటీ మార్’ చిత్రం కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. ఇందులో కూడా తమన్నా పాత్రకు ప్రాధాన్యం ఉంది. అలాగే మంచి హిట్ కోసం చూస్తున్న నితిన్‌కు సైతం ‘మాస్ట్రో’ ఊరటనిచ్చినట్లే.
Also Read: ‘మాస్ట్రో’ రివ్యూ - చెడగొట్టకుండా.. సంతృప్తినిచ్చే రీమేక్ వంటకం!