Pooja Hegde: కల నెరవేరింది... సొంతింట్లో అడుగుపెట్టిన పూజా హెగ్డే
పూజా హెగ్డే శుక్రవారం నాడు సొంతింట్లో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా తన కల నెరవేరిందని ఎమోషనల్ పోస్ట్ చేశారు.
సొంతిల్లు... చాలా మంది కల. తమకంటూ, తమకు నచ్చిన రీతిలో ఇల్లు కట్టుకోవాలని చాలా మంది కలలు కంటారు. అందుకు, సెలబ్రిటీలు కూడా అతీతం ఏమీ కాదు. వారి కలలు, కోరికలు వారికి ఉంటాయి. బుట్ట బొమ్మ పూజా హెగ్డే కూడా తనకు నచ్చినట్టు ముంబైలో ఇల్లు కట్టించుకున్నారు. శుక్రవారం నాడు ఆ ఇంట్లో అడుగు పెట్టారు. గృహ ప్రవేశం సందర్భంగా దిగిన ఫొటోను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేశారు.
"నా కలలన్నీ నెరవేరినందుకు ఏడాది నుంచి కృతజ్ఞతతో ఉంటున్నాను. మిమ్మల్ని మీరు నమ్మండి, కష్టపడి పని చేయండి. నిజంగా ఈ ప్రపంచం మీతో ప్రేమలో పడుతుంది" అని పూజా హెగ్డే పేర్కొన్నారు. ఏడాది క్రితమే ఈ ఇంటి పనులు ప్రారంభించినట్టు తెలుస్తోంది. గృహ ప్రవేశం చేసిన సందర్భంగా నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
View this post on Instagram
ఇక సినిమాలకు వస్తే... ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన 'రాధే శ్యామ్' విడుదలకు రెడీగా ఉంది. అలాగే, రామ్ చరణ్‌కు జోడీగా ఆమె కనిపించిన 'ఆచార్య' కూడా! తమిళంలో విజయ్ సరసన 'బీస్ట్', హిందీలో రణ్‌వీర్ సింగ్‌కు జోడీగా 'సర్కస్' సినిమాలు చేస్తున్నారు పూజా హెగ్డే. ఆ రెండూ సెట్స్ మీద ఉన్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో రూపొందనున్న సినిమాలో కూడా పూజా హెగ్డే హీరోయిన్.
Also Read: మహేష్ బాబుకు కేబీఆర్ పార్క్ అంటే ఎందుకు భయం?
Also Read: గౌతమ్ నా అరచేయంతే ఉండేవాడు... ఆ పరిస్థితి ఎవరికి రాకూడదనే... మహేష్ బాబు
Also Read: మారుతి దర్శకత్వంలో ప్రభాస్... జానర్, టైటిల్ ఏంటంటే?
Also Read: సరోగసి ద్వారా తల్లిదండ్రులైన ప్రియాంక నిక్ దంపతులు
Also Read: ఎవడో ఏదో థంబ్‌నైల్ పెట్టి రాసుకుంటున్నాడు... - లాస్య కన్నీరు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి