అన్వేషించండి

Dil Raju Dheera Movie: 'దిల్' రాజు చేతికి 'ధీర' నైజాం, విశాఖ

భారీ సినిమాలతో పాటు చిన్న సినిమాలను సైతం దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు. ఈ శుక్రవారం విడుదల కానున్న ఓ సినిమాను నైజాంలో ఆయన పంపిణీ చేస్తున్నారు.

'దిల్' రాజు అగ్ర నిర్మాత మాత్రమే కాదు... పంపిణీదారుడు కూడా! నైజాంతో పాటు విశాఖ ఏరియాలో సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. 'దిల్' రాజుది లక్కీ హ్యాండ్ అని భావించే హీరోలు, దర్శక - నిర్మాతలు ఉన్నారు. తెలుగులో ఆయన బ్రాండ్ వేల్యూ తెలిసిందే. 'దిల్' రాజు చేతిలో పడితే సినిమా హిట్ అని కొందరు ఫిక్స్ అయ్యే రోజులు ఇవి. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్‌గా ఆయనకు ఉన్న అనుభవం అటువంటిది. భారీ సినిమాలతో పాటు చిన్న సినిమాలను కూడా ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఈ శుక్రవారం విడుదలకు సిద్ధమైన ఓ చిన్న సినిమాను ఆయన డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. 

'దిల్' రాజు చేతికి లక్ష్ 'ధీర'
లక్ష్ చదలవాడ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'ధీర'. ఇందులో నేహా పఠాన్, సోనియా బన్సాల్ హీరోయిన్లు. 'వలయం', 'గ్యాంగ్‌ స్టర్ గంగరాజు' తర్వాత లక్ష్ నటించిన చిత్రమిది. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర పతాకంపై పద్మావతి చదలవాడ నిర్మించారు. ఫిబ్రవరి 2న సినిమా విడుదల కానుంది. 

'ధీర'ను నైజాం, విశాఖ ఏరియాల్లో 'దిల్' రాజు విడుదల చేయనున్నారు. సినిమా యూనిట్ దాంతో ఫుల్ హ్యాపీగా ఉంది. విడుదలకు ముందు తమ 'ధీర' హిట్ అని సంబరపడుతోంది. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని, సినిమాకు సైతం అదే స్పందన వస్తుందని ఆశిస్తున్నామని దర్శక నిర్మాతలు పేర్కొన్నారు.

Also Read: దర్శకుడికి అవార్డు రాలేదు. కానీ, ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో దుమ్ము లేపిన 'యానిమల్'... భార్యాభర్తలు రణబీర్, అలియాతో పాటు ఎవరెవరికి అవార్డులు వచ్చాయో చూడండి!

Dil Raju Dheera Movie: 'దిల్' రాజు చేతికి 'ధీర' నైజాం, విశాఖ

'ధీర' ట్రైలర్ చూస్తుంటే... ఇదొక యాక్షన్ ఎంటర్టైనర్ అని అర్థం అవుతోంది. 'రాజ్‌ గురుని మన అటాక్ నుంచి కాపాడాలంటే... రథం నడిపే కృష్ణుడితో పాటు యుద్ధం చేసే రాముడు రావాలి. ఎవడైనా ఉన్నాడా?' అని క్యారెక్టర్ ఆర్టిస్ట్ డైలాగ్ వచ్చిన తర్వాత... ''వాడి పేరు రణధీర్.. 6.2 ఉంటాడు'' అని లక్ష్ చదలవాడను పరిచయం చేశారు. 'వాడు ఎటాక్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? భూకంపం తర్వాత భూమిలా ఉంటుంది' అంటూ హీరోకి ఎలివేషన్ ఇచ్చారు. 'నేను యుద్ధం చేయడం ఏంట్రా? యుద్ధమే మిమ్మల్ని వెంటాడుతూ... వేటాడుతూ వస్తోంది. 25 లక్షలతో మొదలైన నా జర్నీ రూ. 2500 కోట్లకు  చేరింది' ట్రైలర్ చివరలో హీరో చెప్పే మాటతో మరింత ఆసక్తి పెంచారు.

Also Readపాన్ ఇండియా సినిమాలో శ్రీ లీలకు ఛాన్స్ - ఆ స్టార్ హీరోతో రొమాన్స్?

లక్ష్ చదలవాడ హీరోగా నేహా పఠాన్, సోనియా బన్సాల్ హీరోయిన్లుగా నటించిన 'ధీర' సినిమాలో 'మిర్చి' కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, 'వైవా' రాఘవ, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమాకు కూర్పు: వినయ్ రామస్వామి, ఫైట్ మాస్టర్: జాషువా - 'వింగ్ చున్' అంజి, ఛాయాగ్రహణం: కన్నా పీసీ, సంగీతం: సాయి కార్తీక్, సమర్పణ: చదలవాడ బ్రదర్స్, నిర్మాణ సంస్థ: బ్యానర్: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్, నిర్మాత: పద్మావతి చదలవాడ, రచన - దర్శకత్వం: విక్రాంత్ శ్రీనివాస్.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Jani Master: జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
జానీ మాస్టర్ కు పెరుగుతున్న మద్దతు, నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Siyaram Baba Viral Video 188 Years | 188ఏళ్ల సాధువు అంటూ వైరల్ అవుతున్న వీడియో | ABP DesamRK Roja on CM Chandrababu | పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య కేసుపై మాజీ మంత్రి ఆర్కే రోజా | ABP DesamTirumala Bramhotsavam Simha vahanam | యోగ నారసింహుడి అలంకారంలో తిరుమల శ్రీవారు | ABP DesamPrakash Raj Counters Pawan Kalyan | తమిళనాడులో పవన్ కళ్యాణ్ పరువు తీసిన ప్రకాశ్ రాజ్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
వరద బాధితులకు పరిహారం - ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
Punganuru Child Murder: వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
వీడిన పుంగనూరు చిన్నారి హత్య మిస్టరీ - ఆర్థిక లావాదేవీలే కారణం, బాధిత కుటుంబసభ్యులకు సీఎం చంద్రబాబు ఫోన్
Harish Rao: బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
బోనస్ బోగస్ చేశారు, రెండు లక్షల ఉద్యోగాలకు అతీగతీ లేదు: హరీశ్ రావు
Jani Master: జానీ మాస్టర్ కు నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
జానీ మాస్టర్ కు పెరుగుతున్న మద్దతు, నేషనల్ అవార్డు రద్దుపై స్పందించిన ఆట సందీప్
Pawan Kalyan: 3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
3 నెలలుగా జీతాలు వస్తలేవు, పవన్ కళ్యాణ్‌కు షాకిచ్చిన ఆయన శాఖల ఉద్యోగులు
Telangana: 20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
20-25 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
ఏపీలో దారుణాలు - ఓ చోట స్థల వివాదంతో సొంత బాబాయ్ హత్య, మరోచోట తమ్ముడిని కత్తితో నరికేసిన అన్న
Secunderabad To Goa Train: హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
హైదరాబాద్ నుంచి గోవా వెళ్లేవారికి గుడ్ న్యూస్- కొత్త రైలు ప్రారంభించిన కిషన్ రెడ్డి
Embed widget