News
News
X

Maestro Review: ‘మాస్ట్రో’ రివ్యూ - చెడగొట్టకుండా.. సంతృప్తినిచ్చే రీమేక్ వంటకం!

నితిన్ మాస్ట్రో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘అంధాధున్’ చిత్రానికి రీమేక్ ఇది. శుక్రవారం ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది?

FOLLOW US: 

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ మాస్ట్రో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బాలీవుడ్‌లో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ‘అంధాధున్’ చిత్రానికి తెలుగు రీమేక్ ఇది. ఈ సంవత్సరం నితిన్ నటించిన చెక్, రంగ్‌దే చిత్రాలు విడుదలై ప్రేక్షకులను నిరాశ పరిచాయి. దీంతో నితిన్ కెరీర్‌కు కూడా ఈ సినిమా కీలకంగా మారింది. రీమేక్ అనగానే తప్పకుండా ప్రేక్షకులు.. ఒరిజినల్ సినిమాతో కంపేర్ చేస్తారు. పైగా హిందీ చిత్రంలో ఆయుష్మాన్ ఖురానా అంధుడిగా జీవించేశాడు. దీంతో నితిన్‌కు ఈ చిత్రం పెద్ద సవాల్ అనే చెప్పుకోవాలి. మరి శుక్రవారం ‘డిస్నీ ప్లస్ హాట్ స్టార్’ ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పిస్తుందా? నితిన్ అంధుడిగా ఆకట్టుకున్నాడా? 

కథ: కళ్లు కనిపించని ఓ కుందేలు.. కాలిఫ్లవర్ తోటను నాశనం చేస్తున్న సీన్‌తో ఈ స్టోరీ మొదలవుతుంది. అక్కడ కాపాలాగా ఉండే వ్యక్తి దాన్ని గన్‌తో షూట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. దీంతో అది అక్కడి నుంచి తప్పించుకుని రోడ్డు మీదకు వెళ్తుంది. గన్ షాట్ తర్వాత కారు యాక్సిడెంట్‌కు గురైన శబ్దం వినిపిస్తుంది. అయితే, సీన్‌‌ను సస్పెన్స్‌గా ఉంచారు. ఆ తర్వాత అరుణ్ (నితిన్) పియానో వాయించే సీన్‌తో అసలు కథ మొదలవుతుంది. అరుణ్ 14 ఏళ్ల వయస్సులోనే క్రికెట్ బాల్ తగిలి చూపు కోల్పోతాడు. అప్పటి నుంచి పియానో వాయిస్తూ జీవనోపాధి కోసం ప్రయత్నిస్తుంటాడు. తన పియానో పాడైపోవడంతో ఓ రెస్టారెంట్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉన్న పియానో కొనడానికి వెళ్తాడు. అక్కడ అరుణ్‌కు రెస్టారెంట్ యజమాని కుమార్తె సోఫి(నభా నటేష్)తో పరిచయం ఏర్పడుతుంది. అలా ఇద్దరూ ప్రేమలో పడతారు. సోఫి రెస్టారెంట్‌లోనే పియానో వాయిస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటాడు అరుణ్.

ఈ కథకు సమాంతరంగా మోహన్(సీనియర్ నరేష్), అతని భార్య సిమ్రన్(తమన్నా)ల కథ కూడా నడుస్తూ ఉంటుంది. భార్య చనిపోయిన సినీనటుడు మోహన్, సిమ్రన్‌ను రెండో పెళ్లి చేసుకుంటాడు. తనకి మొదటి భార్య ద్వారా పుట్టిన కూతురు పవిత్ర(అనన్య నాగళ్ల). అయితే సిమ్రన్‌కు వెండితెర మీద వెలిగిపోవాలని కోరిక. ఒకరోజు అరుణ్ సోఫీ రెస్టారెంట్‌కు వెళ్తాడు. అక్కడ అరుణ్ పియానో వాయించడం చూసి తమ పెళ్లిరోజున ఇంట్లో ప్రైవేట్ కాన్సర్ట్ ఇవ్వమని చెప్పి అడ్రస్, వెళ్లాల్సిన టైం చెప్పి వెళ్లిపోతాడు. దీంతో అరుణ్.. మోహన్ వాళ్ల ఇంటికి వెళతాడు. అక్కడ అతనికి కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి? ఆ సంఘటనలు ఏంటి? ఆ తర్వాత తన జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అసలు అరుణ్ నిజంగా అంధుడేనా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం మేం చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది.

విశ్లేషణ: ఈ సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్ క్యాస్టింగ్. ఒరిజినల్ వెర్షన్ అంధాధున్‌లో టబు చేసిన పాత్రకు తమన్నాను ఎంచుకోవడం సినిమాకు ప్లస్ అయింది. తనతో పాటు జిషుసేన్ గుప్తా, మంగ్లీ, హర్ష, రచ్చ రవి, శ్రీముఖిలు తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. దీనికి సంబంధించిన మరో ప్లస్ పాయింట్ నేపథ్య సంగీతం. మహతి స్వరసాగర్ అందించిన పాటలు సోసోగానే ఉన్నా.. నేపథ్య సంగీతం మాత్రం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. సినిమా నిడివి కూడా 2 గంటల 15 నిమిషాలు మాత్రమే.

రీమేక్ సినిమాలతో వచ్చిన చిక్కేంటంటే.. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నితిన్ చెప్పినట్లు ఉన్నది ఉన్నట్లు తీస్తే ఇంకేం చేశారు వీళ్లు అంటారు. కాస్త మార్చి తీస్తే చెడగొట్టారు అంటారు. ఒకవేళ మార్పులు చేసినా అవి మాతృకను మించేలా ఉండాలి. ఉదాహరణకు బాలీవుడ్ సినిమా బద్లాను తెలుగులో ‘ఎవరు’గా రీమేక్ చేసినప్పటికీ.. అందులో ఎన్నో మార్పులను ఆకట్టుకునే విధంగా చేశారు. ఇక ఈమధ్యే వకీల్ సాబ్‌లో కూడా ఆఫ్‌బీట్ సినిమాను కోర్ పాయింట్ తీసుకుని, కమర్షియలైజ్ చేశారు. నితిన్ మాస్ట్రో సరిగ్గా పైన చెప్పిన రెండు కేటగిరీలకు మధ్యలో నిలుస్తుంది. ఉన్నది ఉన్నట్లుగా తీస్తూనే.. చిన్న చిన్న మార్పులు చేశారు. దీంతో ఈ సినిమా అంధాధున్ చూసేసిన వారిని పూర్తిగా సంతృప్తి పరచకపోయినా నిరాశకు కూడా గురి చేయదు. అంధాధున్ చూడనివారికి మాత్రం నచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో దర్శకుడు మేర్లపాక గాంధీకి పూర్తి మార్కులు వేయవచ్చు. కథలో సోల్ మిస్ కాకుండా, అనవసరపు హంగామాలకు పోకుండా ఈ సినిమాను బాగా డీల్ చేశాడు. 

నటీనటుల విషయానికి వస్తే.. నితిన్ తన పాత్రకు న్యాయం చేశాడు. నిజానికి ఇది నితిన్ ఇమేజ్‌కు తగ్గ కథ కాదు. కడుపుబ్బా నవ్వించే కామెడీ, కళ్లు చెదిరే యాక్షన్ ఇందులో ఉండవు. అయినా తనలోని నటుడిని బయటకు తీసుకురావడం కోసమే ఈ సినిమా ఒప్పుకున్నట్లు తెలుస్తుంది. నితిన్ కెరీర్‌లో బెస్ట్ పెర్ఫార్మెన్స్‌ల్లో ఒకటిగా ఈ సినిమా కచ్చితంగా నిలుస్తుంది. ఇక నితిన్ తర్వాత అంత ముఖ్యమైన పాత్ర తమన్నాదే. ఇప్పటివరకు చూసిన సినిమాలతో పోలిస్తే.. ఇందులో కచ్చితంగా ఒక కొత్త తమన్నాను చూస్తారు. ఇంత నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషించడం తమన్నాకు కూడా ఇదే మొదటిసారి. ఇక మిగతావారు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఇక ఫైనల్‌గా చెప్పాలంటే.. ఇప్పటికే అంధాధున్ చూసేసిన వారికి ఈ సినిమా సోసోగా అనిపించవచ్చు. అయితే నేరుగా తెలుగులో చూసేవారికి మాత్రం కచ్చితంగా కొత్త అనుభవాన్ని అందిస్తుంది. 

Published at : 17 Sep 2021 10:44 AM (IST) Tags: Nithiin Nabha Natesh Maestro Tamanna Maestro Review Telugu New Movie Review

సంబంధిత కథనాలు

Mahesh Babu : పగ వాళ్ళకు సైతం మహేష్ బాబుకు వచ్చిన కష్టం రాకూడదు - కంటతడి పెట్టిస్తున్న సితార భావోద్వేగం

Mahesh Babu : పగ వాళ్ళకు సైతం మహేష్ బాబుకు వచ్చిన కష్టం రాకూడదు - కంటతడి పెట్టిస్తున్న సితార భావోద్వేగం

Chiranjeevi : చిరు పుత్రోత్సాహం - రామ్ చరణ్ 15 ఇయర్స్ కెరీర్‌పై ట్వీట్

Chiranjeevi : చిరు పుత్రోత్సాహం - రామ్ చరణ్ 15 ఇయర్స్ కెరీర్‌పై ట్వీట్

Coffee With A Killer : గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన ఆర్పీ పట్నాయక్ - కిల్లర్ కథతో ఎంట‌ర్‌టైనింగ్ థ్రిల్ల‌ర్‌

Coffee With A Killer : గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన ఆర్పీ పట్నాయక్ - కిల్లర్ కథతో ఎంట‌ర్‌టైనింగ్ థ్రిల్ల‌ర్‌

Vishnu Manchu - Ginna Title Song : నాతో పెట్టుకుంటే ఊరుకోను, నాకు ఎవరు సాటి లేరు - వచ్చిండు చూడు మన 'జిన్నా' భాయ్

Vishnu Manchu - Ginna Title Song : నాతో పెట్టుకుంటే ఊరుకోను, నాకు ఎవరు సాటి లేరు - వచ్చిండు చూడు మన 'జిన్నా' భాయ్

Bigg Boss 6 Telugu: బీబీ హోటల్‌లో గొడవలు మొదలు, బాత్రూమ్‌లు వాడడానికి వీల్లేదు

Bigg Boss 6 Telugu: బీబీ హోటల్‌లో గొడవలు మొదలు, బాత్రూమ్‌లు వాడడానికి వీల్లేదు

టాప్ స్టోరీస్

Viral Video: వీడెవడండి బాబు, హైటెన్షన్ వైర్లపై సర్కస్ ఫీట్లు - చూసిన వారికి ముచ్చెమటలు

Viral Video: వీడెవడండి బాబు, హైటెన్షన్ వైర్లపై సర్కస్ ఫీట్లు - చూసిన వారికి ముచ్చెమటలు

PD ACT Rajasingh : రాజాసింగ్‌కు మరో చాన్స్ - గురువారమే పీడీయాక్ట్ అడ్వయిజరీ బోర్డు భేటీ !

PD ACT Rajasingh :  రాజాసింగ్‌కు మరో చాన్స్ - గురువారమే పీడీయాక్ట్ అడ్వయిజరీ బోర్డు భేటీ !

Leharaayi Movie - Apsara Song : అప్సరస... అప్సరస... నా కంటే ఎందుకు పడ్డావే?

Leharaayi Movie - Apsara Song : అప్సరస... అప్సరస... నా కంటే ఎందుకు పడ్డావే?

Tejaswini Gowda Photos: తేజస్విని గౌడ స్టైలిష్ లుక్ చూశారా!

Tejaswini Gowda Photos: తేజస్విని గౌడ స్టైలిష్ లుక్ చూశారా!