Maruthi About Prabhas Movie: ప్రభాస్‌తో సినిమా... కాదని చెప్పలేదు! అలాగని, కన్ఫర్మ్ చేయలేదు!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో డీవీవీ దానయ్య ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారనే సంగతి తెలిసిందే. దీని గురించి మారుతి ట్వీట్ చేశారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో డీవీవీ మూవీస్ పతాకంపై డీవీవీ దానయ్య ఓ సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. హారర్ కామెడీ జానర్‌లో రూపొందే ఆ సినిమాకు 'రాజు డీలక్స్' టైటిల్ కూడా ఖరారు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రభాస్ 'సలార్', 'ప్రాజెక్ట్ కె' షూటింగ్స్ చేస్తున్నారు. వీటి తర్వాత 'స్పిరిట్' చేయడానికి అంగీకరించారు. అయితే... 'స్పిరిట్' కంటే ముందు, ఈ వేసవి తర్వాత మారుతి సినిమాను సెట్స్ మీదకు తీసుకు వెళ్లాలని ప్రభాస్ భావిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.
ప్రభాస్ - మారుతి కాంబినేషన్ అనగానే చాలా మంది సర్‌ప్రైజ్ అయ్యారు. అటు హీరో నుంచి గానీ, దర్శక - నిర్మాతల నుంచి గానీ ఎటువంటి అధికారిక ప్రకటన రాకుండా వార్త బయటకు వచ్చేసింది. ఈ నేపథ్యంలో 'రాజు డీలక్స్' సినిమా గురించి మారుతి ట్వీట్ చేశారు.
Also Read: మారుతి దర్శకత్వంలో ప్రభాస్... జానర్, టైటిల్ ఏంటంటే?
"నా భవిష్యత్తులో చేయబోయే సినిమాలు, టైటిళ్లు, జానర్లు, సంగీత దర్శకుల గురించి చాలా ఊహాగానాలు నడుస్తున్నాయి. అయితే... కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది. ప్రతి ఒక్కరూ అందిస్తున్న మద్దతుకు, ప్రోత్సాహానికి థాంక్స్" అని మారుతి ట్వీట్ చేశారు. అయితే... ట్వీట్‌లో ఎక్కడా ప్రభాస్‌తో సినిమా చేయడం లేదని చెప్పలేదు. అలాగని, అవునని కూడా కన్ఫర్మ్ చేయలేదు.
There are too many speculations about my future projects, titles, genres, music directors and crew etc.
— Director Maruthi (@DirectorMaruthi) January 22, 2022
But Time will reveal everything.
Thank you to everyone for your support and encouragement
Take care and stay safe 😷
Also Read: AAGMC Teaser: దర్శకుడిగా సుధీర్ బాబు... డాక్టర్‌గా కృతి శెట్టి! ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే?
Also Read: కన్నీళ్లు పెట్టుకున్న మహేష్ బాబు.. రమేష్ బాబు పిల్లలను చూసి భావోద్వేగం
Also Read: పన్నెండు వారాల ముందుగానే... ప్రియాంకా చోప్రా పాప గురించి ఈ సంగతులు తెలుసా?
Also Read: మెగా హీరోపై 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ ఎఫెక్ట్... ఏయే సినిమాలు వెనక్కి వెళ్లొచ్చు?
Also Read: మహేష్ బాబుకు కేబీఆర్ పార్క్ అంటే ఎందుకు భయం?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి