అన్వేషించండి
Advertisement
AAGMC Teaser: దర్శకుడిగా సుధీర్ బాబు... డాక్టర్‌గా కృతి శెట్టి! ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే?
'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' అని హీరో సుధీర్ బాబు అంటున్నారు. ఆ అమ్మాయి ఎవరో తెలుసు కదా! కృతి శెట్టి! ఈ సినిమా టీజర్ చూశారా?
హీరో సుధీర్ బాబు, దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటిది సూపర్ హిట్ కాంబినేషన్. ఇద్దరి కలయికలో వచ్చిన 'సమ్మోహనం' ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత చేసిన 'వి' ఓటీటీలో విడుదలైంది. కొందరికి నచ్చింది. మరి కొందరికి నచ్చలేదు. మిశ్రమ స్పందన లభించింది. అయితే... అందులో సుధీర్ బాబును ప్యాక్డ్ బాడీలో చూపించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు వీళ్లిద్దరి కలయికలో రూపొందుతున్న మూడో సినిమా 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి'. ఇందులోసుధీర్ బాబు సరసన కృతి శెట్టి నటిస్తున్నారు. వీళ్లిద్దరూ జంటగా నటిస్తున్న తొలి చిత్రమిది. ఈ రోజు టీజర్ విడుదల చేశారు.
టీజర్ చూస్తే... సుధీర్ బాబు దర్శకుడి పాత్ర చేశారు. డాక్టర్ అలేఖ్య పాత్రలో కృతి శెట్టి కనిపించారు. 'రోల్ సౌండ్... రోల్ కెమెరా... యాక్షన్' అని సుధీర్ బాబు చెప్పే డైలాగ్‌తో సినిమా టీజర్ ప్రారంభం అయ్యింది. ఆరు సంవత్సరాల్లో ఆరు సూపర్ హిట్ సినిమాలు తీసిన దర్శకుడిగా హీరోని పరిచయం చేశారు. ఆ తర్వాత సినిమా మీద రాహుల్ రామకృష్ణ క్యారెక్టర్ చేత 'తీశావ్ లేవోయ్ బోడి. అదే అనాథ హీరో, అదే బుర్ర బట్టలు లేని హీరోయిన్, అదే గొంతులో మాట్లాడే విలన్. అర్థం పర్థం లేని పాటలు' అంటూ కమర్షియల్ ఫార్ములా సినిమాలపై సెటైర్స్ వేయించారు. అటువంటి సినిమాలు తీసిన హీరో... 'ఓ బ్యూటిఫుల్ ప్రిన్సెస్ లాంటి అమ్మాయి చుట్టూ జరిగే కథ తీద్దామని అనుకుంటున్నాను' అని హీరో డైలాగ్ చెప్పిన తర్వాత హీరోయిన్ కృతి శెట్టిని పరిచయం చేశారు. ఆమెది డాక్టర్ రోల్. ఆ డాక్టర్‌ను, సినిమాలు అంటే పడని అమ్మాయిని హీరో సినిమాల్లోకి ఎలా తీసుకొచ్చాడనేది కథగా తెలుస్తోంది.
'ఇన్ని రోజులు నన్ను నేను అమ్ముకుని సినిమాలు తీశాను. మొదటిసారి నన్ను నేను నమ్ముకుని సినిమా తీద్దామని అనుకుంటున్నాను' అని సుధీర్ బాబు చెప్పే డైలాగ్, సినిమాలో హీరో ఎమోషన్ తెలియజేస్తోంది.
Just a peek into the story I've been waiting to tell you… 😊#AaAmmayiGurinchiMeekuCheppali#AAGMCTeaser
— Sudheer Babu (@isudheerbabu) January 22, 2022
Chusi ela undho cheppandi 😀#IndragantiMohanaKrishna@IamKrithiShetty @MythriOfficial @benchmarkstudi5 @pgvinda @oddphyscehttps://t.co/RU8EdTNca2
గాజులపల్లె సుధీర్ బాబు సమర్పణలో బి. మహేంద్ర బాబు, కిరణ్ బల్లపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ భాగస్వామి. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, 'వెన్నెల' కిషోర్, రాహుల్ రామకృష్ణ, గోపరాజు రమణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
Also Read: పన్నెండు వారాల ముందుగానే... ప్రియాంకా చోప్రా పాప గురించి ఈ సంగతులు తెలుసా?
Also Read: మెగా హీరోపై 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ ఎఫెక్ట్... ఏయే సినిమాలు వెనక్కి వెళ్లొచ్చు?
Also Read: కల నెరవేరింది... సొంతింట్లో అడుగుపెట్టిన పూజా హెగ్డే
Also Read: మహేష్ బాబుకు కేబీఆర్ పార్క్ అంటే ఎందుకు భయం?
Also Read: గౌతమ్ నా అరచేయంతే ఉండేవాడు... ఆ పరిస్థితి ఎవరికి రాకూడదనే... మహేష్ బాబు
Also Read: మారుతి దర్శకత్వంలో ప్రభాస్... జానర్, టైటిల్ ఏంటంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also Read: మెగా హీరోపై 'ఆర్ఆర్ఆర్' రిలీజ్ ఎఫెక్ట్... ఏయే సినిమాలు వెనక్కి వెళ్లొచ్చు?
Also Read: కల నెరవేరింది... సొంతింట్లో అడుగుపెట్టిన పూజా హెగ్డే
Also Read: మహేష్ బాబుకు కేబీఆర్ పార్క్ అంటే ఎందుకు భయం?
Also Read: గౌతమ్ నా అరచేయంతే ఉండేవాడు... ఆ పరిస్థితి ఎవరికి రాకూడదనే... మహేష్ బాబు
Also Read: మారుతి దర్శకత్వంలో ప్రభాస్... జానర్, టైటిల్ ఏంటంటే?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
న్యూస్
ఓటీటీ-వెబ్సిరీస్
ఆటో
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion