Filmfare 2024 Winners List: ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో యానిమల్ దూకుడు - ఉత్తమ నటీనటులుగా రణబీర్, అలియా!
69th filmfare awards winners: ఫిల్మ్ ఫేర్ 2024 అవార్డుల్లో 'యానిమల్', '12th ఫెయిల్' సినిమాలకు ఐదేసి అవార్డులు వచ్చాయి. ఇతర కేటగిరీల్లో ఎవరెవరికి అవార్డులు వచ్చాయో చూడండి.
![Filmfare 2024 Winners List: ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో యానిమల్ దూకుడు - ఉత్తమ నటీనటులుగా రణబీర్, అలియా! Filmfare Awards 2024 winners full list Ranbir Kapoor Alia Bhatt couple bagged Best Actor and Actress Filmfare 2024 Winners List: ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో యానిమల్ దూకుడు - ఉత్తమ నటీనటులుగా రణబీర్, అలియా!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/01/29/0184778f551fe98c497db07f564a67cc1706496092091313_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
69th filmfare awards winners full list: వసూళ్ల వర్షంలో మాత్రమే కాదు... అవార్డుల్లో కూడా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' దూకుడు స్పష్టంగా కనబడుతోంది. హిందీ చిత్రసీమ ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ పురస్కారాల్లో ఆ సినిమాకు మొత్తం ఐదు అవార్డులు వచ్చాయి. దాంతో పాటు '12త్ ఫెయిల్' కూడా ఐదు అవార్డులు అందుకుంది. కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా గుజరాత్ గాంధీ నగర్‌లో ఆదివారం అంగరంగ వైభవంగా అవార్డుల వేడుక జరిగింది. కరీనా కపూర్, కరిష్మా కపూర్, వరుణ్ ధావన్, కార్తీక్ ఆర్యన్ పెర్ఫార్మన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఉత్తమ నటీనటులు భార్యాభర్తలే...
రణబీర్ - అలియాకు అవార్డులు!
ఫిల్మ్ ఫేర్ 2024 పురస్కారాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయ్యింది. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి అవార్డులు భార్యాభర్తలకు వచ్చాయి. 'యానిమల్' సినిమాకు గాను ఉత్తమ నటుడిగా రణబీర్ కపూర్ అవార్డు అందుకోగా... 'రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని' సినిమాకు గాను ఉత్తమ నటిగా ఆలియా భట్ అవార్డు అందుకున్నారు. పెళ్లి తర్వాత వీళ్లిద్దరి జంటకు ఫిల్మ్ ఫేర్ అవార్డులు రావడం ఇది తొలిసారి.
అవార్డుల్లోనూ 'యానిమల్' దూకుడు!
Animal movie filmfare awards 2024: బాక్సాఫీస్ బరిలో 'యానిమల్' దుమ్ము రేపింది. వసూళ్ల వర్షం కురిపించింది. ఆ దూకుడుకు ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో కూడా కనిపించింది. నటుడు, గాయకుడు, సంగీతం (పాటలు), నేపథ్య సంగీతం, సౌండ్ డిజైన్... మొత్తం ఐదు విభాగాల్లో అవార్డులు అందుకుంది.
Also Read: పాన్ ఇండియా సినిమాలో శ్రీ లీలకు ఛాన్స్ - ఆ స్టార్ హీరోతో రొమాన్స్?
'12త్ ఫెయిల్' ఏమీ తక్కువ కాదు!
విమర్శకులతో పాటు ప్రేక్షకులు మెచ్చిన '12త్ ఫెయిల్' సినిమా ఏమీ తక్కువ కాదు. రణబీర్ ఉత్తమ నటుడిగా నిలిస్తే... ఆ సినిమా హీరో విక్రమ్ మెస్సీ ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డు అందుకున్నాడు. ఇక... సినిమా, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, దర్శకుడు విభాగాల్లో మరో నాలుగు అవార్డులు అందుకుంది. టోటల్ '12త్ ఫెయిల్' అవార్డులు సంఖ్య కూడా 5. 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహాని'కి నాలుగు అవార్డులు వచ్చాయి. ఇంకా ఏయే సినిమాలకు వచ్చాయో పూర్తి లిస్ట్ చూడండి.
69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో విజేతలు వీరే:
- ఉత్తమ సినిమా: 12త్ ఫెయిల్
- ఉత్తమ సినిమా (క్రిటిక్స్): జోరామ్
- ఉత్తమ దర్శకుడు: విధు వినోద్ చోప్రా (12త్ ఫెయిల్)
- ఉత్తమ నటుడు: రణబీర్ కపూర్ (యానిమల్)
- ఉత్తమ నటి: ఆలియా భట్ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని)
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్): విక్రాంత్ మెస్సీ (12త్ ఫెయిల్)
- ఉత్తమ నటి (క్రిటిక్స్): రాణీ ముఖర్జీ (మిస్సెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే)
- ఉత్తమ సహాయ నటుడు: విక్కీ కౌశల్ (డంకీ)
- ఉత్తమ సహాయ నటి: షబానా అజ్మీ (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని)
- ఉత్తమ సాహిత్యం: అమితాబ్ భట్టాచార్య (తేరే వాస్తే పాట - జరా హట్కే జరా బచ్కే)
- ఉత్తమ సంగీతం: యానిమల్ (ప్రీతమ్, విశాల్ మిశ్రా, మన్నన్ భరద్వాజ్, శ్రేయాస్ పురానిక్, జానీ, భూపిందర్ బాదల్, అశిమ్ కెమ్సన్, హర్షవర్ధన్ రామేశ్వర్, గురిందర్ సెహగల్)
- ఉత్తమ గాయకుడు: భూపిందర్ బాదల్ (అర్జన్ వ్యాలీ - యానిమల్)
- ఉత్తమ గాయని: శిల్పా రావు (బేషరమ్ రంగ్ - పఠాన్)
- ఉత్తమ కథ: అమిత్ రాయ్ (ఓ మై గాడ్ 2)
- ఉత్తమ కథనం: విధు వినోద్ చోప్రా (12త్ ఫెయిల్)
- ఉత్తమ సంభాషణలు: ఇషితా మొయిత్రా (రాకీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని)
Also Read: హృతిక్ రోషన్ కెరీర్‌లో 14 సినిమాలు 100 కోట్లు కలెక్ట్ చేశాయి.. ఆ సినిమాలు ఏమిటో తెలుసా?
నటీనటులు, పాటలు, దర్శకత్వం విభాగాల్లో ఆదివారం అవార్డులు ఇవ్వగా... ఒక్క రోజు ముందు శనివారం సాంకేతిక విభాగంలో అవార్డులు ఇచ్చారు. అందులో ఉత్తమ నేపథ్య సంగీతం విభాగంలో 'యానిమల్' సినిమాకు గాను హర్షవర్ధన్ రామేశ్వర్ అవార్డు అందుకున్నారు. ఇంకెవరికి వచ్చాయో చూడండి
- ఉత్తమ నేపథ్య సంగీతం: హర్షవర్ధన్ రామేశ్వర్ (యానిమల్)
- ఉత్తమ యాక్షన్: స్పారో రజాటోస్, ANL అరసు, క్రేగ్ మాక్రే, యానిక్ బెన్, కెచా ఖమ్ ఫక్డీ, సునీల్ రోడ్రిగ్స్ (జవాన్)
- ఉత్తమ ఛాయాగ్రహణం: అవినాష్ అరుణ్ ధావరే (త్రీ ఆఫ్ అస్ )
- ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: సుబ్రతా చక్రవర్తి, అమిత్ రే (సామ్ బహదూర్)
- ఉత్తమ దుస్తులు(కాస్ట్యూమ్ డిజైన్): సచిన్ లవ్‌లేకర్, దివ్య గంభీర్, నిధి గంభీర్ (సామ్ బహదూర్)
- బెస్ట్ సౌండ్ డిజైన్: కునాల్ శర్మ (సామ్ బహదూర్) & సింక్ సినిమా (యానిమల్)
- ఉత్తమ కూర్పు (ఎడిటింగ్): జస్ కున్వర్ సింగ్ కోహ్లీ, విధు వినోద్ చోప్రా (12వ ఫెయిల్)
- బెస్ట్ వీఎఫ్ఎక్స్: రెడ్ చిల్లీస్ VFX (జవాన్)
- ఉత్తమ కొరియోగ్రఫీ: గణేష్ ఆచార్య ('వాట్ ఝుమ్కా' పాట - రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ)
Also Read: గురూజీ ముఖంలో నవ్వులు - 'గుంటూరు కారం' విడుదలయ్యాక తొలిసారి...
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)