సినిమాలతో అనసూయ ఫుల్ బిజీ. అయితే... షూటింగ్స్ మధ్యలో కొంత టైం తీసుకుని హాలిడే ట్రిప్ వేశారు. హాలిడే అంటే మస్తీ మజా అండ్ ఎంజాయ్‌మెంట్ కామన్ కదూ! అనసూయ సైతం ఫుల్ ఖుషీగా ఎంజాయ్ చేష్టున్నారు. ఫ్యామిలీకి ఫుల్ టైమ్ ఇచ్చే నటీమణులలో అనసూయ ఒకరు. ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయరు. ప్రజెంట్ అనసూయ వెళ్లిన హాలిడే ట్రిప్ కూడా ఫ్యామిలీతోనే! యస్... ఇది ఫ్యామిలీ వెకేషన్ అన్నమాట. అనసూయతో పాటు భర్త శశాంక్, ఇంకా ఇద్దరు అబ్బాయిలు ఆయాన్ష్, శౌర్య కూడా ఉన్నారు. అనసూయ హాలిడే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆమె అందం ఏముందంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. 'జబర్దస్త్' షోతో అనసూయకు ఫుల్ పాపులారిటీ వచ్చింది. అయితే, ప్రజెంట్ ఆమె ఆ షో చేయడం లేదు. ఇప్పుడు అనసూయ వరుసగా సినిమాలు చేస్తున్నారు. 'పుష్ప' సీక్వెల్ 'పుష్ప 2' అందులో ముఖ్యమైనది. అనసూయకు తమిళ, మలయాళ సినిమాల నుంచి సైతం ఆఫర్లు వస్తున్నాయి. అనసూయ ఫోటోలు (all images courtesy: itsme_anasuya /instagram)