Hrithik Roshan: హృతిక్ రోషన్ కెరీర్‌లో 100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఎన్ని, అవి ఏమిటో తెలుసా?
Hrithik Roshan : 'ఫైటర్' మూవీ హృతిక్ రోషన్ కెరీర్ లో మరో రూ.100 కోట్ల సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
బాలీవుడ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హృతిక్ రోషన్, దీపికా పదుకొనే జంటగా నటించిన చిత్రం 'ఫైటర్'. ఏరియల్ యాక్షన్ డ్రామాగా రూపొందింది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్ అనిల్ కపూర్, అక్షయ్ ఒబెరాయ్, కరణ్ సింగ్ గ్రోవర్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే సిద్ధార్థ్ ఆనంద్ - హృతిక్ రోషన్ కాంబినేషన్లో బ్యాంగ్ బ్యాంగ్, వార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రావడంతో 'ఫైటర్'పై అంచనాలు పెరిగిపోయాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న ఈ సినిమాను వరల్డ్ వైడ్ రిలీజ్ చేయగా... పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో రెండు రోజుల్లోనే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా అరుదైన రికార్డ్ క్రియేట్ చేసింది.
రెండు రోజుల్లోనే రూ.100 కోట్లు
హృతిక్ రోషన్ 'ఫైటర్' మూవీ రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. అగ్నిపథ్, కాబిల్ తర్వాత రిపబ్లిక్ డే సమయంలో రిలీజ్ అయి రూ.100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన హ్యాట్రిక్ మూవీగా 'ఫైటర్' నిలిచింది. మొదటి రోజు రూ.40 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన ఈ మూవీ ఇండియాతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. మూడు రోజుల్లో సినిమా రూ. 150 కోట్లు కలెక్ట్ చేసినట్టు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
హృతిక్ కెరీర్లో 10వ మూవీగా రికార్డ్
హృతిక్ రోషన్ కెరీర్లో వరుసగా రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన పదో సినిమాగా 'ఫైటర్' రికార్డ్ క్రియేట్ చేసుకుంది ఈ పది సినిమాలన్నీ తక్కువ సమయంలో ఈ ఘనతను సాధించాయి. 2001లో 'కభీ ఖుషి కభీ ఘమ్' సినిమా హృతిక్ కెరియర్లో మొదటిసారి రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత ఆయన నటించిన 14 సినిమాలు రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకున్నాయి.
హృతిక్ రోషన్ కెరీర్ లో 100కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఇవే
- కభి ఖుషీ కబీ గమ్ - 135.50 కోట్లు
- క్రిష్ - 126.50 కోట్లు
- ధూమ్ 2 - 151.50 కోట్లు
- జోధా అక్బర్ - 107.75 కోట్లు
- జిందగీ నా మిలేగి దోబరా - 153.25 కోట్లు
- అగ్నీ పథ్ - 194.25 కోట్లు
- క్రిష్ 3 - 291.50 కోట్లు
- బ్యాంగ్ బ్యాంగ్ - 270.75 కోట్లు
- మోహేంజో దారో - 104 కోట్లు
- కాబిల్ - 154.50 కోట్లు
- సూపర్ 30 - 205.25 కోట్లు
- వార్ - 442.50 కోట్లు
- విక్రమ్ వేద - 137 కోట్లు
- ఫైటర్ - 100 కోట్లు.. కౌంటింగ్
ఏరియల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఫ్రాంచైజీ
హృతిక్ రోషన్ 'ఫైటర్' ఫస్ట్ ఇండియన్ ఏరియల్ యాక్షన్ మూవీగా తెరకెక్కింది. మేకర్స్ ఈ ఒక్క సినిమాతో ఆగకుండా ఓ ఫ్రాంచైజీనే ప్లాన్ చేశారు. ఈ ఫ్రాంచైజీ నుంచి మరికొన్ని సినిమాలు రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఈ ఫ్రాంచైజీ లో మరికొందరు బాలీవుడ్ స్టార్స్ భాగం కానున్నట్లు సమాచారం.
Also Read: ప్రియాంకా చోప్రా కజిన్, హీరోయిన్ మన్నారాకు షాక్ - 'బిగ్ బాస్ 17' విన్నర్ అతడేనా?
ఎన్టీఆర్ తో కలిసి 'వార్ 2'
ఫైటర్ తర్వాత హృతిక్ రోషన్ 'వార్ 2'మూవీ చేస్తున్నాడు. 2019లో రిలీజైన వార్ మూవీకి సీక్వెల్‌గా 'వార్ 2' తెరకెక్కుతోంది. బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ ఇందులో మరో లీడ్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాతోనే తారక్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు. దేవర షూటింగ్ పూర్తి కాగానే ఎన్టీఆర్ 'వార్ 2' షూటింగ్ లో జాయిన్ కానున్నారు. 2025 లో ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కనున్న ఈ సినిమాని యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
Also Read: పాన్ ఇండియా సినిమాలో శ్రీ లీలకు ఛాన్స్ - ఆ స్టార్ హీరోతో రొమాన్స్?