అన్వేషించండి

Sreeleela: పాన్ ఇండియా సినిమాలో శ్రీ లీలకు ఛాన్స్ - ఆ స్టార్ హీరోతో రొమాన్స్?

Sreeleela Upcoming movies: 'గుంటూరు కారం' తర్వాత శ్రీ లీలకు అవకాశాలు రావడం కష్టమని కొందరు భావించారు. అయితే... అటువంటి అనుమానాలకు చెక్ పెడుతూ పాన్ ఇండియా సినిమాలో ఆమె ఛాన్స్ అందుకున్నారని తెలిసింది.

తెలుగు తెరపై కథానాయికగా తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసిన, అంత కంటే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకున్న తెలుగమ్మాయి శ్రీ లీల (Sreeleela). 'పెళ్లి సందడి' నుంచి ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'గుంటూరు కారం' వరకు ఆమె వరుస సినిమాలు చేశారు. మహేష్ బాబు సినిమా తర్వాత శ్రీ లీలకు అవకాశాలు రావడం కష్టమని కొందరు భావించారు. అయితే... అటువంటి అనుమానాలకు చెక్ పెడుతూ పాన్ ఇండియా సినిమాలో ఆమె ఛాన్స్ అందుకున్నారని తెలిసింది.

ప్రభాస్ సరసన పాన్ ఇండియా సినిమాలో శ్రీ లీల?
రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు చేసేవి అన్నీ పాన్ ఇండియా సినిమాలే. గత ఏడాది చివర్లో ఆయన హీరోగా నటించిన 'సలార్' థియేటర్లలోకి వచ్చింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ విజయం నమోదు చేసింది. రూ. 650 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అది విడుదల అయ్యే సమయానికి ప్రభాస్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి... నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 ఏడీ'. ఇంకొకటి... మారుతి దర్శకత్వంలో చేస్తున్న 'రాజా సాబ్'. ఈ రెండు కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించారు. 

ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఓ పాన్ ఇండియా సినిమా ప్రొడ్యూస్ చేయనుంది. 'సీతా రామం' విజయం తర్వాత హను ఈ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తున్నారు. ప్రభాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఆయన ఓ ప్రేమకథ రెడీ చేస్తున్నారు. అందులో కథానాయికగా శ్రీ లీలను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

దర్శకుడు హను రాఘవపూడి ఇటీవల శ్రీ లీలను కలిసి కథ, ఆమె పాత్ర గురించి వివరించారట. అయితే... ఇంకా చర్చలు పూర్తి కాలేదు. సినిమాకు శ్రీ లీల సంతకం చేయలేదని తెలిసింది. ప్రభాస్ సినిమా అయితే ఎవరు 'నో' చెబుతారు? త్వరలో ఈ సినిమాలో శ్రీ లీల ఎంపిక అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ALso Readగురూజీ ముఖంలో నవ్వులు - 'గుంటూరు కారం' విడుదలయ్యాక తొలిసారి...

గత ఏడాది శ్రీ లీల నటించిన నాలుగు సినిమాలు విడుదల అయ్యాయి. 'ధమాకా' తర్వాత శ్రీ లీలకు సరైన హిట్ పడలేదు. ఒకవేళ హిట్ పడినా అందులో ఆమె క్యారెక్టర్ ఏముంది? అంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్రభాస్ అభిమానులు సైతం శ్రీ లీల వద్దంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ చేశారు.

Also Readనైంటీస్ వెబ్ సిరీస్ దర్శకుడికి రెండు సినిమా ఆఫర్లు - ఫస్ట్ మూవీ ఏ హీరోతో అంటే?

 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మొదలైన 'ఉస్తాద్ భగత్ సింగ్'లో ఆమె మెయిన్ హీరోయిన్. అయితే... ప్రస్తుతానికి పవన్ రాజకీయాలపై కాన్సంట్రేట్ చేయడంతో ఆ సినిమాను తాత్కాలికంగా పక్కన పెట్టారు. అది కాకుండా నితిన్ 'రాబిన్ హుడ్' సినిమాలో శ్రీ లీల నటిస్తున్నారు.రెమ్యూనరేషన్ గురించి మాత్రమే ఆలోచించడంతో సరైన క్యారెక్టర్లు రాక... వచ్చినవి ఫ్లాప్ కావడంతో శ్రీ లీల కెరీర్ మీద ఎఫెక్ట్ పడే స్థాయికి వచ్చింది.

టాప్ హెడ్ లైన్స్

Ajay Arasada: పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
పవన్ కళ్యాణ్ గారు పిలిచారు... PKCWలో ఛాన్స్? యువ సంగీత దర్శకుడు అజయ్ అరసాడ ఇంటర్వ్యూ
Shravan Reddy: శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
శ్రవణ్ రెడ్డి కెరీర్‌కు గేమ్ ఛేంజర్... 'అగధ'తో తెలుగబ్బాయికి ప్రశంసలు
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 18th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: సంధ్యకి నిజం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చేసిన లక్ష్మీ! ఇకపై విహారి ఇంట్లోనే ఉంటుందా!
Godavari Serial Today August 18th: 'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!
'గోదావరి' సీరియల్: జాను కళ్లముందే సూర్య నిశ్చితార్థం! విషం తాగి సూర్యని లాక్ చేసిన భువన!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Kids Brushing Tips : పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
పిల్లలు పళ్లు తోముకునేటప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. డెంటిస్ట్​ల సూచనలివే
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
Love or Control : Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Narcissistic Abuse అంటే ఏంటి? ప్రేమ పేరుతో మానసికంగా ఎలా కంట్రోల్ చేస్తారు? అనుపమ పరమేశ్వరన్ చెప్పిన RedFlags ఇవేనా?
Embed widget